తెలంగాణ

Tragedy on Raksha Bandhan: వీడియో ఇదిగో, సోదరులకు రాఖీ కట్టి మరణించిన చెల్లి, ఆకతాయి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన చెల్లెలు

Hazarath Reddy

మహబూబాబాద్ - నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్, కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని నాంపల్లి కోర్టు ఆదేశాలు

Hazarath Reddy

గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

Seethakka Tie Rakhi to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు (వీడియో వైరల్)

Rudra

నేడు రాఖీ పౌర్ణమి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు.

Telangana Crop Loan: ప్రతిపక్షనేత రాహుల్‌కు కేటీఆర్ లేఖ, రుణమాఫీ అందని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్న?

Arun Charagonda

తెలంగాణ రుణమాఫీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖరావారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానని తెలిపిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. . రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే తాము వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.

Advertisement

Kagaznagar Rains: కాగజ్‌నగర్‌లో దంచి కొట్టిన వర్షం, రోడ్లపైకి చేరిన నీరు, స్తంభించిపోయిన జనజీవనం

Arun Charagonda

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ లో భారీగా వర్షం కురిసింది. కుండపోత వర్షంతో దహేగాం,పెంచికల్ పేట్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరగా జనజీవనం స్తంభించిపోయింది.

Human Trafficking In Chandanagar: స్పా ముసుగులో వ్యభిచారం, వ్యభిచార ముఠా గుట్టురట్టు,నలుగురు యువతుల అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ చందానగర్ లో స్పాసెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహకులు. పక్క సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.

Hydra Demolishes Illegaal Constructions: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా, గండిపేటలో ఎఫ్టీఎల్‌ పరిధిలోని నిర్మణాల కూల్చివేత

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారే హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు అధికారులు. పటిష్ట భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతుండగా పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించటం లేదు పోలీసులు.

Jogulamba Gadwal: వరుస దొంగతనాలు, షెట్టర్ పగులగొట్టి మరి దొంగతనాలు, హడలెత్తుతున్న షాప్ యజమానులు

Arun Charagonda

జోగులంబా గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జులకల్ స్టేజ్ లో అర్ధరాత్రి షెట్టర్ పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీలో వీడియో రికార్డు కాగా వరుస దొంగతనాలతో షాప్ యజమానులు హడలెత్తుతున్నారు

Advertisement

Stray Dogs Attack: ములుగులో పిచ్చి కుక్కల స్వైరవిహారం, ఏడుగురు యువకులతో పాటు రెండు మేకలపై దాడి,భయాందోళనలో స్థానికులు

Arun Charagonda

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటాపురం మం. నూగురు గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి చేసింది. హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. రెండు మేకలను సైతం కరిచాయి పిచ్చికుక్కలు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్‌ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Rudra

ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.

Jagtial: ర‌న్నింగ్ లో ఉండ‌గానే ఊడిపోయిన ఆర్టీసీ బ‌స్సు టైర్, ప్ర‌మాద స‌మ‌యంలో 150 మంది ప్ర‌యాణికులు, డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌త‌తో త‌ప్పిన ముప్పు

VNS

జగిత్యాల నుంచి నిర్మల్‌కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నా

Telangana Police: హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత, నలుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు

Arun Charagonda

హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు హాష్ ఆయిల్ విక్రేతని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.10.30 లక్షల విలువ చేసే 1.292 ఎంఎల్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు యువకులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.

Advertisement

KCR Is Back: రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!

Arun Charagonda

తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్‌గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.

Hyderabad: బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, జాబ్ ఇప్పిస్తామంటూ 600 మందికి టోకరా, ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష వసూలు, పోలీసులకు ఫిర్యాదు

Arun Charagonda

హైదరాబాద్ మాదాపూర్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు వల వేసిన కేటుగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. దాదాపు 600 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 1లక్ష ,50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బెంగళూరు, విజయవాడలో సైతం ఈ కన్సల్టెన్సీ ఆఫీస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది

Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్‌ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్

Arun Charagonda

రైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Tulsi Reddy: 'మౌంట్ ఎల్బ్రస్‌'పై తెలంగాణ వాసి, 5642 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి

Arun Charagonda

మౌంట్ ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించారు తెలంగాణ వాసి. ఈనెల 15న యూరప్ ఖండంలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్ తులసిరెడ్డి స్వస్థలం.

Advertisement

Medak Rains: మెదక్‌లో దంచికొట్టిన వాన, వర్షంలో కొట్టుకు పోయిన బైకులు, బైకుల కోసం పరుగెత్తిన వాహనదారులు..వీడియో వైరల్

Arun Charagonda

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ పట్టణంలో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది వర్షం. దీంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది వర్షపు నీరు. వర్షంలో బైకులు కొట్టుకుపోగా బైకుల కోసం పరిగెత్తారు వాహనదారులు. మెదక్ లో అత్యధికంగా 12.6 సెం. మీ, పాతురులో 8.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 9 సెం. మీ, సంగారెడ్డి జిల్లాలో 6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.

Telangana: వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ది చేసిన బంధువులు, వీడియో వైరల్

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం ముచ్చర్ల గ్రామంలో వివాహేతర సంబంధం బయటపడింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇది గ్రహించిన బంధువులు గంభీరావుపేటలో వివాహిత, శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్‌ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Hyderabad Shocker: భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేసిన భర్త, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేశాడు ఓ శాడిస్టు భర్త. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని హుడా కాలనీలో భార్య జ్యోతి(30)ను కత్తితో పొడిచాడు భర్త. తీవ్ర గాయాలతో బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement
Advertisement