తెలంగాణ

Hydra Demolition Of Illegal Constructions: కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు మరిన్ని అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచింది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సర్వే నెంబర్ 141లో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు.

Nalgonda: స్కూల్ ఫీజు కట్టలేదని నర్సరీ విద్యార్థులను స్కూల్లోనే బంధించిన యాజమాన్యం, దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘటన

Arun Charagonda

నల్గొండ - దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం దారుణానికి పాల్పడింది. ఫీజు చెల్లించలేదని నర్సరీ చదువుతున్న చైత్ర, యూకేజీ చదువుతున్న జాహ్నవిని స్కూల్లోనే నిర్భంధించారు.

Telangana Cabinet Decisions: హైడ్రాకు చట్టబద్దత,సన్నవడ్లకు 500 రూపాయల బోనస్,కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ..తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతా ఊహించినట్లే హైడ్రాకు విస్తృత అధికారాలు ,చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని మంత్రివర్గం తేల్చిచెప్పింది.

Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌ లో దంచి కొట్టిన వర్షం, ఉరుములు-మెరుపులతో పలు చోట్ల భారీ వర్షం, రహదారులు జలమయం..వీడియోలు ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కోఠి,సరూర్‌నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Advertisement

Rain Alert For Telangana: తెలంగాణ‌లో రాబోయే మూడు రోజుల పాటూ వ‌ర్షాలు, ప‌లు జిల్లాల‌కు ఐఎండీ అల‌ర్ట్, ఏయే ప్రాంతాల్లో వాన‌లు ప‌డుతాయంటే?

VNS

తెలంగాణలో రాగల మూడురోజులు (Rain Alert) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Dasara Bonus For Singareni Workers: సింగ‌రేణి కార్మికుల‌కు దసరా బోన‌స్‌.... ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు, తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

సింగ‌రేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల ఆధారంగా బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

Hyderabad Horror: మేడ్చల్‌లో దారుణం, వృద్ధురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం, నొప్పి అంటూ ఏడుస్తున్నా కనికరించని కామాంధులు

Hazarath Reddy

మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

NEET Counselling: నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట, స్థానికత వ్యవహారంలో రిలీఫ్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం

Arun Charagonda

నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

Advertisement

Supreme Court On Note For Vote Case: సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి రిలీఫ్, ఓటుకు నోటు కేసును బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ

Arun Charagonda

ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Vedma Bojju On Union Minister Ravneet Bittu: కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద కామెంట్స్, కేంద్రమంత్రి నవ్‌నీత్ తల తెగ్గోసి ఇస్తే 1.38 ఎకరాల భూమి ఇస్తానని కామెంట్‌, మండిపడుతున్న బీజేపీ శ్రేణులు

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెగ్గోసి తెచ్చిన వారికి 1.38 ఎకరాల భూమి ఇస్తానని ప్రకటించారు. రాహుల్‌గాంధీ.. నంబర్ వన్ ఉగ్రవాది అని బిట్టు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రవ్‌నీత్‌సింగ్ బిట్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Fire Accident At Running Car : రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు, అద్దాలు పగలగొట్టి డ్రైవర్‌ని బయటకు తీసిన స్థానికులు..వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ - మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు రన్నింగ్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించగా దట్టమైన పొగకు డ్రైవర్ స్పృహ కోల్పోయాడు.

KTR Slams CM Revanth Reddy: కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?..కేటీఆర్ ఫైర్, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

Advertisement

Reels in Uppal PS: ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో యువకుల రీల్స్.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

Rudra

సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొందరు ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. రీల్స్ కోసం లా అండ్ ఆర్డర్ ని రక్షించే పోలీస్ స్టేషన్ లను కూడా వదలట్లేదు.

Jani Master Rape Case Row: గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్‌.. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు.. నేడు పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

Rudra

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలోని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది.

Telangana: వీడియో ఇదిగో, ఐదు అంతస్తుల భవనం కూల్చివేత, కూలుతున్న సమయంలో శిథిలాల నుంచి తృటిలో తప్పించుకున్న ప్రోక్లైన్ అపరేటర్‌

Hazarath Reddy

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టెంట్ హౌస్‌లో పనిచేసే ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో రాహుల్ అనే వ్యక్తి దినేశ్వర్ తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడ నుండి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Advertisement

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలారు ఇద్దరు ప్రయాణికులు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గోవా నుంచి నితిన్ షా, జెడ్డా నుంచి షేక్ సకీనా లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించారు అధికారులు

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్‌ మళ్లీ విచారణ, రేపటి నుండి 25 మందిని బహిరంగ విచారణ చేయనున్న కమిషన్

Arun Charagonda

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. శుక్రవారం(రేపటి) నుండి బహిరంగ విచారణ చేపట్టనుంది కమిషన్‌. విచారణలో భాగంగా కమిషన్ ముందుకు రానున్నారు ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు. అలాగే రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా విచారణకు రానున్నారు.

Digital Arrest: డిజిటల్ అరెస్ట్‌తో జాగ్రత్త, చట్టంలో డిజిటల్ అరెస్ట్ లేదు, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి

Arun Charagonda

డిజిటల్ అరెస్ట్ పేరుతో కొంతమంది ప్రజలను నమ్మించి డబ్బులు దండుకుంటున్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని... మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్టు చేసినట్లు ఎవరైనా చెబితే, దయచేసి వెంటనే సైబర్ క్రైమ్ వింగ్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు నివేదించాలన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

India's Richest and Poorest States: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ, పేద రాష్ట్రంగా బీహార్, భార‌త్‌లో ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితాను బుధ‌వారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుద‌ల చేసింది. రాష్ట్రాల త‌ల‌స‌రి ఆదాయం ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను (India's Richest and Poorest States) రూపొందించింది.

Advertisement
Advertisement