ఆంధ్ర ప్రదేశ్
AP Coronavirus: శుభవార్త, ఏపీలో 7 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్‌గా కేవలం 46,295 కేసులు మాత్రమే, తాజాగా 5,210 మందికి కరోనా, 30 మంది మృతితో 6,224కు చేరుకున్న మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో డిశ్చార్జ్ కేసులు (COVID-19 recoveries) 7 లక్షలు దాటాయి ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,210 కరోనా కేసులు (AP Coronavorus) నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 7,55,727కు కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,224 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం ఏపీలో 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,03,208 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 65.69 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.
CM YS Jagan Writes to CJI: ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ (CM YS Jagan Writes to CJI) రాసిన సంగతి రాసారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అండదండలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party (TDP) అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల ప్రభావం ( files complaint against top SC judge and some judges) ఉందని ఈ లేఖలో సీఎం జగన్ ( CM YS Jagan Mohan Reddy) ఆరోపించారు.
Coronavirus in AP: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా, తాజా కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు ఎక్కువ, తాజాగా 5,653 మందికి కోవిడ్-19, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699, యాక్టివ్ కేసులు 46,624 మాత్రమే
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 73,625 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,653 పాజిటివ్‌ కేసులు (Andhra Pradesh Coronavirus Cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో (Coronavirus In AP) యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,624. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 35 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6194 కు చేరింది.
Heavy Rains Likely To Hit TS: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు (Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం (severe hypothermia) ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది.
AP Unlock 5.0 Guidelines: అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి.., మాస్క్ లేకుంటే నో ఎంట్రీ
Hazarath Reddyకరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను (Unlock 5.0 Guidelines) ప్రకటించింది. స్కూళ్లు, వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలను (AP Unlock 5.0 Guidelines) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
AP Local Body Elections Row: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ నవంబర్‌ 2కి వాయిదా
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections Row) ఎప్పుడు నిర్వహిస్తారో తెలియచేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC)ని ఆదేశించింది. ఇందులో భాగంగా ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
AP EAMCET Result 2020: ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు విడుదల, ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత, ఫలితాలను sche.ap.gov.inలో చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు శనివారం విడుదల (AP EAMCET Result 2020) అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత (AP EAMCET 2020 Results) సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థులు ఎంసెట్‌ ఫలితాలను sche.ap.gov.inలో చూసుకోవచ్చు.
Dr. K.S. Jawahar Reddy: టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ అయిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఈ నెల 15 నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా
Hazarath Reddyవైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ జవహర్‌ రెడ్డి టీటీడీ నూతన కార్యనిర్వహణాధికారిగా (Jawahar Reddy Takes Over As New EO Of TTD) శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా వరాహస్వామి దర్శనం స్వామి దర్శనం చేసుకొని.. అనంతరం శ్రీవారిని దర్శించకున్నారు. ఆయన శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు చేపట్టిన 27వ వ్యక్తి కావడం గమనార్హం.
Bhumana Karunakar Reddy: ఎమ్మెల్యే భూమనకు ఏపీ సీఎం ఫోన్, రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyరెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పరామర్శించారు. శనివారం ఉదయం ఫోన్‌ చేసి ఎమ్మెల్యే ( MLA Bhumana Karunakar Reddy) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు.
COVID in AP: కొవిడ్ నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్, తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో కొత్తగా మరో 5145 మందికి పాజిటివ్, 6110 మంది డిశ్చార్జ్
Team Latestlyచాలా వరకు జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినా, కొన్ని జిల్లాల్లో ఇంకా తీవ్రత కొనసాగుతోంది. ట్రెండ్‌కు భిన్నంగా తూగో జిల్లా కంటే పగో జిల్లా ఎక్కువ కేసులు నమోదు చేసింది. గడిచిన ఒక్కరోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి...
AP POLYCET Result 2020: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్ష 2020 ఫలితాలు విడుదల, 84 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు మరియు కౌన్సిలింగ్ వివరాలు తెలుసుకోండి
Team Latestlyపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 120 మార్కులకు గానూ 120 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించగా, తూర్పు గోదావరికి చెందిన శ్రీ దత్తా సియంసుందర్ 118 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు.....
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5292 మందికి పాజిటివ్, 6102 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 48,661గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyజిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అయితే గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 784 కేసులు నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి నుంచి 652, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి...
English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవితంలో భాగమే, వ్యక్తిగతంగా సమర్థిస్తా, అయితే విచారణలో జోడించలేనని తెలిపిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, ఇంగ్లీష్ మీడియం కేసు వచ్చేవారానికి వాయిదా
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు (English medium education) సంబంధించి జారీచేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే (Chief Justice S.A. Bobde), జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
AP Coronavirus: ఏపీలో కరోనాపై భారీ ఊరట, కేవలం 49,513 కేసులు మాత్రమే యాక్టివ్, 6,78,828కు పెరిగిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, తాజాగా 5,120 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,769 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,120 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా (AP Coronavirus Update) తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427 కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,78, 828గా ఉంది.
AP Police Warns Against Fake News: విగ్రహాల ధ్వంసం వార్త అబద్దం, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ పోలీస్ శాఖ, ఇద్దరిపై కేసు నమోదు
Hazarath Reddyగుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీదేవి, కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేసారని సోషల్ మీడియాలో (social media) పోస్టులు పెట్టడంతో అవి వైరల్ అయిన విషయం విదితమే. అయితే ఈ వార్తలపై ఏపీ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ (AP Police Warns Against Fake News) చేసింది. నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే (fake news posts) కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు.
CM YS Jagan on Irrigation Projects: మాకు చుక్క నీరు కూడా ఎక్కువ వద్దు, రావాల్సిన వాటానే ఇవ్వండి, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, రాయల సీమ ఎత్తిపోతల పథకంపై క్లారిటీ ఇచ్చిన సీఎం
Hazarath Reddyఏపీ రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను మెరుగు పరచడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని(CM YS Jagan on Irrigation Projects) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jaganmohan Reddy) అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. కాగా కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (Gajendra Singh Shekhawat) నేతృత్వంలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సీఎంలతో (Telugu States CMs) మంగళవారం సమావేశమైన సంగతి విదితమే.
Y. S. Rajasekhara Reddy Statue Demolition: వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు, శ్రీకాకుళం జిల్లాలో కొరమలో ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు
Hazarath Reddyఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని శ్రీ‌కాకుళం జిల్లా (Srikakulam) భామిని మండ‌లం కొర‌మలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వసం (Y. S. Rajasekhara Reddy Statue Demolition) చేశారు. విగ్రహాన్ని పెకిలించి వేసి దుండగులు కిందపడేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్‌ 2న డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.
KCR Warns AP Govt: 'ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలను ఆపకపోతే...' ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ వార్నింగ్, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు కాదు, క్రమశిక్షణ పాటించాలని సూచన
Team Latestlyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే.. తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా.. కృష్ణా నదిపై అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు....
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5795 మందికి పాజిటివ్, 6046 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 50,776గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, 6052కు పెరిగిన కొవిడ్ మరణాలు
Team Latestlyచిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 970 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి నుంచి 801, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 696 పాజిటివ్ కేసులు, మరియు ప్రకాశం జిల్లా నుంచి 580 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి.....