ఆంధ్ర ప్రదేశ్
AP Assembly Session: అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సవాల్ విసిరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
Hazarath Reddyజగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు
YS Jagan Slams CM Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు నటన ముందు NTR నటన నథింగ్, సూపర్ సిక్స్ అడుగుతారని ఇన్ని రోజులు బడ్జెట్ సాగదీశారని మండిపాటు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు.
Actress Sri Reddy: ఈ సారి శ్రీరెడ్డి వంతు..క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు, అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ
Hazarath Reddyసోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మరియు ఇతర టిడిపి జనసేన నాయకులు పై శ్రీ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Hazarath Reddyసినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు.
Nara Lokesh on DSC: ఏపీలో త్వరలో 595 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ వేదికగా నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు, 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించారు.
HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం
Hazarath Reddyసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రాజమండ్రిలో మద్యం మత్తులో బొండాల నరికే కత్తితో మందుబాబు వీరంగం, తన తలను తానే నరుక్కుంటూ..
Hazarath Reddyమద్యం మత్తులో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. రాజమండ్రి లాలా చెరువు మేనకా రెడ్డి బార్ వద్ద బొండాల నరికే కత్తితో గందరగోళం సృష్టించిన వ్యక్తి. భయాందోళనకు గురైన మందుబాబులు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, తప్పుడు కేసులో ఇరికించి రూ. 5 లక్షలు లంచం డిమాండ్, రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానంటూ యువకుడు వీడియో
Hazarath Reddyనరసరావుపేట రూరల్ సి.ఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ చేత తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని, కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచం గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు..
Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని
Hazarath Reddyవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు.
Vijayasai Reddy Slams CM Chandrababu: అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి
Hazarath Reddyఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు . సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Raghurama Krishnam Raju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఇవాళే ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
AP Assembly Budget Session 2024: రెండో రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు సమయం, పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రులు
Hazarath Reddyరెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.
Andhra Pradesh Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు, ఏకగ్రీవం కానున్న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
Arun Charagondaఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. ఉండి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ. వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో రఘురామకు చోటు దక్కుతుందని అంతా భావించిన సామాజిక సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
Hazarath Reddyసినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జనసేన నాయకులు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ ఎనర్జీ, సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళపై విరుచుకుపడిన కామాంధుడు, పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్ళి..
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మద్యం మత్తులో ఓ యువకుడు మహిళను వెంబడించి పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్లాడు. కేకలు వేయడంతో మహిళను రక్షించిన స్థానికులు. యువకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Cyclone Coming? ముంచుకొస్తున్న తుఫాను ముప్పు, చెన్నైలో నేడు స్కూళ్లకు సెలవులు, ఏపీలో పలు చోట భారీ వర్షాలు, మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం
Hazarath Reddyమరికొద్ది రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దక్షిణ భారతదేశంలో తుపాను భయం నెలకొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
Chardham Yatra 2024: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది మృతి.. కేదార్ నాథ్ యాత్రలోనే అధికం
Rudraఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు.
Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?
Rudraప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.