Hyderabad, March 24: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP Highcourt) న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ (Justice Battu Devanand) బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టుకు ఆయన్ని బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ (Justice D. Nagarjuna) కూడా మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజయం గతేడాది నవంబరులో కేంద్రానికి సిఫారసు చేసింది. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు కేంద్రం ఇప్పుడు వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బదిలీ దస్త్రంపై ఆమోదముద్ర వేశారు.
#MadrasHC gets three more judges Union law ministry has notified appointment of judicial officer P Vadamalai as an addnal judge of the HC & transfer of Justice Battu Devanand, judge of AP HC & Justice Devaraju Nagarjun, judge of Telangana HC to Madras HC. @timesofindia
— Sureshkumar (@sureshkumarTOI) March 23, 2023
బదిలీ వద్దంటూ నిరసనలు..
న్యాయమూర్తుల బదిలీ సిఫారసులపై అప్పట్లో ఈ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ర్యాలీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే బదిలీలు జరిగాయని ఆరోపించారు. అంతేకాకుండా, బదిలీలను పునఃసమీక్షించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అప్పటి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. బదిలీల విషయంలో మరోమారు ఆలోచించాలని ఏపీ బార్ కౌన్సిల్ కూడా కోరింది. అయినప్పటికీ నాలుగు నెలల తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.