ఆంధ్ర ప్రదేశ్
Weather Forecast: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప- 2 సినిమా చూస్తూ రాయదుర్గంలో వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.
Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)
Rudraతమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)
Rudraఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.
Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు
Rudraమంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)
Rudraటాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Threat Calls to Pawan Kalyan: చంపేస్తామంటూ పవన్ కల్యాణ్‌కి బెదిరింపు కాల్స్, నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు
Anitha vs Vijaysai Reddy: వచ్చే ఎన్నికల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు, విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏపీ హోం మంత్రి అనిత
Hazarath Reddyచేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో విషాదం, భార్యను చంపాననే మనస్థాపంతో ఆమె సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న భర్త
Hazarath Reddyగంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపిన తరువాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు.
Rajya Sabha By-Election 2024: ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం
Hazarath Reddyఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ (Rajya Sabha) ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ పార్టీ సోమవారం ప్రకటించింది.
Road Accident Video: వీడియో ఇదిగో, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, క్లీనర్ సజీవ దహనం, గాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్
Hazarath Reddyవిజయనగరం భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుండి వ్యాన్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వ్యాన్ లో చెలరేగిన మంటల్లో వ్యాన్ క్లీనర్ సజీవదహనం అయ్యారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.
Nandyal Horror: నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై పెట్రోల్ పోసి హత్య.. అనంతరం తానూ తగులబెట్టుకొని ఆత్మహత్యాయత్నం (వీడియో)
Rudraఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డినగర్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై ఓ ప్రేమోన్మాది ఘోరానికి పాల్పడ్డాడు. ప్రేమించడంలేదంటూ విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం తాను కూడా నిప్పంటించుకున్నాడు.
Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చట్టం, వైసీపీకి ఒక చట్టమా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండవా? అని ప్రశ్నించిన అంబటి రాంబాబు
VNSఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం...పొలాల్లో మహిళ మృతదేహం, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివారులోని పంటపొలాల్లో మృతదేహం లభ్యమైంది. మృతురాలు రంగా కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.
AP Minister Savita: ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కడప ఎస్పీకి ఆదేశం..విషమంగా బాధితురాలి ఆరోగ్యం
Arun Charagondaకడప జిల్ఆలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
Andhra Pradesh: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్, భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ది..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaపచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ. భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు భర్త. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్ర శేఖర్ కు ఇన్‌స్టాగ్రామ్ లో వివాహితతో పరిచయం, ప్రేమగా మారింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్నారు భర్త. ఇంద్రశేఖర్ ను పట్టుకుని తన భార్య ముందే దేహశుద్ధి చేశాడు భర్త.
Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి.. పల్నాడు జిల్లాలో ఘటన (వీడియో)
Rudraపల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.
Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
Rudraదేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nara Lokesh: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్..ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తయారుచేస్తామని నారా లోకేష్ వెల్లడి
Arun Charagondaబాపట్ల మున్సిపల్ హైస్కూలులో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్ – టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కలిసి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు.
Andhra Pradesh: మంగళగిరిలో కారు బీభత్సం, నలుగురికి తీవ్ర గాయాలు...అతివేగంతో చెట్టును ఢీకొట్టిన కారు, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి బైపాస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో భగీరథ హోటల్ వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.