ఆంధ్ర ప్రదేశ్

TS-AP Bus Operations: తెలంగాణ-ఏపీ మధ్య బస్సు సర్వీసులకు లైన్ క్లియర్, 322 బస్సులను తగ్గించుకునేందుకు సిద్ధమైన ఏపీఎస్ఆర్టీసీ, రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం

Hazarath Reddy

తెలంగాణ-ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల విషయంలో (Interstate bus services) ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ డిమాండ్‌ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను (TS-AP Bus Operations) తగ్గించనుంది. లాక్‌డౌన్‌ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు రోజుకు 1,009 బస్సుల్ని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నడిపింది. ఇకపై 687 బస్సులను మాత్రమే తిప్పనుంది. తెలంగాణ భూభాగంలో ఇంతకుముందు వరకు 2.65 లక్షల కి.మీ.లలో బస్సులను తిప్పగా ఇక నుంచి 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Krishna Surplus Water Row: కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీకి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం, భారీ ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు వదిలేయాలని కృష్ణ బేసిన్‌లోని పలు జలాశయాలకు సిడబ్ల్యుసి సూచన

Hazarath Reddy

పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతుండటంతో భారీగా ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడంతో నీటిని దిగువకు వదిలేయాలని కేంద్ర నీటి కమిషన్ (సిడబ్ల్యుసి) (Central Water Commission (CWC) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ బేసిన్‌లోని పలు జలాశయాలకు సలహా ఇచ్చింది.

Heavy Rain Alert for Telangana: రూపుమార్చుకున్న అల్పపీడనం, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలో నర్సాపూర్‌, విశాఖపట్నం మధ్య రాత్రికి తీరం దాటే అవకాశం, హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు (Heavy Rains in TS) కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హైచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

Selling ‘Special’ Bottle Gourds: నాగ సొరకాయలు..ఖరీదు అరకోటి పై మాటేనట, కుబేరులవుతారంటూ జనాలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, శ్రీశైలం దేవస్థానంలో ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఓ కొత్త దందా వెలుగులోకి వచ్చింది. కంగా కూరగాయలను మాయగా మార్చేసా లక్షల్లో భక్తులను మోసం చేస్తున్న ఘటనత జనాలు షాకయ్యే పరిస్థితి వచ్చింది. మాయ సొరకాయలు (Selling ‘Special’ Bottle Gourds) అంటూ జనాలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలను కేటుగాళ్లు పోగేసుకున్నారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఈ ముఠా గుట్టు రట్టయింది.

Advertisement

AP Coronavirus: శుభవార్త, ఏపీలో 7 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్‌గా కేవలం 46,295 కేసులు మాత్రమే, తాజాగా 5,210 మందికి కరోనా, 30 మంది మృతితో 6,224కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో డిశ్చార్జ్ కేసులు (COVID-19 recoveries) 7 లక్షలు దాటాయి ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,210 కరోనా కేసులు (AP Coronavorus) నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 7,55,727కు కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,224 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం ఏపీలో 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,03,208 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 65.69 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.

CM YS Jagan Writes to CJI: ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ (CM YS Jagan Writes to CJI) రాసిన సంగతి రాసారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అండదండలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party (TDP) అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల ప్రభావం ( files complaint against top SC judge and some judges) ఉందని ఈ లేఖలో సీఎం జగన్ ( CM YS Jagan Mohan Reddy) ఆరోపించారు.

Ajeya Kallam Press Meet: న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

Hazarath Reddy

Coronavirus in AP: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా, తాజా కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు ఎక్కువ, తాజాగా 5,653 మందికి కోవిడ్-19, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699, యాక్టివ్ కేసులు 46,624 మాత్రమే

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 73,625 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,653 పాజిటివ్‌ కేసులు (Andhra Pradesh Coronavirus Cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో (Coronavirus In AP) యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,624. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 35 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6194 కు చేరింది.

Advertisement

Heavy Rains Likely To Hit TS: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు (Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం (severe hypothermia) ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది.

AP Unlock 5.0 Guidelines: అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి.., మాస్క్ లేకుంటే నో ఎంట్రీ

Hazarath Reddy

కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను (Unlock 5.0 Guidelines) ప్రకటించింది. స్కూళ్లు, వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలను (AP Unlock 5.0 Guidelines) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

AP Local Body Elections Row: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ నవంబర్‌ 2కి వాయిదా

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections Row) ఎప్పుడు నిర్వహిస్తారో తెలియచేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC)ని ఆదేశించింది. ఇందులో భాగంగా ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

AP EAMCET Result 2020: ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు విడుదల, ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత, ఫలితాలను sche.ap.gov.inలో చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు శనివారం విడుదల (AP EAMCET Result 2020) అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత (AP EAMCET 2020 Results) సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థులు ఎంసెట్‌ ఫలితాలను sche.ap.gov.inలో చూసుకోవచ్చు.

Advertisement

Dr. K.S. Jawahar Reddy: టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ అయిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఈ నెల 15 నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా

Hazarath Reddy

వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి టీటీడీ నూతన కార్యనిర్వహణాధికారిగా (Jawahar Reddy Takes Over As New EO Of TTD) శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా వరాహస్వామి దర్శనం స్వామి దర్శనం చేసుకొని.. అనంతరం శ్రీవారిని దర్శించకున్నారు. ఆయన శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు చేపట్టిన 27వ వ్యక్తి కావడం గమనార్హం.

Bhumana Karunakar Reddy: ఎమ్మెల్యే భూమనకు ఏపీ సీఎం ఫోన్, రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

రెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పరామర్శించారు. శనివారం ఉదయం ఫోన్‌ చేసి ఎమ్మెల్యే ( MLA Bhumana Karunakar Reddy) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు.

COVID in AP: కొవిడ్ నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్, తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో కొత్తగా మరో 5145 మందికి పాజిటివ్, 6110 మంది డిశ్చార్జ్

Team Latestly

చాలా వరకు జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినా, కొన్ని జిల్లాల్లో ఇంకా తీవ్రత కొనసాగుతోంది. ట్రెండ్‌కు భిన్నంగా తూగో జిల్లా కంటే పగో జిల్లా ఎక్కువ కేసులు నమోదు చేసింది. గడిచిన ఒక్కరోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి...

AP POLYCET Result 2020: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్ష 2020 ఫలితాలు విడుదల, 84 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు మరియు కౌన్సిలింగ్ వివరాలు తెలుసుకోండి

Team Latestly

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 120 మార్కులకు గానూ 120 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించగా, తూర్పు గోదావరికి చెందిన శ్రీ దత్తా సియంసుందర్ 118 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు.....

Advertisement

AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5292 మందికి పాజిటివ్, 6102 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 48,661గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అయితే గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 784 కేసులు నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి నుంచి 652, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి...

English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవితంలో భాగమే, వ్యక్తిగతంగా సమర్థిస్తా, అయితే విచారణలో జోడించలేనని తెలిపిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, ఇంగ్లీష్ మీడియం కేసు వచ్చేవారానికి వాయిదా

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు (English medium education) సంబంధించి జారీచేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే (Chief Justice S.A. Bobde), జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

AP Coronavirus: ఏపీలో కరోనాపై భారీ ఊరట, కేవలం 49,513 కేసులు మాత్రమే యాక్టివ్, 6,78,828కు పెరిగిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, తాజాగా 5,120 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,769 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,120 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా (AP Coronavirus Update) తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427 కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,78, 828గా ఉంది.

AP Police Warns Against Fake News: విగ్రహాల ధ్వంసం వార్త అబద్దం, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ పోలీస్ శాఖ, ఇద్దరిపై కేసు నమోదు

Hazarath Reddy

గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీదేవి, కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేసారని సోషల్ మీడియాలో (social media) పోస్టులు పెట్టడంతో అవి వైరల్ అయిన విషయం విదితమే. అయితే ఈ వార్తలపై ఏపీ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ (AP Police Warns Against Fake News) చేసింది. నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే (fake news posts) కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement