Hyderabad, AUG 20 : హైదరాబాద్ వినియోగదారుల కోర్టు (consumer court in Hyderabad) ఓలా క్యాబ్స్ కు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వినియోగదారుడికి రూ. 861 బిల్లు వేసింది ఓలా క్యాబ్స్ (Ola cabs). దీంతో ఎక్కువగా ఛార్జ్ చేసిన ఓలా క్యాబ్స్ కు రూ. 95వేలు ఫైన్ విధించింది. 2021 అక్టోబర్ లో శామ్యూల్ (Jabez Samuel) అనే వ్యక్తి తన భార్యతో కలిసి బయటకు వెళ్లేందుకు ఓలా క్యాబ్ ఎక్కాడు. వారిద్దరూ కేవలం 4-5 కిలో మీటర్లు ప్రయాణించారు. పైగా క్యాబ్ డ్రైవర్ ప్రవర్తన కూడా బాగోలేదని, ఏసీ వేయాలని కోరినప్పటికీ...అతను పట్టించుకోలేదని శామ్యుల్ తెలిపాడు. దీనికి తోడు తక్కువ దూరానికి రూ. 861 ఛార్జ్ చేశారు. వారితో డ్రైవర్ వ్యవహారశైలి కూడా సరిగ్గా లేకపోవడంతో శామ్యూల్ కు కోపం వచ్చింది.
A consumer court in Hyderabad has directed Ola Cabs to pay Rs 95,000 to a customer for overcharging him and also for deficiency in service. IANS
— Abdulkadir/ अब्दुलकादिर (@KadirBhaiLY) August 19, 2022
అంతేకాదు ఓలా మనీని (ola money) తీసుకునేందుకు డ్రైవర్ నిరాకరించాడు. దాంతో శామ్యూల్ ఆ క్యాబ్ డ్రైవర్ తో గొడవకు దిగాడు. ఓలా కస్టమర్ కేర్ కు కంప్లయింట్ చేశాడు. అయితే ఓలా యాజమాన్యం మాత్రం తనకు న్యాయం చేయలేదు. పైగా అతని నుంచి బాకీని వసూలు చేసింది. దాంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు శామ్యూల్.
అయితే కోర్టు హియరింగ్ కు ఓలా ప్రతినిధులు హాజరుకాలేదు. దాంతో నోటీసులు జారీ చేసింది కోర్టు. విచారణ జరిపిన తర్వాత కోర్టు ఫీజుల కింది రూ. 7వేల రూపాయలు, నష్టపరిహారం రూ.88వేలు ఇవ్వాలని ఓలాను ఆదేశించింది కోర్టు. అంతేకాదు ఫిర్యాదుదారుడి నుంచి వసూలు చేసిన రూ. 861 ను కూడా 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.