ఆంధ్ర ప్రదేశ్

Bomb Threat At ISKCON Temple in Tirupati: తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన

Rudra

దేవదేవుడు ఆ శ్రీవారు కొలువుదీరిన తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Abids Fire Accident Viral Video: ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని అబిడ్స్‌ పరిధిలో బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)

Rudra

సినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.

AP Government Posting IAS Officers: అమ్ర‌పాలి స‌హా న‌లుగురు ఐఏఎస్ ల‌కు శాఖల కేటాయింపు, ఎవ‌రెవ‌రికి ఏయే పోస్టులు ఇచ్చారంటే?

VNS

జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించగా, కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్‌ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

Advertisement

Andhra Pradesh: విజయనగరంలో దారుణం, ప్రాణం పోతున్న పట్టించుకోన జనం...అందరూ చూస్తుండగానే రోడ్డుపై మరణించిన యువకుడు..వీడియో

Arun Charagonda

విజయనగరంలోని వైఎస్సార్ కూడలి - గూడ్స్ షెడ్ వద్ద తల్లి కొడుకు ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్ వంతెన వద్ద పని ఉందని దిగాడు కుమారుడు. అదే సమయంలో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. తల్లి కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు కాస్త సాయం చేయండి అని అడిగిన ఎవరూ సహాయం చేయకపోయే సరికి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Vijaysai Reddy On YS Sharmila: ఆస్తి తగాదా..అధికారం తగాదా?, జగన్‌కు లేఖ రాస్తే చంద్రబాబుకు ఎలా చేరిందో షర్మిల చెప్పాలన్న విజయసాయి రెడ్డి

Arun Charagonda

మీ అన్నకు వ్యక్తిగతంగా రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ పై జరుగుతున్న కుట్రలో మీరు భాగస్వామ్యం కావడం శోచనీయం అన్నారు. ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా చెప్పాలని..చంద్రబాబుతో కలిసి మీ అన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావ్ అని మండిపడ్డారు. షర్మిల నాటకాలు ఆపాలని...వైఎస్ చనిపోవడానికి కారణం ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.

Tirupati: తిరుపతి హోటల్స్‌కు ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్, హోటల్స్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

తిరుపతి హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు ఉగ్రవాదులు. జాఫర్ సాదిక్ పేరుతో వచ్చిన మరో బాంబు బెదిరింపు మెయిల్ రాగా హోటల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అలాగే తిరుపతిలోని ఓ ఆలయానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Driverless Electric Vehicle: డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించిన బోసన్ మోటార్స్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవంతంగా డెమో ప్రదర్శన...వీడియో ఇదిగో

Arun Charagonda

ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు మంత్రి నారా లోకేష్.

Advertisement

Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణలోని టూరిజం అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది.

Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయం సందర్శన, పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు లోకేష్. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించారు లోకేష్‌.

TDP Vs YSRCP: పలాస పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న టీడీపీ- వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుల పరస్పర దాడులు..ఇరువర్గాలపై కేసు నమోదు

Arun Charagonda

పోలీస్ స్టేషన్ లోనే రెచ్చిపోయి కొట్టుకున్నారు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. పోలీసుల ముందే పిడిగుద్దులు కురిపించుకున్నారు నేతలు. పలాస కాశీబుగ్గ పీఎస్ లో ఘటన జరుగగా ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుల పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నేతకు గాయాలు కాగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Rave Party at Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌ హౌస్‌ లో వీఐపీల రేవ్‌ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు.

Advertisement

Constable Dance: 57 ఏళ్ల లేటు వయసులో ‘ముక్కాల..’ పాటకు డాన్స్ ఇరగదీసిన కానిస్టేబుల్ రాజేందర్ (వైరల్ వీడియో)

Rudra

పోలీసుల జీవితం అంటే ఉరుకులు, పరుగులే. అయితే, వారికీ ఆటవిడుపు ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధికారులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో భర్తను హత్య చేసి ఊటీ ఎస్టేట్‌ లో తగులబెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం

Rudra

హైదరాబాద్‌ కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి సాయంతో అతని భార్యే ఈ ఘాతుకానికి తెగిపడింది.

Sharmila: జగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని..అన్నగా ఏం చేశాడో చెప్పాలన్న వైఎస్ షర్మిల

Arun Charagonda

జగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని అన్నారు టీపీసీసీ చీఫ్ షర్మిల. నేనేం తక్కువ చేసా.. నేనేం తప్పు చేసా.. ఒక్కటైనా చెప్పండి అని సవాల్ విసిరారు. ఇన్ని చేసిన నాకు జగన్ ఒక్క మేలు అయినా చేశారా అన్నారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటి ఐశ్వర్య, తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు

Arun Charagonda

ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Andhra Pradesh:మారమ్మ ఆలయంలో కత్తితో వ్యక్తి హల్‌చల్, రైల్వే పోలీసుల నుండి తప్పించుకుని ఆలయంలోకి చొరబాటు, పోలీసులకు అప్పగించిన స్థానికులు...వీడియో ఇదిగో

Arun Charagonda

అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలోకి వెళ్లి కత్తితో హల్ చల్ చేశాడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేష్. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు నందలూరు పోలీసులు.

Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి

Arun Charagonda

అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

TDP Membership Drive: రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం..5లక్షల ప్రమాద బీమా, రూ. లక్షతో టీడీపీ జీవితకాల సభ్యత్వం...వివరాలివే

Arun Charagonda

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుండి ప్రారంభంకానుంది. సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ కార్యక్రమం జరగనుంది.

Andhra Pradesh: నకిలీ బంగారం దందా గుట్టు రట్టు,రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు.. 10 మంది అరెస్టు

Arun Charagonda

రెండు ముఠాల మధ్య తుపాకీ కాల్పుల మిస్టరీని చేధించారు సత్యసాయి జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా కదిరి జాతీయ రహదారిపై రామాపురం కూడలి వద్ద రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు టీమ్‌లు.. 10 మందిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement