Newdelhi, Oct 21: ఓలా (Ola), ఉబర్ (Uber) కు పోటీగా ప్రారంభించిన యాప్ ద్వారా ఆటో డ్రైవర్లు ఏడాదిలోపు సుమారు రూ.189 కోట్లు సంపాదించారు. అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్‌లో ఓలా, ఉబర్ కు పోటీగా ‘నమ్మ యాత్రి యాప్’ ను (Namma Yatri app) ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) సంస్థ ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను నేరుగా ఈ యాప్ అనుసంధానం చేస్తుంది.
#Bengaluru auto drivers earn ₹189 crore through Namma Yatri apphttps://t.co/K84FRnvh8t
— Hindustan Times (@htTweets) October 20, 2023
చార్జీలు ఇలా..
‘నమ్మ యాత్రి యాప్’ ఛార్జీలు ప్రభుత్వం నిర్ణయించిన రేటుపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ట్రిప్ కు రెండు కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ.30. ఎక్కువ దూరానికి కిలోమీటరుకు రూ.15 చొప్పున ఛార్జీ ఉంటుంది. అలాగే కనీస బుకింగ్ ఛార్జీ రూ. 10 కాగా, ఆటో డ్రైవర్లు రూ.30 వరకు పెంచుకునే అవకాశం కూడా ఉన్నది.