తెలంగాణ

Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)

Rudra

రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్‌ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.

CM Revanth Reddy: మతం ఏదైనా విద్వేషం వదిలి శాంతియుతంగా జీవించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి అని వెల్లడి

Arun Charagonda

శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య

Rudra

ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.

Students Crying Over Teacher Transfer: టీచర్ ట్రాన్స్‌ఫర్..విద్యార్థుల కంటతడి, మమ్మల్ని వదిలి వెళ్లకండని వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..వీడియో

Arun Charagonda

మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పన్నెండు ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో తమను వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Telangana High Court: బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం

Arun Charagonda

తెలంగాణ పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా? అని ప్రశ్నించింది. నంబర్ ప్లేట్ లేకుండా బండి నడిపిన వ్యక్తి పై చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

Rain Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

Hyderabad Shocker:రాంనగర్‌లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య, అక్కడిక్కడే మృతి

Arun Charagonda

హైదరాబాద్ - రాంనగర్‌లో విషాదం నెలకొంది. గిరి శిఖర అపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సనా బేగం(23) అనే మహిళ. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Ranganath On Hydra: హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయడం లేదు..కూల్చివేతలు ఆపమన్న రంగనాథ్.. హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వమే స్పందిస్తుందని కామెంట్

Arun Charagonda

హైడ్రా చట్ట వ్యతిరేక పని చెయ్యడం లేదు అని తెలిపారు రంగనాథ్. జూలై 19న జీఓ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? అని ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Advertisement

CID Notices To Somesh Kumar: రూ.1400 కోట్ల కుంభకోణం..మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసుల నోటీసులు

Arun Charagonda

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.

Ganja Seize In Hyderabad: 170 కేజీల గంజాయిని సీజ్‌ చేసిన ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద పట్టుకున్న పోలీసులు..వీడియో

Arun Charagonda

ముందు ఎస్కార్ట్ వెహికిల్.. వెనుక గంజాయి బండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీ ఆటోలో 170 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

KTR Vs Revanth Reddy: కేటీఆర్ వర్సెస్ రేవంత్..నాడు రాళ్లతో కొట్టి చంపండని..ఇప్పుడు చేస్తుంది ఏంటి?, రేవంత్ పాత వీడియో వైరల్

Arun Charagonda

ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్‌గా మారింది. మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు అని చెప్పారు. కేటీఆర్ - రేవంత్ మాటల వీడియో వైరల్‌గా మారింది.

Telangana Shocker: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేయించిన బావ, రూ.10 లక్షలతో సుపారీ డీల్, ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఈనెల 1న యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. బావ శ్రీకాంత్‌తో కలిసి హాస్టల్‌లో ఉన్నారు యశ్వంత్.

Advertisement

Jagga Reddy On KTR: రోజా చేసిన చేపల పులుసు తింటారు..కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్, అధికారం లేకపోయే సరికి నిద్రపడటం లేదని కామెంట్

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫన్నీ కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. జగన్ దగ్గరికి పోతరు.. రోజా చేసిన చేపల పులుసు తింటరు.. ఏందిరా నాయనా మీ పంచాయితీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి.. ఇప్పుడు పవర్ లేకపోయేసరికి నిద్రపడతలేదా? అని సెటైర్ వేశారు.

KTR Visits Kaushik Reddy House: సీఎం రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం, ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేశారని కేటీఆర్ ఫైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని డిమాండ్ చేశారు.

Ganesh Idol: రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు

Arun Charagonda

కోటిన్నర కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేశారు వరంగల్ వాసులు. శివనగర్‌ వాసవీ కాలనీకి చెందిన వినాయక ట్రస్ట్ సభ్యులు ఏకంగా కోటిన్నరతో వినాయకుడికి అలంకరణ చేశారు.రూ. 10, 20, 100, 200, 500 నోట్లతో గజమాలలు తయారు చేసి అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ganesh Immersion: వీడియో ఇదిగో.. వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం, అదుపులోకి తీసుకున్న పోలీసులు, తార్నాకలో ఘటన

Arun Charagonda

వినాయక నిమజ్జనంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. తార్నక వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం ఆడారు కొంతమంది. దీంతో పాములతో ఆడుతున్న వేషధారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement

Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్‌ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.

Case Filed Against MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు

Rudra

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

UIDAI Extends Free Online Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌ డేట్‌ గడువు మళ్లీ పొడిగింపు.. డిసెంబర్ 14 వరకూ అవకాశం

Rudra

పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్‌ ప్రకటించింది.

Symbol Of Communal Harmony: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్

Rudra

మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు.

Advertisement
Advertisement