ఆంధ్ర ప్రదేశ్
Swachh Survekshan 2020: స్వచ్ఛ సర్వేక్షణ్ -2020, ఏపీలో సత్తా చాటిన మూడు నగరాలు, టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
Hazarath Reddyభారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను (Swachh Survekshan awards 2020) గురువారం ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా నాలుగో సారి ఇండోర్‌ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో సూర‌త్‌(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మ‌హారాష్ట్ర‌) నిలిచాయి. మొద‌టి ప‌ది స్థానాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విజ‌య‌వాడ‌ (Vijayawada), విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam), తిరుప‌తి (Tirupati) న‌గ‌రాలు కూడా చోటు ద‌క్కించుకున్నాయి. గురువారం 'స్వ‌చ్ఛ మ‌హోత్స‌వ్' కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.
AP Coronavirus Update: ఏపీలో మొత్తం 2,35,218 మంది డిశ్చార్జ్, రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 95 మంది మృత్యువాత, 3,25,396కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 9,393 మందికి (COVID 19 Cases) పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు (AP Coronavirus Update) చేరింది. 55,551 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా వైరస్‌ నుంచి 8,846 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం 2,35,218 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 95 మంది మృత్యువాత పడగా ఇప్పటి వరకు మొత్తం 3001 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,74,847 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Treasury Employee Corruption: అనంతపురంలో రూ.3 కోట్ల అవినీతి బట్టబయలు, ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ గాజుల మనోజ్‌కుమార్‌ అవినీతి ఖజానా మీద స్పెషల్ కథనం
Hazarath Reddyఅనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ గాజుల మనోజ్‌కుమార్‌ అవినీతి (Treasury Employee Corruption) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొత్తం అవినీతి ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే (Treasury Employee Massive Corruption) ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్‌ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి.
Covid Insurance to RTC Employees: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా, ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కూడా వర్తింపు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం (AP Govt) అన్ని వర్గాలకు అనుగుణంగా తన నిర్ణయాలను తీసుకుంటూ వెళుతోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు (APRTC Employees) జగన్ సర్కారు శుభవార్తను అందించింది. అర్టీసీ కార్మికులకు కరోనా బీమా (Covid Insurance to RTC Employees) వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. కార్మిక పరిషత్‌ నేతలు ఆగస్టు 19న ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును (APSRTC MD Krishna Babu) కలిసి బీమా కల్పించాలంటూ కార్మికులు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్‌ బీమా వర్తింపచేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
Ganesh Chaturthi 2020: వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి
Hazarath Reddyఏపీలో వినాయక చవితి వేడుకలపై వైయస్ జగన్ సర్కారు ( YS Jagan Govt) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్ధితులపై సాధారణ పరిపాలనశాఖ, పోలీస్‌, వైద్యశాఖతో లోతుగా సమీక్ష నిర్వహించిన తర్వాత బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం (Govt issues guidelines) ఈ ఏడాది రోడ్లపై వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఆంక్షలు ఉల్లంఘించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Water War: నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనలో అర్థం లేదు, కౌన్సిల్ సమావేశంలో పూర్తి ఆధారాలతో నిలదీయాలని అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన
Team Latestlyపోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా....
Swarna Palace Fire: రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించింది, అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి రిపోర్టును అందజేసిన విచారణ కమిటి, రిపోర్టులోని కీ పాయింట్స్ కథనంలో..
Hazarath Reddyవిజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి (investigative committee) ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ రిపోర్టులో రమేష్‌ ఆస్పత్రి (Ramesh Hospitals) అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తెలిపింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను పట్టించుకోకుండా 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్‌ అనుమానితులతో పాటుగా వైరస్‌ సోకని వారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదని ప్రభుత్వ అనుమతులు రాకముందే.. హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో (Swarna Palace) కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు తేల్చిచెప్పింది.
Three Capital Row: రాజధాని అంశం అసలు మా పరిధిలో లేనే లేదు, హైకోర్టు నోటీసులపై మరోసారి స్పందించిన కేంద్రం, మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyరాజధాని విషయంలో హైకోర్టు (AP High Court) ఇచ్చిన నోటీసులపై మరోసారి కేంద్రం స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం (Three Capital Row) మా పరిధిలో లేదంటూ తేల్చేసింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అంటూ పేర్కొంది. ఇదే విషయాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులోనే కొత్తగా మరో 9,742 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,16,003కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3 వేలకు చేరువైన కరోనా మరణాలు
Team Latestlyమరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,061 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,26,372 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 86,725 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
AP Cabinet Key Decisions: కేబినెట్ భేటీలో ఏపీ సీఎం పలు కీలక నిర్ణయాలు, వైఎస్సార్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం, డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు ( key decisions) తీసుకున్నారు. ఈ సందర్భంగా వైస్సార్‌ ఆసరా పథకానికి (YSR Arogya Asara Scheme) ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించనున్నారు.
AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఏపీ సీఎం జగన్, సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ (Chief Minister YS Jagan Mohan Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి ఈ కేబినెట్‌ బేటీలో (Andhra Pradesh Cabinet) ఆమోదం తెలపనున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించడంతో పాటు .. నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.
Family Committed Suicide Attempt: ఇంటి పెద్దను బలి తీసుకున్న కరోనా, మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని పసివేదలలో విషాద ఘటన
Hazarath Reddyపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలలో (Pasivedala Village in Kovvur) విషాదం చోటు చేసుకుంది. ఇంటిపెద్ద కరోనా వైరస్‌తో చనిపోవడం ఆ కుటుంబసభ్యులు భరించలేకపోయారు.దీంతో మనస్తాపానికి గురైన చెందిన కుటుంబం గోదావరిలో నదిలో (Family Suicide Attempt) దూకింది. విషాద ఘటన వివరాల్లోకెళితే.. పసివేదలకు చెందిన నరసయ్యకు భార్య పరిమి సునీత, కుమారుడు ఫణికుమార్‌, కుమార్తె అన్నపూర్ణ ఉన్నారు. కాగా నరసయ్య కోవిడ్‌తో (Covid) బాధపడుతూ ఇటీవలే తనువు చాలించాడు.
House Site Pattas: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా
Hazarath Reddyవైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి (House Site Pattas) సంబంధించి ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
AP Coronavirus Report: ఏపీలో మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 9,211మంది డిశ్చార్జ్, గత 24 గంటల్లో 9,652 మందికి కరోనా, 2820కి చేరుకున్న మరణాల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలు (AP Coronavirus Report) దాటింది. 24 గంటల వ్యవధిలో9652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 306261 కి పెరిగింది. కాగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజు 9,211మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,18,311కి చేరింది. కరనా బారినపడి గడచిన 24 గంటల్లో 88 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2820కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,61,611 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 85,130 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
CM Jagan Review on floods: ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.2 వేల ఆర్థిక సాయం, గోదావరి వరద పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌
Hazarath Reddyగోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM YS Jagan video conference) నిర్వహించారు. వరద పరిస్థితులపై (Godavari flood situation) కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టా నాతో రానవసరం లేదని అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని సీఎం జగన్‌ తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
Chandrababu Letter Row: ఫోన్ ట్యాపింగ్ అంతా డ్రామా, చంద్రబాబుపై మండిపడిన ఏపీ హోంమంత్రి సుచరిత, ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన హోం మంత్రి
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ (phone tapping) జరుగుతోందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై ఏపీ హోం మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని (Chandrababu Naidu trying to create unrest in AP) రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో (DGP Gautam Sawang) కలసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సుచరిత (AP Home minister Mekathoti Sucharitha) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌లు ట్యాప్‌ చేస్తోందని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఫోన్‌లు ట్యాప్‌ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించారు.
Vijayawada Murder Attempt: విజయవాడలో దారుణం, కారుపై పెట్రోలు పోసి ముగ్గురి వ్యక్తుల సజీవ దహనానికి నిందితుడు ప్రయత్నం, డబ్బుల వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు
Hazarath Reddyఏపీలోని విజయవాడలో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం ముగ్గురు వ్యక్తుల సజీవ దహన యత్నానికి (Vijayawada Murder Attempt) కారణమైంది. బెజవాడ నోవాటల్ హోటల్ వద్ద కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో జరిగిన డబ్బులు వ్యవహారమే (Vijayawada Real Estate Spat) హత్యాయత్నానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్‌ సమీపంలోని భారతీనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
Swarna Palace Fire Accident: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం, రమేష్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు, కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే ఎవరికైనా నోటీసులు ఇస్తామని తెలిపిన ఏసీపీ సూర్యచంద్రరావు
Hazarath Reddyఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద దుర్ఘటనకు (Swarna Palace Fire Accident) సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్‌ కార్డియాక్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు (Dr. P. Ramesh Babu) ఆగస్టు 17న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అగ్నిప్రమాదంలో కరోనా రోగులు మృతి చెందిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్‌ రోగులకు చికిత్స చేసేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతి ఇచ్చారని తెలిపారు.
Heavy Rains Alert in AP: మరో మూడు రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు
Hazarath Reddyఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains Alert in AP) కురవనున్నాయి. తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం (AP IMD) వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
AP coronavirus: కరోనాపై ఏపీలో భారీ ఊరట, రెండు లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ కేసులు 84,777, గత 24 గంటల్లో 6,780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 7,866 మంది కోవిడ్‌ (AP coronavirus)నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య (Coronavirus Cases) 2,09,100కి పెరిగింది. గత 24 గంటల్లో 44,578 శాంపిల్స్‌ పరీక్షించగా కొత్తగా 6,780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,05,521 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్‌ కేసులు 84,777 ఉన్నాయి. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2732కి చేరాయి.