ఆంధ్ర ప్రదేశ్

AP Degree Exams Cancelled: ఏపీలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు, ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు నేరుగా పై తరగతులకు ప్రమోట్

Hazarath Reddy

కరోనావైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా పరీక్షలు నిర్వహించకుండానే (AP Degree Exams Cancelled) పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సెలర్లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లతో మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, అకడమిక్‌ క్యాలెండర్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్‌ కోర్సులన్నింటి పరీక్షలు (UG / PG Semester Exams) రద్దు చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు.

New Districts in AP: ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు (New Districts in AP) ఏర్పడబోతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) ఈరోజు క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు అందుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) మాట్లాడుతూ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి ఈ మాట రాగానే అలర్ట్ అయిన అధికారులు తమ వైపు నుంచి కసరత్తును ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

AP Coronavirus: ఏపీలో ఒక్కరోజే 8 మంది మృతి, తాజాగా 407 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు, ఏపీలో 9834కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 407 కరోనా పాజిటివ్‌ కేసులు (AP coronavirus) నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 8 మంది మరణించారు.

Nimmagadda Meeting with BJP Leaders: మీటింగ్ మతలబు అదేనా?, బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్లో రహస్య భేటీ, సుప్రీంకోర్టులో విచారణలో నిమ్మగడ్డ తొలగింపు అంశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో (Kamineni Srinivasa Rao) రమేష్‌ కుమార్‌ ఇటీవల ఓ హోటల్లో భేటీ కావడం (Nimmagadda Meeting with BJP Leaders) సంచలనం సృష్టిస్తోంది.హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగినట్టుగా సీసీటీవీ పుటేజీ (CCTV Footage) బయటకు వచ్చింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగినట్లుగా ఆ సీసీ టీవీ పుటేజీలో తెలుస్తోంది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Prepaid Meters Policy: ఏపీలో రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్, త్వరలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు తీసుకువచ్చే ప్రయత్నాలు, ఏపీ విద్యుత్ శాఖ కొత్త వ్యూహం

Hazarath Reddy

ఏపీలో ప్రతి నెలా కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్‌ శాఖకు (AP Electricity Department) తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ (EPDCL) కొత్త వ్యూహాలను అన్వేషిస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే నెలరోజుల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్‌ మీటర్లు (Prepaid Meters Policy) అమర్చడానికి ఏపీ విద్యుత్ శాఖ రెడీ అవుతోంది. భుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి బకాయిలు కోట్లలో పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా బకాయిలకు తావులేకుండా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

AP MLA Tests Positive for COVID-19: ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ

Hazarath Reddy

కరోనా వైరస్‌ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకు (YCP S.Kota MLA) కూడా కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే (Srungavarapukota MLA) శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

AP Coronavirus Report: ఒకే కుటుంబంలో ఏడుమందికి కరోనా, గుంటూరు జిల్లాలో గంటకు నాలుగు కరోనా కేసులు, ఏపీలో తాజాగా 443 కోవిడ్-19 కేసులు నమోదు, రాష్ట్రంలో 9,372కి చేరిన కేసులు సంఖ్య

Hazarath Reddy

ఏపీలో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704నమూనాలు పరీక్షించగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 New cases) నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మందికి, విదేశాల నుంచి వచ్చిన 7 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

AP CM YS Jagan Review: ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Hazarath Reddy

కరోనా నియంత్రణ చర్యలపై (COVID-19) సోమవారం ఏపీ సీఎం వైయస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM YS Jagan Review) జరిపారు. ఈ సమీక్షలో 104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. . 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌ చేయాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలిచ్చారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు.

Advertisement

High Rain Alert: రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఆదివారం తడిసి ముద్దయిన విజయవాడ

Hazarath Reddy

ఏపీలో (Andhra Pradesh) రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (Special rain alert) కురవనున్నాయి. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమ, మంగళ బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (High Rain Alert) కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు (Vizag IMD) వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అయితే కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది.

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 477 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,929కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 106కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

రాష్ట్రంలో కొత్తగా మరో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, కర్నూల్ నుంచి ఒకరు మరియు చిత్తూరులో ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 106 కు పెరిగింది....

AP SSC Exams 2020: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి

Team Latestly

ఏపి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. కాగా, ఇప్పటికే తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే....

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 491 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,452కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 100 దాటిన కరోనా మరణాలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బాదితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,452 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి...

Advertisement

Rajya Sabha Election Results 2020: టీడీపీకి భంగపాటు, ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, దేశంలో 11 స్థానాలకు ఫలితాలు వెల్లడి

Hazarath Reddy

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు (AP Rajya Sabha Election Results 2020) ఏకపక్షంగా సాగాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ (YSRCP) తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి.

Vaccine Manufacturing Unit: పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌, 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ, ఐజీవైతో కీలక ఒప్పందం చేసుకున్న ఏపీ సర్కారు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. ఏపీలో ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని (Vaccine Manufacturing Unit) నెలకొల్పే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో (APCARL In Pulivendula) వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) సమక్షంలో ఐజీవైతో (Immunologix India Pvt Ltd (IGY)అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు (APCARL CEO Dr M Srinivasarao), ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

AP Coronavirus Report: ఒక్కరి ద్వారా 226 మందికి కరోనా అంటుకుంది, మళ్లీ ఒంగోలులో 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్, ఏపీలో కొత్తగా 376 కేసులు నమోదు, 6230కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 376 కొత్త కేసులు (Andhra Pradesh Coronavirus) నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,609 శాంపిల్స్‌ని పరీక్షించగా 376 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 82 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో మరో నలుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 6230కి (coronavirus cases in AP) చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 96గా నమోదైంది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3065కి (AP Coronavirus) చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3069 మంది చికిత్స పొందుతున్నారు.

Illegal Registration Case: జేసీ ఫ్యామిలీకి షాక్, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అనంతపురం కోర్టు, మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ

Hazarath Reddy

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్ల అక్రమాల కేసులో (Illegal Registration Case) అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ల బెయిల్‌ పిటిషన్‌ను గురువారం అనంతపురం కోర్టు (Anantapur Court) తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను (JC Prabhakar Reddy, Asmith Reddy) రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు (PT warrants) జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు.

Advertisement

AP Coronavirus: మరో రికార్డు దిశగా ఏపీ, ఆరు లక్షల మార్కుకు చేరువలో కరోనా టెస్టులు, ఏపీలో తాజాగా 299 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 299 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ కేసులను కలుపుకుని రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 5854 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 13,923 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 299 మందికి పాజిటివ్‌గా (Coronavirus Outbreak) నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా ( COVID-19) నుంచి కోలుకుని 77 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 92కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,983 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 2,779 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

YSR Nethanna Nestham: వారి అకౌంట్లోకి నేరుగా రూ.24,000, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, ఈ నెల 20న అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చుకుంటూ వెళుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం (YSR Nethanna Nestham) ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ఏపీ ప్రభుత్వం (AP Govt) స్పష్టం చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల (Grama Volunteers) ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది.

Vedadri Road Accident: వేదాద్రి మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం రూ.5లక్షల పరిహారం, తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Vedadri Road Accident) చనిపోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Divya's Murder Case Facts: దివ్యను లక్షకు అమ్మేశారు, శరీరం కుళ్లిపోయేలా వాతలు పెట్టి చంపేశారు, విశాఖ దివ్య హత్యకేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విశాఖపట్నం దివ్య హత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు (Divya's Murder Case Facts) బయటకు వస్తున్నాయి. పోలీసులు (Visakhapatnam police) హత్య కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతవారం అరెస్ట్ చేసిన‌ నిందితులలో దివ్య పిన్ని కాంతవేణితో పాటు మరికొందరిని పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు‌ కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో (Police Investigation) షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Advertisement
Advertisement