Rain Alert In AP: ఫిబ్రవరి 1న శ్రీలంకలో తీరం దాటనున్న వాయుగుండం.. నేడు ఏపీకి వర్ష సూచన
Credits: Wikimedia commons

Vijayawada, Jan 31: బంగాళాఖాతంలో (Bay Of Bengal) ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. నిన్న మధ్యాహ్నానికి శ్రీలంక (Srilanka) ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని (Tamilnadu) కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం నేడు సాయంత్రం వరకు పశ్చిమ దిశగా పయనించి... ఆ తర్వాత దక్షిణ నైరుతిగా దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటనుంది.

చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని అనుమానం

ఈ నేపథ్యంలో ఏపీలోని నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో నిన్న అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.