ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: ఏపీలో యధావిధిగానే స్కూళ్లు, సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని.. ప్రకటించిన విధంగానే యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని (No Plans to Extend Holidays For Schools ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Ambati Rambabu COVID: అబంటి రాంబాబు‌కు మరోసారి కరోనా, హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపిన సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
Hazarath Reddyసత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబంటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.
COVID in AP: ఏపీలో కొత్తగా 4,570 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలోరాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 30,022 శాంపిల్స్ పరీక్షించగా... 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,028 కేసులు, గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు వెల్లడయ్యాయి.
Kanuma Festival 2022: కనుమరోజు మేకకాళ్ల పులుసు తింటే ఆ కిక్కే వేరప్పా, అయితే ఎలా తయారు చేయాలో చకచకా తెలుసుకుందాం..
Krishnaకనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు.
Kanuma Festival : కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకోవాలి? కనుమనాడు చేయకూడనివి, చేయాల్సినవి ఏమిటి?
Naresh. VNSసంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.
Makar Sankranti 2022: భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా, మకర సంక్రాంతి నాడు పాటించే ఆచారాలు ఏంటి, కనుమ రోజు ఏం చేయాలి, ఈ ఆచారాల వెనుక ఉండే రహస్యాలేంటి ?
Krishnaతెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ పండుగ భోగి మంటలతో, భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి.
Makar Sankranti 2022: సంక్రాంతి వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు, సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజైరన ఏపీ ముఖ్యమంత్రి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని తెలిపిన సీఎం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Ambati Rambabu Dance Video: మహిళలతో చిందేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైసీపీ నేత
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. గుంటూరు జిల్లాలొని సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు, ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి
Hazarath Reddyఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు (Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.
Makar Sankranti 2022: సంక్రాంతి మూడు రోజుల విశిష్టత, జరుపుకునే విధానం గురించి తెలుసుకుందాం,
Krishnaసంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగిమంటలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలు. ఈ పండుగకి ఎగసిపడే భోగిమంటలు రంగురంగుల ముగ్గులు పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి.
Tadepalligudem Road Mishap: పండగ వేళ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడిన చేపల లోడ్ లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyపశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Makar Sankranti 2022: భీమవరం పందెం కోళ్లకు, హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది, ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Krishnaకోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది.
Makar Sankranti 2022: కోడిపుంజుకు కత్తి కట్టడం వచ్చా, అయితే ఒక్క రోజులోనే లక్షల్లో ఆదాయం, కోడి కత్తి వ్యాపారం వెనుక ఉన్న అసలు కథ ఇదే..
Krishnaసంక్రాంతి సమయంలో కోడి కత్తి కట్టే వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. కొంత మంది చచ్చిన కోడిలో కొంత భాగం అడుగుతారు. మరి కొంత మంది డబ్బులు డిమాండ్ చేస్తారు.
Makar Sankranti 2022: ఆన్‌లైన్‌లో అమ్మకానికి పందెం కోళ్లు, లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతులు, సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో జోరుగా దందా...
Krishnaపందెం రాయుళ్లు సోషల్ మీడియాను కూడా వదలట్లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పందెం కోళ్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. సోషల్ మాధ్యమాలు అయిన వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పందెం కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు.
AP Police: నెల్లూరు పోలీసులకు డీజీపీ సవాంగ్ అభినందనలు, అర్థరాత్రి కారు పంక్షర్ కావడంతో SOS కు కాల్ చేసిన మహిళ, సమస్యను పరిష్కరించిన మర్రిపాడు పోలీసులు
Hazarath Reddyమదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్ర మహిళ,అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళనలతో వెంటనే దిశా యాప్ SOS కాల్ చేయగా...10 నిముషాలలో వారి వద్దకు చేరి, వారి సమస్యకు పరిష్కారం చూపి, భరోసా కల్పించిన మర్రిపాడు పోలీసులు.
COVID in AP: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 4,348 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదు, విశాఖ జిల్లాలో 823 కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా... 4,348 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 823 కేసులు గుర్తించారు. ఒక్క పశ్చిమ గోదావరి (86) జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో 100కి పైనే పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
Sankranthi 2022 Cock Fights: సంక్రాంతి కోడి పందెంలో ఓడిన కోడితో చికెన్ పకోడికి యమ డిమాండ్, కేజీ చికెన్ పకోడీ ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు, ఎందుకు అంత స్పెషాలిటీ...
Krishnaపందెంకోడి...అసలు చూడటానికే చాలా స్పెషల్ గా కనిపిస్తుంది...పోటీలో రౌద్రంగా తలపడే ఈ కోడి...మాంసంగా మారాక దీని రుచికి మరేది సాటిరాదు...అందుకే పందె కోడి మాంసం అంటే భోజన ప్రియులు లొట్టలు వేస్తారు...ఓడిపోగానే పందెం కోడి కాసేపటికే చికెన్ పకోడిగా మారిపోతుంది.
Chiranjeevi Meets YS Jagan: ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ, టికెట్ రేట్లు, ఇండస్ట్రీ సమస్యలపై కీలక చర్చ, రేట్ల విషయం తేలేనా?
Naresh. VNSఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Meets YS Jagan). టికెట్ల రేట్లతో పాటూ, సినీ పరిశ్రమకు సంబంధిచిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మద్యాహ్నం లంచ్ సమయంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్‌(YS Jagan) తో సమావేశమయ్యారు చిరంజీవి(Chiranjeevi).
Vaikunta Ekadasi Wishes: రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి
Sankranthi 2022: సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్దం, కోడి పుంజు పెంపకానికి రోజు అయ్యే ఖర్చు ఎంత, ఏ రోజు ఏ రకం పుంజు గెలుసుస్తుంది, తెలుసుకోండిలా...
Krishnaకోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలు సంక్రాంతి కోడిపందాలకు రెడీ అవుతున్నారు. పందెం కోళ్లను ప్రతి రోజు ముగ్గురు సంరక్షించుకుంటారు. పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారు.