ఆంధ్ర ప్రదేశ్
Srivari Brahmotsavam: సెప్టెంబర్ 19 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు, హాజరుకానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
Hazarath Reddyతిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు (Tirumala Srivari Brahmotsavams) సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప (ap-cm-jagan-karnataka-cm-yediyurappa) కూడా హాజరవుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
Inter-State Bus Services: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు, సెప్టెంబర్ 14న ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు భేటీ వార్తలపై స్పందించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు (Inter-State Bus Services) నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు (Transport ministers of Telugu States) పేర్ని నాని, పువ్వాడ అజయ్ సెప్టెంబర్ 14న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, సంబంధిత ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఎలాగైనా ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు చర్చించనున్నారు.
Three Capitals Row: మూడు రాజధానులు తప్పులేదు, ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు, విభజన చట్టంలో రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కార్లిటీ (Centre clarifies on 3 capitals in AP) ఇచ్చింది. ఇందులో భాగంగా మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు (Three Capitals) తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో (bifurcation Act) ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.
Capital Assigned Lands Case: రాజధాని అసైన్డ్‌ భూముల కేసు, హైకోర్టు దర్యాప్తును నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 21వ తేదీలోపు పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ప్రతివాదికి నోటీసులు జారీ
Hazarath Reddyగత ప్రభుత్వంలో ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జరిగిన అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారంలో (Capital Assigned Lands Case) సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో అవకతవకలను, అక్రమాలను వెలికితీసేందుకు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నసీఐడీ దర్యాప్తును హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
PUBG Ban: పబ్‌జీ బ్యాన్, ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య, మరోచోట మొబైల్‌లో గేమ్‌ ఆడవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య, కుటుంబాల్లో విషాదాన్ని నింపిన మొబైల్ వ్యసన ఘటనలు
Hazarath Reddyఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం (PUBG Ban) విధించింది. ఈ నేపథ్యంలో బాటిల్‌ గ్రౌండ్‌ గేమ్‌ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) పబ్ జీ బ్యాన్ తో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని (Btech student hangs self) ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4779కి పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyతూర్పు గోదావరి జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే....
CBI to Probe Antarvedi Incident: అంతర్వేది రథం దగ్ధం ఘటన సిబిఐకి అప్పగింత, జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ ఘటనను సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారని సీఎంఓ ప్రకటన
Team Latestlyఏపీ ప్రభుత్వం ఘటన దర్యాప్తును సిబిఐకి అప్పజెప్తున్నట్లు శుక్రవారం జీవో విడుదల చేసింది. సెక్షన్‌ 6, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది...
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభన, గత 24 గంటల్లో కొత్తగా మరో 10,175 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 37 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య
Team Latestlyతాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 5,34,792 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.....
Antarvedi Temple Chariot Fire: కుట్ర కోణంపై దర్యాప్తు జరుగుతోంది. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, నిరసన కార్యక్రమం చేపడుతున్న బీజేపీ
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో (Antarvedi Temple Chariot Fire) కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ (Vellampalli Srinivas) తెలిపారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై (Antarvedi chariot fire accident) అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని తెలిపారు.
Coronavirus in AP: ఏపీలో తాజాగా 10,418 మందికి కరోనా, 5,27,512కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 74 మంది మృత్యువాతతో 4,634కి చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో మరోమారు 10 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 71,692 నమూనాలు పరీక్షించగా 10,418 మందికి కరోనా (Coronavirus) నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కి (Coronavirus cases in Andhra Pradesh) చేరింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా 74 మంది మృత్యువాత పడగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,634కి పెరిగింది.
Kisan Train: అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు. జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు తోమర్, సురేష్, అక్టోబరు నుంచి ప్రతి రోజూ ఢిల్లీకి కిసాన్ రైలు
Hazarath Reddyఏపీలో అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్‌ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌, ఏపి సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ట్రైన్‌ను జెండా ఊపి (AP CM YS Jagan flags of Kisan train) ప్రారంభించారు. అనంతరం కిసాన్‌ రైలు అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరింది.
Special Trains: ఏపీ నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల లిస్టు వచ్చేసింది, సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వేశాఖ, ఏపీ నుంచి 24 ప్రత్యేక రైళ్ల రాకపోకల సమాచారం మీకోసం
Hazarath Reddyప్టెంబర్ 12 నుంచి ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను (IRCTC special trains) నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అన్‌లాక్‌ 4.0లో (Unlock 4) భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.
APSET 2020: విద్యార్థులు రెడీ అయ్యారా..రేపట్నుంచే ఏపీ సెట్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సురేష్
Hazarath Reddyఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్‌’ (APSET 2020) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు (Andhra Pradesh State Eligibility Test) సన్నాహాలు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.
CPM Workers Protest: రోడ్డుపై ఈత కొట్టిన సీపీఎం నేతలు, అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన, విజయనగరం కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో నిరసన ఘటన
Hazarath Reddyవిజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలోని అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వినూత్న రీతిలో నిరసన (CPM Workers Protest) తెలిపారు . బురదమయమైన రోడ్లపై ( Potholes in Vizianagaram) అరటి మొక్కలు నాటారు. నీళ్లు తోడారు. చేపలు పట్టారు. ఈత (CPM Workers Swim) కొట్టారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషాను కలిపే ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వాపోయారు.
Coronavirus in AP: కరోనాపై గుడ్ న్యూస్, ఏపీలో 4 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 96,769 కేసులు, తాజాగా 10,601 మందికి కోవిడ్-19, మరణాల సంఖ్య 4,560కు చేరిక
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 70,993 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 10,601 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు (Coronavirus in AP) చేరింది. కొత్తగా 73 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,560కు (Coronavirus Deaths) చేరింది. సోమవారం 11,691 మంది కరోనా (Coronavirus (COVID-19) నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 4,15,765 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 96,769 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
CM YS Jagan VC With Collectors: కరోనా పరీక్షలు తప్పనిసరిగా జరగాలి, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్‌ స్పందన వీడియో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సమీక్ష
Hazarath Reddyరాష్ట్రంలో కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ (CM YS Jagan VC With Collectors) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. కోవిడ్‌ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్‌వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ ( YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు.
Liquor Consumption in AP: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం వినియోగం, 5 నెలల్లో రూ.2,170 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ప్రభుత్వం, మద్యం నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయా..
Hazarath Reddyఏపీలో మద్యం నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయా.. తాజా గణాంకాలు ఇది నిజమనే చెబుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మద్యం వినియోగం (Liquor Consumption in AP) గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యాన్నితమ ఆదాయ వనరుగా చూడటం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Antarvedi Temple Chariot Fire: రూ. 90 లక్షలతో కొత్త రథం, అంతర్వేది రధం దగ్ధం ఘటనలో ఈవో సస్పెండ్, నిజాలను నిగ్గు తేల్చేందుకు అంతర్గత విచారణ కమిటీ, టీడీపీకి మాట్లాడే హక్కు లేదని తెలిపిన మంత్రి శ్రీనివాస్
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన (Antarvedi Temple Chariot Fire) చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెదపాటి అమ్మాజీతో క‌లిసి ఆయ‌న సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో రథం దగ్ధం అయిన ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు.
Jaya Prakash Reddy: మరో అద్భుతమైన నటరత్నాన్ని కోల్పోయిన టాలీవుడ్, నటుడు జయ ప్రకాష్ రెడ్డి హఠాన్మరణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
Team Latestlyజయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో కూడా విలన్ ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించిన ఆయన నాలుక మడతబెడుతూ ' వీడిని పండబెట్టి, పీకకోసి.. హుమ్.. హుమ్..' అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్....