Hyderabad, OCT 27: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) తన సినిమాలతోనే కాక రియల్ లైఫ్ లో కూడా ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు (Services) చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ (Mahesh babu foundation) ద్వారా ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. రెండు గ్రామాలని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇలా ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సపోర్ట్ గా నిలుస్తున్నారు మహేష్. తాజాగా మహేష్ బాబు తన ఫౌండేషన్ (Foundation) నుంచి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ లో అన్ని సౌకర్యాలని అమర్చారు.
A big day for us at MB Foundation. We have successfully introduced digital learning in Burripalem school! Thanking the principal and staff at Burripalem school for ensuring optimal use of the digital classroom. @urstrulyMahesh pic.twitter.com/e1Oh0ZVn9U
— Mahesh Babu Foundation (@MBfoundationorg) October 26, 2022
తాజాగా అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ (Digital Learnings) కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది. ఒక అడుగు ముందుకేసి బుర్రిపాలెం స్కూల్ లో విద్యార్థులు కోసం డిజిటల్ లెర్నింగ్ కి కంప్యూటర్లు ఏర్పాటు చేసింది. ఇది చాలా గొప్ప రోజు” అని పోస్ట్ చేశారు. దీంతో మహేష్ బాబుని మరోసారి అంతా అభినందిస్తున్నారు