తెలంగాణ

Telangana Darshini: తెలంగాణ దర్శిని..విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం

Arun Charagonda

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన. కల్పించనున్నారు.

Road Accident: వావిలాలలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోళ్తా, 40కి పైగా ఆవులు మృతి..వీడియో ఇదిగో

Arun Charagonda

జనగామ జిల్లా పాలకుర్తి మం. వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడగా ఈ ఘటనలో 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

HYDRA Notices to Shilpa Mohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు.. సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు

Rudra

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆయన ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.

HYDRA Ranganath: 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

Rudra

సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, కూక‌ట్‌ ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా తమ ఇంటిని ఎక్కడ కూల్చివేస్తదో అన్న భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

Advertisement

Constable Suicide: తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన

Rudra

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Jani Master Case: న‌న్నే ఆ అమ్మాయి వేధించింది! నా ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేక‌నే కుట్ర చేశారు! పోలీస్ క‌స్ట‌డీలో జానీ మాస్ట‌ర్ కీలక‌ విష‌యాలు

VNS

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజూ జానీ మాస్టర్ ను (Jani Master) పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో (Police Custody) జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Traffic Advisory in Hyderabad: హైద‌రాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు, రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఎక్క‌డెక్క‌డ డైవ‌ర్ష‌న్స్ ఉన్నాయంటే?

VNS

శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (draupadi murmu) హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్‌ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు

GHMC Commissioner Amrapali: హైదరాబాద్‌లో పోస్టర్లు బ్యాన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలి,పోస్టర్లు వేస్తే భారీ జరిమానా విధించాలని ఆదేశం

Arun Charagonda

హైదరాబాద్‌‌లో పోస్టర్లు బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టర్లు వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు.

Advertisement

CM Revanth Reddy On Musi River Development: పర్యాటక ప్రాంతాలుగా చారిత్రాత్మక భవనాలు,సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.

Telangana Shocker: తెలంగాణలో దారుణం, ప్రేమించడం లేదని బస్సులో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

Hazarath Reddy

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కదులుతున్న బస్సులో ప్రియురాలిపై ఓ ప్రేమికుడు గురువారం చిన్న కత్తితో దాడి చేశాడు.నిందితుడిపై సెక్షన్ 74, 78 BNS, 320, 118 (1) BNS కింద ఫిర్యాదు నమోదు చేయబడింది. ఈ విషయంపై విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Dronavalli Harika Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చెస్ ప్లేయర్స్ ద్రోణవల్లి హారిక, అర్జున్, ప్రోత్సాహక నగదు అందజేసిన సీఎం

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చెస్ ప్లేయర్స్ అర్జున్, ద్రోణవల్లి హారిక. FIDE చెస్ ఒలింపియాడ్ లో దేశం తరపున మొదటిసారి స్వర్ణపతకాలు సాధించారు అర్జున్, ద్రోణవల్లి హారిక. ఇద్దరిని అభినందించి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు సీఎం.

Telangana Road Accident: వీడియో ఇదిగో, రెండు కాలేజీ బస్సుల ఢీ, ఒకరి మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో రెండు కాలేజీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బస్సులు రెండూ బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)కి చెందినవే కావడం గమనార్హం. నగర శివారులోని క్లాసిక్ గార్డెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Addanki Dayakar On ED Rides: బీజేపీ కుట్రలో భాగమే ఈడీ దాడులు, కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమి లేదన్న అద్దంకి దయాకర్..వీడియో ఇదిగో

Arun Charagonda

ఈడీ దాడులపై స్పందించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బీజేపీ చేస్తున్న కుట్రలోని భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పై ఈడీ దాడులు అని...దీని వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదు అన్నారు. బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని....ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మంచి వ్యాపార వేత్త గా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

Harishrao On Runmafi: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్‌ రావు డెడ్ లైన్, దసరా లోపు రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక

Arun Charagonda

రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి డెడ్ లైన్ విధించారు. దసరా పండగలోపు రుణమాఫీ చెయ్యకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేరియట్‌ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు హరీశ్‌.

Theft At Bhatti Vikramarka House:తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం, ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. పశ్చిమ్‌బెంగాల్‌లో ఖరగ్‌పూర్‌ జీఆర్‌పీ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేయగా నిందితుల నుంచి రూ 2.2 లక్షల నగదుతో పాటు బంగారం,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా గుర్తించామని తెలిపారు.

New Flight Services From Hyderabad: హైదరాబాద్‌ నుండి మూడు కొత్త విమాన సర్వీసులు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన స‌ర్వీసులు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌ల‌తో స‌హా 7 రూట్లలో విమానాలు న‌డ‌ప‌నుంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌.

Advertisement

Pravasi Prajavani In Hyderabad: ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి, ప్రతి మంగళ- శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి జరుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఇవాళ ప్రత్యేక ప్రవాసీ ప్రజావాణి సెల్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌. గల్ఫ్‌కి వెళ్ళిన కార్మికులు చెయ్యని తప్పుల‌కు ఇబ్బంది పడుతున్నారు అని...హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్‌మేళా నిర్వ‌హిస్తే 9 వేల మంది వ‌చ్చారు అన్నారు.

Reliance Foundation Donation: తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

Arun Charagonda

ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు విరాళం అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు.

Road Accident At Narsapur: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఢీ కొన్న రెండు బస్సులు, డ్రైవర్ మృతి..కాలేజీ విద్యార్థులకు తప్పిన ప్రమాదం..వీడియో

Arun Charagonda

మెదక్ నర్సాపూర్ పట్టణంలోని ఆనంద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వస్తూ ఢీ కొనగా ఒక డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఉన్న కాలేజీ విద్యార్థులకు ప్రమాదం తప్పింది.

Road Accident: జర్నీ సినిమాను తలపించేలా యాక్సిడెంట్.. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీ బస్సులకు ప్రమాదం.. డ్రైవర్ మృతి.. పలువురు విద్యార్థులకు గాయాలు

Rudra

జర్నీ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్సిడెంట్ సీక్వెన్స్ ను తలపించేలా రెండు కాలేజీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement