ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ శాసనమండలిలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు.

Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక కలకలం.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)

Rudra

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. దీంతో బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు.

Lady Aghori Attacked on Journalist: జర్నలిస్టు, పోలీసులపై అఘోరి దాడి.. మంగళగిరిలో ఘటన (వీడియో)

Rudra

ఆలయాల సందర్శనతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ హద్దుమీరి ప్రవర్తించారు. మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. అఘోరీ చర్యలను పలువురు తప్పుబడుతున్నారు.

AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?

Rudra

నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

Advertisement

Vijayawada: రాంగ్ రూట్‌లో వ‌చ్చిన కారు, ఆపై బస్సు డ్రైవర్‌పైనే దాడి, విజయవాడలో ఘటన...ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

విజ‌య‌వాడ‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌పై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. న‌గ‌రంలోని బ‌స్టాండ్ వ‌ద్ద రాంగ్ రూట్‌లో వ‌చ్చింది కారు. ఈ క్రమంలో బస్సు త‌మ కారుకి తగిలిందని డ్రైవర్‌పై దాడి చేశారు కారులోని ఆరుగురు యువ‌కులు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

Police Case On Sri Reddy: నటి శ్రీరెడ్డికి షాక్‌..వరుసగా పోలీస్ కేసులు, ఈ సారి విజయనగరంలో పోలీస్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

నటి శ్రీరెడ్డికి వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. విజ‌య‌న‌గరం జిల్లా నెల్లిమర్లలో మ‌రో కేసు న‌మోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనిత‌ల‌తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Lady Aghori: తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్న లేడీ అఘోరి.. (వీడియో)

Rudra

ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న లేడీ అఘోరీ.. తాజాగా తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే

Rudra

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం, మజ్లిస్ పార్టీపై పంచ్‌లు..శివసేన-జనసేన ధర్మం కోసమే పోరాడుతాయని వెల్లడి

Arun Charagonda

మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీపై పంచ్‌లు వేస్తూనే శివసేన -జనసేన ధర్మం కోసమే కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేల ఇది.. దమ్కీలకు భయపడం అని తేల్చిచెప్పారు.

Andhra Pradesh: పెన్ను గురించి గొడవ.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య, నరసరావు పేట భావన కాలేజీ క్యాంపస్‌లో ఘటన...విషాద ఛాయలు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడ్ జిల్లా నరసరావు పేట భావన కాలేజీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెన్ను గురించి గొడవ జరిగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనూష . మృతురాలి స్వగ్రామం బొల్లాపల్లి మండలం వెల్లటూరు.

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు

Arun Charagonda

ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. హైదరాబాద్‌లో AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నారా రామ్మూర్తి నాయుడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యహ్నం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Andhra Pradesh Assembly: జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రులే లేరని కామెంట్.. మంత్రులపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Arun Charagonda

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరని చెప్పారు. మరి సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ప్రశ్నించారు కూన రవికుమార్.

Advertisement

AP CM Chandrababu: ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా, జై శంకర్‌లతో భేటీ...రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్‌ని పెంచాలని కోరిన ఏపీ సీఎం

Arun Charagonda

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్ ని ఒక్క శాతం పెంచవల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు చంద్రబాబు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్

Rudra

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు దగ్గరికి రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హల్ చల్ సృష్టించాడు.

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం

VNS

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

Women Fight Video: వీడియో ఇదిగో, విశాఖలో నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్న మహిళలు, వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం గొడవే కారణం

Hazarath Reddy

విశాఖపట్నం జిల్లా గాజువాకలో మహిళా వ్యాపారులు ఘర్షణ పడ్డారు. రోడ్డు మీద వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం నడిరోడ్డుపై మహిళలు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని దాడులు చేసుకున్నారు. కొట్టుకుంటున్న వారిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు.

Advertisement

CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.

Kakinada Subbaiah Hotel Seized: కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, భోజనంలో జెర్రి రావడంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ ను విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్లో జెర్రి కలకలం రేపిన సంగతి విదితమే. ఒక వ్యక్తి భోజనంలో ఈ జెర్రి దర్శనమిచ్చింది.

Tirupati: నటుడు పోసాని కృష్ణమురళిపై జనసైనికుల ఆగ్రహం, పోసాని దిష్టిబొమ్మ దగ్దం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. తిరుపతిలో పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పీఎస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

PM Modi: 29న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, 48 వేల మందికి దక్కనున్న ఉపాధి

Arun Charagonda

ఈనెల 29న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది.

Advertisement
Advertisement