Telangana: పెన్షన్, రేషన్ బియ్యం కోసం వచ్చి మనువరాలితో సహా సజీవదనమైన వృద్ధురాలు, మెదక్‌ జిల్లాలో విషాదకర ఘటన
Fire (Representational image) Photo Credits: Flickr)

Medak, JAN 25: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. చేగుంట (Chegunta) మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి (cylinder explosion) ఇద్దరు సజీవ దహనం (killed) అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ (59)తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు (6)తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, సీబీఐ నోటీసులపై స్పందించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, 5 రోజుల తర్వాత హాజరవుతానని వెల్లడి

అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి (cylinder explosion) భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు గ్రామస్తులు, ఫైరింజన్‌ సహాయంతో మంటలు ఆర్పివేసినా ఫలితం లేకుండా పోయింది. మంటల్లో అంజమ్మతో పాటు తన ఆరు సంవత్సరాల మనవరాలు మధు సజీవ దహనం అయ్యారు.

చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పెన్షన్ కోసం వచ్చి వృద్ధురాలు, బాలిక చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బతుకుదెరువు కోసం వెళ్లి సుఖంగా జీవిస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో...మృత్యువు ఇలా కబలించడం అందరినీ కలిచివేసింది.