తెలంగాణ
Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, చేపలు పట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన బాధితుడు
Hazarath Reddyమెదక్ జిల్లాలో వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు. టేక్మాల్ మండలం గుండు వాగులో ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు గుండు వాగు బ్రిడ్జి పైకి వెళ్లిన కల్లూరుకు చెందిన రమావత్ నందు (45) ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకుపోతున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు.
Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
CM Revanth Reddy on Khammam Floods: తాను ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని వెల్లడి
Hazarath Reddyఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు (CM Revanth Reddy on Khammam Floods) వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు.
Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డివి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టే పిచ్చి మాటలు, ప్రభుత్వం వరదలపై ప్రజలను అలర్ట్ చేయలేదంటూ మండిపడిన హరీష్ రావు
Hazarath Reddyఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Hyd Traffic Police Issues Advisory: ఆ మూడు రోజులు గచ్చిబౌలి నుండి లింగంపల్లి వెళ్లే ప్రయాణిలకు అలర్ట్, ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyసెప్టెంబర్ 3,6, 9 తేదీల్లో గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో ఇంటర్‌కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ అడ్వైజర్ జారీ చేశారు.
Viral Video: వీడియో ఇదిగో, పోతే నా ఒక్క ప్రాణమే..సాహసం చేస్తే 9 మంది ప్రాణాలు, భారీ వరదల్లో ఖమ్మం జేసీబీ డ్రైవర్ చేసిన సాహసంపై ప్రశంసల వర్షం
Hazarath Reddyతెలంగాణలో వచ్చిన వరదలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది.
Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ
Hazarath Reddyభారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు.
Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు సాయం, వరదలు ముంచెత్తడం బాధాకరమని ట్వీట్
Hazarath Reddyయంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రెండు తెలు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు.
Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన వట్టెం పంప్ హౌస్, టన్నెల్ మీదుగా పంపుహౌస్‌లోకి వెళ్లిన చెరువుల వరద నీరు
Hazarath Reddyనాగర్‌కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్‌హౌస్ (Vattem Pump House) నీటమునిగింది. ప్యాకేజీ-7లోని ఆడిట్ నుంచి పంప్‌హౌస్ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్‌కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది
Telangana Rains: వీడియో ఇదిగో, దుంధుభి నదిలో చిక్కుకున్న 10 మంది చెంచులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ
Hazarath Reddyదుంధుభి నదిలో (Dindi Vagu) చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు గత నెల 31న చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్ వద్ద దుంధుభి వాగులో వారు చిక్కుకుపోయారు
Donation for Flood Victims: ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.
Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వరద బాధితులకు సహాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఉద్యోగులు
Rudraభారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం
Rudraతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.
Road Accident: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
Rudraజనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి రహదారి మధ్యలో ఓ లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.
Floods At Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత.. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు
Rudraభారీ వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది.
Telangana Rain Update: తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rudraభారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణను రానున్న మరో ఐదు రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది.
HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు?! చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే యోచనలో రాష్ట్ర సర్కారు
Rudraసీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థకు కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
IMD Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో ఈ నెల 5న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు
Hazarath Reddyరామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ. 5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Hazarath Reddyఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.
Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం, భారీగా పెరుగుతున్న వరద ఉధృతి
Hazarath Reddyతెలంగాణలో వర్షం విలయం సృష్టించింది. కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది.