తెలంగాణ

Telangana Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బైక్, ముగ్గురు స్పాట్‌లోనే మృతి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం సమీపంలోని రామ గోవిందాపురం గ్రామం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Telangana Cabinet Meeting: తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం, పోలీసుల స్పందన భేష్, స్థానికుల హర్షం

Arun Charagonda

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో బీర్ల సీసాలు, ఉల్లిగడ్డలు చెల్లాచెదురుగా పడ్డాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసులు రోడ్డును శుభ్రం చేసి వేగంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. వారు వ్యవహరించిన తీరు పట్ల వాహనదారులు ప్రశంసలు కురిపించారు.

Telangana Weather Forecast: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్

Hazarath Reddy

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని బులిటెన్‌లో పేర్కొంది.

Advertisement

Telangana: బుజ్జగింపులు.. పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఇంటికి జూపల్లి, ఆసక్తికరంగా రాజకీయాలు, ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారా?

Arun Charagonda

తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బుజ్జగింపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాగా , బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

Telangana Assembly Session: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారిందని మండిపాటు, సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.

Telangana Shocker: కొడుకు బాగా చదవలేదని తండ్రి దారుణం, చితక బాది గోనె సంచిలో కుక్కి చెరువులో పడవేసిన కసాయి, పిల్లాడు ఏడుపులు విని స్థానికులు.

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కొడుకు చదువుకోవడం లేదని ఓ తండ్రి ఆ పిల్లాడిని చితక బాది గోనె సంచిలో కుక్కాడు. అనంతరం ఎవరికి కనిపించకుండా తన ఆటోలో మలపు రాజు కుంట చెరువులో పడవేసి కాళ్లతో తొక్కివేశాడు

Dogs Attack: వృద్దురాలి తల,కడుపు పీక్కుతిన్న కుక్కలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం, ఇంటికి తలుపులు లేకపోవడంతో దాడి

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండ లో దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న పిట్ల రాజ్యలక్మి (75) అనే వృద్ధురాలు పై కుక్కలు దాడి చేశాయి. తల, కడుపు భాగం పూర్తిగా తిన్నాయి కుక్కలు. రాత్రి దాడి చేసి చంపిన కుక్కలు, తెల్లవారి ఉదయం 9గంటలకు చూశారు కుటుంబ సభ్యులు.

Advertisement

CM Revanth Reddy On SC,ST Reservations: దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందన్న మందకృష్ణ

Arun Charagonda

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం..దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ సోదరులకు రిజర్వేషన్లు వర్తించేలా ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించారు.

Telangana Shocker: అందమే ఆమె శాపమైంది, సినిమాల్లో ఛాన్స్‌ పేరుతో అత్యాచారం, మోసపోయిన సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం

Arun Charagonda

అంతమే ఆమె పాలిట శాపమైంది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి ఒడగట్టాడు. హైదరాబాద్ పుప్పాలగూడలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, గర్భిణీ కడుపులో నుంచి బయటకు ఎగిరిపడ్డ పిండం, మనోహరాబాద్ లో బైక్‌ను ఢీ కొట్టిన లారీ

sajaya

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం 44వ జాతీయ రహదారి వద్ద జూలై 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది.

Yellow Alert For Telangana: తెలంగాణ‌కు భారీ వర్ష‌ సూచ‌న‌, వ‌చ్చే నాలుగైదు రోజులు కుండ‌పోత వాన‌లు, ఈ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

ADR Report on Lok Sabha Poll: మొన్నటి ఎన్నికల్లో 365 సీట్లలో లక్షల్లో ఓట్ల తేడా, ఏపీలో 85 వేల ఓట్లకు పైగానే, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంచలన నివేదికను బయటపెట్టిన ఏడీఆర్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద ADR సంస్ధ నివేదిక సంచలన విషయాలను బైట పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Poll 2024) 538 నియోజకవర్గాల్లో , 365 స్థానాల్లో లక్షల్లో ఓట్ల తేడా ఉనట్టు తెలిపింది

Revanth Reddy Vs Sabitha Indrareddy: కంటతడి పెట్టిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అక్కను నమ్మితే మోసం తప్పదని సీఎం రేవంత్ కామెంట్, తీవ్రంగా ఖండించిన సబితా

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్‌కు కీలక సూచన చేశారు. కొంతమంది అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.

Telangana Assembly Session: భట్టి విక్రమార్క సీఎం కావాలి, సీఎం రేవంత్‌ రెడ్డికి సన్మానం చేస్తామన్న కేటీఆర్, వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఏడోరోజు ప్రారంభమయ్యాయి. ద్ర‌వ్య వినిమ‌యం బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌రేట్, మహిళలపై అత్యాచారాలు, పెట్టుబడులు,కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీంల కొనసాగింపు వంటిపై మాటల యుద్ధం నెలకొంది.

Hyderabad Rain Update: ఆగస్టు నెలలో హైదరాబాద్ నగరానికి వరదల ముప్పు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన ఐఎండీ

Hazarath Reddy

చురుకైన రుతుపవనాల సీజన్ తర్వాత ఆగస్టులో హైదరాబాద్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయబడింది. ముఖ్యంగా ఆగస్టు చివర్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Telangana Shocker:వీడియో ఇదిగో.. హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌పై దాడి, పోలీసులతో పాటు నిందితుడిపై ఎటాక్, పలువురు పోలీసులకు గాయాలు

Arun Charagonda

హైదరాబాద్ హయత్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు స్టేషన్ లోకి చొచ్చుకొని వచ్చి పోలీసులపై దాడికి దిగిన మృతురాలి బంధువులు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని చితకబాధారు మృతురాలి బంధువులు. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.

Telangana Shocker: తెలంగాణలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలు, సిగ్గుతో తలదించుకోవాలన్న హరీష్ రావు, పోలీసుల స్పందన ఇదే

Arun Charagonda

తెలంగాణలో ఒక్కరోజే నాలుగు చోట్ల అత్యాచారాలు జరిగాయి. దీనిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వనస్థలీపురం పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం,ఓయూపిఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం,నల్లగొండ జిల్లా శాలిగౌరారం లో దివ్యాంగ మహిళపై అత్యాచారం,నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్. ఇలా ఒకే రోజు నాలుగు చోట్ల అత్యాచార సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.

Road Accident Video: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం వీడియో ఇదిగో, మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్ ర్యాష్ డ్రైవింగ్, ఇద్దరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి తన మిత్రుడితో కలిసి కారును డ్రైవింగ్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది.

Telangana: బీఆర్ఎస్ గూటికి మరో నలుగురు ఎమ్మెల్యేలు?, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేనా?,కాంగ్రెస్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటున్నారు.

Advertisement
Advertisement