తెలంగాణ
Staff To Hydraa: హైడ్రాకు సిబ్బంది కేటాయింపు, పలు శాఖల నుంచి 169 మందిని డిప్యూటేషన్ పై హైడ్రాకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
VNSహైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (Hydraa)కు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Government Order) ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరిల్లో 169 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌పై సిబ్బంది నియామకం (Saff For Hydraa) చేపట్టింది.
Liquor Shops To Increase In Telangana: తెలంగాణలో పెరుగనున్న మద్యం షాపులు, ప్రతి 14వేల మందికి ఒక షాపుకు అనుమతిచ్చేందుకు యత్నాలు
VNSమద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్‌కు లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి. ఇందుకోసం ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అనే అంశాన్ని అధికారులు తెరమీదకి తెచ్చారు.
IMD Alert For Telangana: రాబోయే రెండో రోజుల పాటూ తెలంగాణకు భారీ వర్షసూచన, హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
VNSతెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా (Rain Alert) పయనిస్తుందని పేర్కొంది.
Nara Lokesh: వాహనదారుడికి సారీ చెప్పిన మంత్రి లోకేశ్..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ట్వీట్..ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
Arun Charagondaరెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్. ఈ సందర్భంగా లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం రోడ్డు పక్కన నిలిపిన మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా లోకేశ్ దృష్టికెళ్లారు సదరు వాహనదారుడు.
Tension Erupt in Kamareddy: యూకేజీ చిన్నారిపై పీఈటీ టీచర్ దారుణం, స్కూలును ముట్టడించిన బంధువులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, సీఐ తలకు గాయం
Hazarath Reddyకామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. UKG చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ అత్యాచారానికి పాల్పడటంతో బంధువులు, పాప తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన భార్యాభర్తలు, భార్యకు తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఎగిరి అవతల పడ్డారు. మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ కు అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
KTR Inspection Of STP: మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం, పాకిస్తాన్ కంపెనీకి సుందరీకరణ పనులా?..కేటీఆర్ ఫైర్,హైడ్రాపై త్వరలో ఓ నిర్ణయం
Arun Charagondaపబ్లి సిటీ స్టంట్లతో సీఎం రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టిపిని సందర్శించింది బీఆర్ఎస్ బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్... మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.
R Krishnaiah To Joins Congress: కాంగ్రెస్‌లోకి ఆర్ కృష్ణయ్య?, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ
Arun Charagondaమరో నాలుగేళ్లు ఉండగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణయ్యతో భేటీ అయ్యారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. విద్యానగర్‌లోని కృష్ణయ్య నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.
Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
Edupayala Vana Durga Bhavani Temple: నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం, భారీ వర్షాలతో గర్బగుడిలోకి ప్రవేశించిన నీరు..వీడియో ఇదిగో
Arun Charagondaమెదక్ లోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం రెండో రోజుల జలదిగ్బందంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భగుడిలోనికి ప్రవేశించింది వరద. ఆలయం ఎదుట ఉదృతంగా ప్రవహిస్తుంది మంజీరా నది. దీంతో ఈ నెలలో 12 రోజులు ఆలయం మూతపడింది.
CM Revanth Reddy On Hydra Demolitions: ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే, బాధిత పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, పాతబస్తీ మెట్రోపై కీలక రివ్యూ
Arun Charagondaహైదరాబాద్ మెట్రో, ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు.
Centipede Found in Dal: వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Hazarath Reddyహైదరాబాద్ అబిడ్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఓ కస్టమర్ పప్పు ఆర్డర్ చేయగా, అందులో జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పప్పు తిన్న వారి పరిస్థితి ఏంటని అడిగారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad: మల్లంపేటలో దారుణం, మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లిన దొంగ, సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఏసీపీ
Hazarath Reddyహైదరాబాద్ మల్లంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శారద (50)ను గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై నగలు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు దొంగ.
Viral Video: వీడియో ఇదిగో, చేపల లారీ బోల్తా, ఏరుకునేందుకు ఎగబడిన స్థానికులు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Hazarath Reddyమహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. లారీ ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది.
Technical Glitch in Hyderabad-Tirupati Flight: హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్.. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ (వీడియో)
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Rain Alert: అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి.
IT Raids in Kukatpally: బీఆర్‌కే న్యూస్ చానల్ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ చౌదరి నివాసంలో తనిఖీలు చేపట్టారు.
Hyderabad: వీడియో ఇదిగో, ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్, ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్ నింపి ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు.. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 4లక్షల విలువైన 40 మద్యం సీసాలు, 189కాళీ సీసాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన
Hazarath Reddyబోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి బస్ చక్రాల కింద పడి దుర్మరణంపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో బాలుడు బస్సులో నుంచి రోడ్డు మీద పడిపోయాడు.