తెలంగాణ
Telangana Rains: వీడియో ఇదిగో, బైక్ మీద నుంచి కిందపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తృటిలో తప్పిన ప్రమాదం
Hazarath Reddyమున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి. బైక్‌పై తిరుగుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడ్డారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.ఆయన ఆరోగ్యవ నిలకడగా ఉంది.
DJHS General Body Meeting: మాకూ ఇంటి స్థలాలు ఇచ్చేలా చూడండి.. ముఖ్యమంత్రి రేవంత్ కు డీజేహెచ్‌ఎస్ విజ్ఞప్తి
Rudraజర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో అత్యంత సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) కృతజ్ఞతలు తెలిపింది.
Telangana Rain Alert: తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక
Rudraగత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాలను వాన ముంచెత్తుతున్నది.
Home Minister Amit Shah Calls Telugu states CM's: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై రంగలోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణకు ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ
VNSఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో (Amit Shah Calls Chandrababu) మాట్లాడారు. చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది
Railway Track Swept Away: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మహబూబాబాద్ లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు, పలు రైళ్లు ఆలస్యం, దారి మళ్లింపు (వీడియో ఇదుగోండి)
VNSకేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Rain in Telugu States: తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం (Cyclone crossed the coast at Kalingapatnam) దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Telangana Rains: భారీ వరదలకు ఇల్లు కూలి తల్లికూతురు మృతి, రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి ఇల్లు
Hazarath Reddyనారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
Munneru River Floods Video: వీడియో ఇదిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగు, ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు, బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు
Hazarath Reddyతెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు.
Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…
Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Telangana Rains: భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
Hazarath Reddyతుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Andhra Pradesh: గాజువాకలో దారుణం, తాను సబ్ ఇన్స్‌పెక్టర్ ని అంటూ డెలివరీ బాయ్‌ని కారుతో ఢీకొట్టి బూతులు తిట్టిన కారు యజమాని
Hazarath Reddyడెలివరీ బాయ్‌ని వెనక నుండి గుద్ది, తిడుతూ తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దౌర్జన్యం చేసిన వ్యక్తి. గాజువాక - డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది అతని బ్యాగులను విసిరిపారేసి తిట్టిన కారు యజమాని. భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్‌ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దబాయించిన వ్యక్తి.
Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు
Hazarath Reddyశ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు
Hazarath Reddyగతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Hyderabad Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, రాష్ డ్రైవింగ్ తో పాదచారుల దూసుకొచ్చిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం ngos కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి కారు ఒక్కసారిగా దూసుకు వచ్చింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కాలువలో కొట్టుకొచ్చిన రెండు కార్లు, ఓ కారులో కోదాడ వాసి మృతి
Hazarath Reddyతెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక కోదాడలో భారీ వర్షానికి రెండు కార్లు కాలువలొ కొట్టుకు వచ్చాయి.. ఓ కారులో ఒకరు మృతి చెంది కనిపించారు
CM Revanth Reddy On Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన
Arun Charagondaరాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు.
RTC Bus Stuck In Water: వాగులో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు, కాపాడండి అంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు, రాత్రి నుండి వర్షంలోనే ఉన్నామని ఆవేదన..వీడియో
Arun Charagondaమహబూబాబాద్ - నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను వేడుకుంటున్నారు ప్రయాణికులు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.