ఆంధ్ర ప్రదేశ్

AP Corona Report: ఏపీలో 2341 యాక్టివ్‌ కేసులు, మొత్తం 5280​కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, గత 24 గంటల్లో 193 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 193 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Corona Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ (AP Health department) విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5280​కి చేరింది. గడిచిన 24 గంటల్లో 15,911 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 193 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా చిత్తూరు, ప్రకాశం నుంచి రెండు మరణాలు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య 88కి చేరింది. కాగా ఇవాళ కొత్తగా 81 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 2851 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

AP Budget 2020-21 Highlights: రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్, రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం, బడ్జెట్‌లోని ప్రధాన అంశాల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం (AP CM YS Jagan Mohan Reddy) రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను (AP Budget 2020) ఏపీ ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (FM Buggana Rajendranath Reddy), మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Three Capitals in AP: ఏపీలో మూడు రాజధానులకు సై, ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందుతుందని ప్రసంగంలో తెలిపిన గవర్నర్, ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Session 2020) ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అనూహ్యంగా మూడు రాజధానుల అంశాన్ని (Three Capitals in AP) తీసుకువచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

AP Budget Session 2020: ఏపీ బడ్జెట్ ప్రతులకు పూజ చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన, నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం, ముగిసిన గవర్నర్ ప్రసంగం

Hazarath Reddy

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులకు తన ఛాంబర్ లో పూజలు నిర్వహించారు. గతేడాది ప్రభుత్వం 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి మరింత పెద్ద బడ్జెట్ ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో సంక్షేమ పథకాలు, నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement

Biswabhusan Harichandan: సీఎం వైయస్ జగన్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు, తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session 2020) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ (2020-21) సమావేశాలు సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ (Governor Biswabhusan Harichandan) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్‌భవన్‌ (Raj Bhavan) నుంచి గవర్నర్ ప్రసంగం చేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP cM YS Jagan) నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.

AP Budget Session 2020: కరోనా కల్లోలంలో ఉత్కంఠ రేపుతున్న ఏపీ బడ్జెట్, మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు, రెండు రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

కరోనా కారణంగా దాదాపు మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బడ్జెట్ సమావేశాలు (AP Budget Session 2020) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చిలో జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) బడ్జెట్‌ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ రెండు రోజులకే వాటిని కుదించినట్లుగా తెలుస్తోంది.

Vizag Gas Leak Incident: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న అత్యున్నత న్యాయస్థానం, విచారణ రెండు వారాల పాటు వాయిదా

Hazarath Reddy

విషవాయువు లీకేజీ దుర్ఘటనను (Vizag Gas Leak Incident) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవడాన్ని, హైకోర్టు (High Court) ప్లాంట్‌ను సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణ వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని తెలిపింది.

AP Budget Session 2020: బడ్జెట్ సమావేశాలకు వేళాయెనే, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ, మండలిలోని ప్రతి సీటు శానిటేషన్‌, వెల్లడించిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Hazarath Reddy

ఏపీలో బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. ఏపీ బడ్జెట్‌ సమావేశాలపై (AP Budget Session 2020) స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు శ్రీనివాసులు, ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులు, పలు శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

AP Coronavirus: కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్‌, పుట్టిన పాపకు నెగిటివ్, ఊపిరి పీల్చుకున్న వైద్య సిబ్బంది, ఏపీలో తాజాగా 246 కోవిడ్-19 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను (AP Coronavirus) వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 246 మందికి పాజిటివ్ కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన లెక్కలను పరిశీలిస్తే.. గత 24 గంటల్లో 15,173 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 47 మంది కోవిడ్ నుంచి తేరుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కర్నూల్, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు.

Kanipakam Temple Closed: కాణిపాకంలో కరోనా కలకలం, 2 రోజుల పాటు వినాయకుని గుడి మూసివేత, దర్శనాలు రద్దు, ఈ నెల 21వ తేదీన కనకదుర్గ ఆలయం మూసివేత

Hazarath Reddy

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో (Kanipakam Temple) కరోనా కలకలం సృష్టించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ( Swayambhu Varasiddhi Vinayaka Swamy temple) ఆలయ హోం‌గార్డుకు కరోనా వైరస్‌ (COVID-19) సోకడంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

APSRTC: నేటి నుంచి కర్ణాటకకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్, ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభం, apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం

Hazarath Reddy

అంతర్రాష్ట​ బస్సు సర్వీసులను నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) రెడీ అయింది. ఈ నెల 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు (APSRTC buses to Karnataka) నడవనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు (Karnataka) బస్సులు నడపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు, రేపు రానున్న ఫలితం, ఇద్దర్నీ కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన అధికారులు, ఫోర్జరీ సంతకాలతో స్కామ్ చేశారని ఆరోపణలు

Hazarath Reddy

దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాల కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి (TDP leader JC Prabhakar Reddy), ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్‌ జైలులో (Kadapa Central Prison) రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్‌ జైలులో ఖైదీలకు ములాఖత్‌ నిలిపివేశారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించి అక్రమాలకు (BS-III trailer lorries case) పాల్పడిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డి (asmith reddy) కడప సెంట్రల్‌ జైలులో ఉంట్నున్న సంగతి తెలిసిందే.

Advertisement

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 294 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,152కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 84కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

రాష్ట్రంలో కొత్తగా మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్నూలు నుంచి ఒకరు తూర్పుగోదావరి జిల్లా నుంచి మరొకరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 84 కు పెరిగింది....

AP's COVID19 Report: విశాఖలో కోవిడ్‌ను జయించిన 4 నెలల శిషువు, ఏపి‌లో గత 24 గంటల్లో కొత్తగా 222 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5,858 కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో కొత్తగా మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 82 కు పెరిగింది....

JC Prabhakar Reddy Arrest: టీడీపీకి మళ్లీ షాక్, పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించారని ఆరోపణలు

Hazarath Reddy

టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ పోలీసులు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసిన ఉదంతం మరచిపోకముందే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని (JC Prabhakar Reddy Arrest) పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని (Asmith Reddy) అనంతపురం పోలీసులు (Anantapur police) అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AP Coronavirus: తిరుమలలో తొలి కరోనా పాజిటివ్ కేసు, ఏలూరులో భార్యకు కరోనా రావడంతో గుండెపోటుతో భర్త మృతి, ఏపీలో తాజాగా 141 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ (Health Department) విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,402 కేసులు (COVID 19 Cases) నమోదవ్వగా, 80 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మొత్తం 2,599 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 1723 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

Manabadi AP Inter Result 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్ వే హోటల్ లో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలను ఒకే రోజు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, పలు చోట్ల పొంగిపొర్లిన వాగులు, మరో 24 గంటల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ శాఖ

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపనాలు (Southwest Monsoon) ఒక్కరోజులోనే రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రుతుపవనాలకుతోడు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. అల్పపీడనం, రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది.

Dr.Sudhakar Case: డాక్టర్ సుధాకర్ పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మండిపడిన విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా

Hazarath Reddy

ఇటీవల సస్పెన్షన్‌కి గురైన వివాదాస్పద వైద్యుడు సుధాకర్‌ (Dr.Sudhakar) పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వస్తూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా (Visakhapatnam CP R K Meena) మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలమేరకు (AP High Court) సుధాకర్‌పై నమోదైన కేసును సీబీఐకి అప్పగించారని, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ఆయన పోలీస్‌స్టేషన్‌కు రావడం ఎందుకని సీపీ మీనా ప్రశ్నించారు.

ESI Medicine Scam: రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్‌ రవికుమార్‌

Hazarath Reddy

ఈఎస్‌ఐ కుంభకోణంలో (ESI Medicine Scam) ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ( Tekkali TDP MLA Atchannaidu) ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ (ACB) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement