ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పెట్రోల్ ముందు పెట్టుకుని బీడి వెలిగించి అగ్గిపుల్ల కింద వేయడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు
Hazarath Reddyరోడ్డుపై పెట్రోల్ పడి ఉన్నా, గమనించని ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేయడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.రోడ్డు పక్కన ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు.అప్రమత్తమైన దుకాణాల యజమానులు. నీళ్లు చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన స్థానికులు.
Botsa Meet YS Jagan: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను అభినందించిన వైఎస్ జగన్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేత
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు.
Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన ఎగ్ పఫ్స్ అంశం, టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య వార్, ఎవరేమంటున్నారంటే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎగ్ పఫ్స్" కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
Landslide In Srisailam: శ్రీశైలంలో విరిగిపడ్డ కొండ చరియలు, తప్పిన పెను ప్రమాదం, రోడ్డుపై పడ్డ పెద్దపెద్ద బండరాళ్లు..వీడియో
Arun Charagondaశ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొండ చరియలు విరిగి పడ్డాయి. అయితే రాత్రి సమయం కావడంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ బండరాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
Variety Wedding Card: ప్రశ్నపత్రంలా పెళ్లి శుభలేఖ, ఏపీలో ఓ టీచర్ వెరైటీ వెడ్డింగ్ కార్డు, అందరిని ఆకట్టుకుంటున్న పెళ్లి పత్రిక
Arun Charagondaఏపీలోని ఓ టీచర్ వెడ్డింగ్ అందరిని ఆకట్టుకుంటోంది. పెళ్లి శుభలేఖని ప్రశ్నాపత్రంలా తయారుచేయించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఓ టీచర్ ప్రత్యూష. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా పెళ్లి పత్రికను రూపొందించారు ప్రత్యూష. ఈ వెడ్డింగ్ అందరిని ఆకట్టుకుంటోండగా నెట్టింట్లో వైరల్‌గా మారింది
Leopard Spotted In Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం, వీడియో తీస్తూ కారు లైట్లు వేయడంతో అడవీలోకి వెళ్లిన చిరుత, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన
Arun Charagondaశ్రీశైలం నీలం సంజీవరెడ్డి భవనం దిగువ గేట్ వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాత్రి సమయంలో గేటు వద్ద భక్తులకు కనపడింది చిరుతపులి. గేటు వద్ద చిరుతపులిని వీడియో తీస్తూ కారు లైట్లు వెయ్యడంతో అటవీప్రాంతంలోకి వెళ్లింది చిరుత. దీంతో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ, దేవస్థానం అధికారులు ప్రజలకు సూచించారు.
Andhra Pradesh: అమరావతి నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ, శ్రీసిటీలో 15 కంపెనీలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి విదితమే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.
Tension Erupts in Tadipatri: వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు
Hazarath Reddyతాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. మూడు నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.టీడీపీ నేతల దాడిలో రఫీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్
Hazarath Reddyఅడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
Duvvada Vani: సోషల్ మీడియాకు దూరం అన్న మాధురి పోస్టుపై వాణి అనుమానం, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఎస్సై తనిఖీ... ఆ తర్వాత!
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో నయా ట్విస్ట్. సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని మాధురి చేసిన పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు వాణి. మాధురి రాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించిదని అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆరోపించారు.
Duvvada Srinivas: సోషల్ మీడియాకు దూరమైన మాధురి, డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం, అందరి సపోర్టు కావాలని వీడియో రిలీజ్
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో కీలకంగా మారారు మాధురి. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మాధురి సోషల్ మీడియాకు దూరమయ్యారు. తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని...మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉందని తెలిపారు.
Chandrababu In Delhi: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్న టీడీపీ అధినేత
Arun Charagondaటీడీపీ చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్‌లను కలిశారు చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అలాగే ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన విధంగా సాయం అందించాలని కోరారు.
Andhra Pradesh Shocker:భర్తను కొట్టి, భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం , ఏలూరులో కిరాతక సంఘటన
Arun Charagondaభర్తను కొట్టి.. అతని భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం చేసిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. జీవనోపాధి కోసం వచ్చి రాంకోఠిలో ఉంటున్న భర్తకు నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ముగ్గురితో కలిసి భర్త మద్యం తాగాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారం చేశారు.
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Rudraప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Guidelines For Transfer Of Employees: ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి
Arun Charagondaఏపీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 5 ఏళ్లు ఒకేచోట పని చేసినవారికి బదిలీ తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
Tirumala: తిరుమల కొండపై మందుబాబుల బీభత్సం, గాజు బాటిళ్లతో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్
Arun Charagondaతిరుమల కొండపై మందుబాబులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో కొట్టుకున్నారు. నందకం అతిథిగా గృహం వద్ద గాజు బాటిళ్ళతో దాడి చేసుకోగా ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. నందకం అతిథిగా గృహం వద్ద ఈ ఘటన జరుగగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Duvvada Srinivas: దువ్వాడ వాణికి టెక్కలి పోలీసుల నోటీస్, పోలీసులతో వాణి వాగ్వాదం, నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి విషయం రచ్చచెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి.
Nara Lokesh on Red Book: మా గెలుపులో రెడ్ బుక్ కూడా ఒక భాగం, క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్, చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్
Hazarath Reddyఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి
MLA Paritala Sunitha: పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, నేల తల్లికి పూజలు...వీడియో
Arun Charagondaటీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత రైతుగా మారారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్బంగా నేల తల్లికి పూజలు చేశారు. అనంతరం తోటి కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు పరిటాల సునీత
EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..
Hazarath Reddyఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.