Andhra Pradesh Horror: కోడలి తల నరికి ఆ తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన అత్త, అన్నమయ్య జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్న‌మ‌య్య జిల్లాలో రాయచోటి కేంద్రంలోని కె రామాపురంలో కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త (aunt who killed the daughter-in-law)... ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు ( took her head to the police Station) వెళ్లి లొంగిపోయింది.

Andhra Pradesh Horror: కోడలి తల నరికి ఆ తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన అత్త, అన్నమయ్య జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
Representational Image | (Photo Credits: IANS)

Annamayya, August 11: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్న‌మ‌య్య జిల్లాలో రాయచోటి కేంద్రంలోని కె రామాపురంలో కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త (aunt who killed the daughter-in-law)... ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు ( took her head to the police Station) వెళ్లి లొంగిపోయింది. అంతేకాకుండా త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే... జిల్లాలోని రాయ‌చోటి మండ‌లం కె.రామాపురంలో సుబ్బ‌మ్మ నివ‌సిస్తోంది. కోడ‌లు వ‌సుంధ‌ర (35)తో ఆమెకు గ‌త కొంత‌కాలంగా కుటుంబ క‌ల‌హాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బ‌మ్మ‌... కోడ‌లు వ‌సుంధ‌ర‌పై దాడికి దిగింది. క‌త్తి తీసుకుని వ‌సుంధ‌ర త‌ల న‌రికేసింది. ఆ వెంటనే, తెగి ప‌డిన వ‌సుంధ‌ర త‌ల‌ను చేత బ‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశాన‌ని పోలీసుల‌కు చెప్పింది.

ఆ కామాంధుడు ఇక జీవితాంతం జైల్లోనే, గతేడాది 5 ఏళ్ళ బాలుడిపై దారుణంగా అత్యాచారం చేసిన నిందితుడు, దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లి

కోడ‌లి త‌ల‌తో సుబ్బ‌మ్మ అలా న‌డుచుకుంటూ వెళుతుంటే... జ‌నం బెంబేలెత్తిపోయారు. కుటుంబ కలహాలతో పాటు ఆస్తి గొడవలే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 11, 2022 04:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).