ఆంధ్ర ప్రదేశ్

AP Covid Update: అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా, ఏపీలో తాజాగా 630 మందికి కోవిడ్ పాజిటివ్, 8,71,305కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) రెండోసారి కరోనావైరస్ సోకింది. గత జులైలో తనకు కొవిడ్ (Second Time Positive) సోకిందని, కొన్నిరోజులకే కోలుకున్నానని అంబటి వెల్లడించారు.

Telugu States Covid: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కోవిడ్, ఏపీలో తాజాగా 599 కేసులు నమోదు, తెలంగాణలో 596 మందికి కరోనా, కోవిడ్‌పై యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు (Telugu States Covid) తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి.ఏపీలో గత 24 గంటల్లో 63,406 కరోనా పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది.

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 664 మందికి పాజిటివ్, మరో 835 మంది రికవరీ, రాష్ట్రంలో 6742గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నప్పటికీ, కొత్త కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది....

YSR Asara & Cheyutha: ఏపీలో అమూల్ ప్రారంభం, వైఎస్సార్‌ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, అమూల్ లాభాల్లో బోనస్ మహిళలకే..

Hazarath Reddy

ఏపీలో అమూల్ ప్రాజెక్టు కార్యకలాపాలను ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో పాటు వైఎస్సార్‌ చేయూత (YSR Cheyutha), ఆసరా (YSR Asara) మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

Advertisement

Attempted Murder in Vizag: విశాఖలో దారుణం, యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది, ఆ తరువాత నిందితుడు ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఏపీ పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖనగరంలోని గాజువాకలో దారుణం (Attempted Murder in Vizag) చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.ఈ సంఘటన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది.

AP YSR Rice Doorstep Delivery Scheme 2020: ఏపీలో ఇంటికే రేషన్ సరుకులు, జనవరి 1 నుంచి మినీ వ్యాన్‌ ద్వారా డోర్‌ డెలివరీ, డ్రైవర్లకు ఉపాధి కల్పించనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని డోర్ డెలివరీ (AP YSR Rice Doorstep Delivery Scheme 2020) చేయాలని నిర్ణయించింది. ఈ డోర్ డెలివరీల విషయంలో (Rice Doorstep Delivery Scheme 2020) 9,260 వాహనాలను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసింది. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా ప్రభుత్వం రేషన్‌ సరకులను (AP Doorstep Delivery Of Quality Rice) మినీ వ్యాన్‌ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది.

Covid Pandemic: కరోనా తగ్గినా డేంజరేనట, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు వంటివి వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు, ఇండియాలో స్పుత్నిక్‌-వి ట్రయల్స్ ప్రారంభం, ఏపీలో తాజాగా 685 మందికి కరోనా

Hazarath Reddy

కరోనా నుంచి కోలుకున్న కొందరిలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తిరగబెడుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రధానంగా ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ’ రకానికి చెందిన రుగ్మతలు బయటపడుతున్నాయని తెలిపారు.

AP Assembly Winter Session 3rd Day: చరిత్రాత్మక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, బిల్లులపై చర్చ చేపట్టలేదంటూ టీడీపీ వాకౌట్, నేడు అసెంబ్లీలో చర్చకు రానున్న 11 బిల్లులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం (AP Assembly Winter Session 3rd Day) ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను (Electricity Duty Bill) మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టాన్ని (Assigned Lands Amendment Act) ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెట్టారు. ఏపీ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ థర్డ్‌ అమైన్‌మెంట్‌ను (AP Value Added Tax Third Aminement) బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు.

Advertisement

Burevi Cyclone: మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, డిసెంబర్ 2న ట్రింకోమలీ వద్ద బురేవి తుఫాన్ తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీ, కేరళకు భారీ వర్ష ముప్పు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం (Extreme low pressure) బలపడుతోంది. ఇది నేటి సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది.

Supreme Court: సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు, పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కొట్టివేసింది. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

TDP vs YSRCP in Assembly: బూతు పదాలతో దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ, ఫేక్ సీఎం అంటూ జగన్‌పై చంద్రబాబు మండిపాటు, తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని

Hazarath Reddy

ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా జరిగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు (TDP vs YSRCP in Assembly) పేలాయి. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సస్పెండ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఫేక్ సీఎం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, వీళ్లంతా గాలికి వచ్చారని, గాలికే పోతారని మండిపడ్డారు.

Coronavirus Scare: ముక్కు ద్వారా లోపలికి కరోనా, కొత్త అంశాన్ని కనుగొన్న జర్మనీ పరిశోధకులు, దేశంలో 31,118 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 381 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో కొవిడ్‌ కేసులు (Coronavirus Scare) కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 40వేలకుపైగా పాజిటివ్‌ నమోదు అవుతుండగా.. తాజాగా గడిచిన 24గంటల్లో 31,118 పాజిటివ్‌ కేసులు (Coronavirus Outbreak in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా రికార్డయిన కేసులతో మొత్తం 94.62లక్షలు దాటాయని చెప్పింది.

Advertisement

AP Assembly Winter Session 2020: పది కీలక బిల్లులు అసెంబ్లీ ముందుకు, రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సస్పెండ్, అసెంబ్లీలో టీడీపీ చేస్తున్న రభసపై మండిపడుతున్న అధికార పార్టీ

Hazarath Reddy

ఏపీ శాసనమండలి ముందుకు ఆంద్రప్రదేశ్ ఆంద్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ చట్టం 2020 రానుంది. అలాగే పలు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకు రానుంది.

JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి కంపెనీకి రూ.100 కోట్ల జరిమానా, త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్దారించిన ఏపీ గనుల శాఖ, ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తునకు వెనుకాడబోమని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి (JC Diwakar Reddy) భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ (AP Mines Department) రూ.100 కోట్ల జరిమానా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

AP Assembly Winter Session 2020: అసెంబ్లీ నుంచి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, సభలో చర్చ సాగకుండా అడ్డుపడిన టీడీపీ సభ్యులు, నేటి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేసిన స్పీకర్

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాల్లో తుపాను నష్టంపై వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు మాట్లాడుతున్న సంధర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. దీంతో చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ ( Chandrababu naidu and tdp mlas suspended) చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

AP Assembly Winter Session 2020: అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్, చంద్రబాబుపై ఏపీ సీఎం సెటైర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, వ్యవసాయరంగంపై కొనసాగిన చర్చ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు హాట్ హాట్ గా మారాయి. గతంలో తీవ్ర చర్చకు దారితీసిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Assembly Winter Session 2020) నేడు ఆమోదం తెలిపింది. అయితే, బిల్లుపై చర్చ జరగనిదే ఎలా ఆమోదిస్తారని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్పందించారు.

Advertisement

AP Assembly Winter Session 2020: ప్రారంభంమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సంతాపం తీర్మానాల అనంతరం సభ వాయిదా, నెల్లూరు మ్యూజిక్‌, డాన్స్‌ ప్రభుత్వ పాఠశాలలకు ఎస్పీ బాలు పేరు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభం అయిన తర్వాత మొదటి అంశంగా సంతాప తీర్మానాలు (Andhra Pradesh Assembly Winter Session 2020) ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ మృతికి ముందుగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

AP Coronavirus: కరోనాపై భారీ ఊరట, ఏపీలో 8 వేలకు దిగివచ్చిన కోవిడ్ యాక్టివ్ కేసులు, తాజాగా 690 మందికి కరోనా, 3,787 మంది డిశ్చార్జ్, 7 మంది మృతితో 6,988కి చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 690 మందికి (AP Coronavirus) పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683కు (Coronavirus Positive Cases) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 3,787 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,52,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

TTD Immovable Assets Row: వెంకన్నకు భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులు అమ్మకుండా శ్వేతపత్రం, డిసెంబర్ 25 నుంచి వైకుంఠ దర్శనం, కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి

Hazarath Reddy

కోవిడ్ ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశం అయింది.

Attacking On Minister Perni Nani: మంత్రి పేర్ని నానిపై దాడి, తృటిలో తప్పిన ప్రమాదం, మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో తాపీతో దాడిచేసిన దుండుగుడు, నిందితుడుని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం (Attacking On Minister Perni) తప్పింది. మచిలీపట్నంలోని (Machilipatnam) మంత్రి నివాసంలో ఓ దుండగుడు తాపితో దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరలు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement