తెలంగాణ

PM Modi in Hyderabad: యూపీఏ హ‌యాంలో హైద‌రాబాద్ లో ఎన్ని పేలుళ్లు జ‌రిగాయో గుర్తు తెచ్చుకోండి! సీఏఏను వ్య‌తిరేకించేవారికి ఈ ఎన్నికల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న ప్ర‌ధాని మోదీ

VNS

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో అనేకసార్లు బాంబు పేలుళ్లు (Blast) జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. ఎంతోమంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారని వాపోయారు. మోదీ (Modi) అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయాయని ప్రధాని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

Delhi Excise Policy Case: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Navneet Rana '15 Seconds' Remarks: బీజేపీ ఎంపీ నవనీత్ రానా 15 సెకన్ల వ్యాఖ్యల దుమారం, వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈసీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్‌కౌర్‌ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

MLA Maganti Gopinath Attacked with Sandal: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి.. వీడియో వైరల్

Rudra

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి జరిగింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ పాల్గొన్నారు.

Advertisement

Telangana Elections 2024: ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం, భువనగిరి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ

Hazarath Reddy

తెలంగాణలోని యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని అన్నారు.

Telangana Elections 2024: కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో ఆమె కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

Free Bus Effect in Telangana: ఓవర్ లోడ్ కారణంగా మహిళను బస్సు ఎక్కించుకోని డ్రైవర్, ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు అడ్డం పడిన మహిళ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లక్డికాపూల్‌లో బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నిరాకరించాడు. నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఫైర్ అయ్యారు

Video: ఈ పిల్లలను చూసి చాలా నేర్చుకోవాలి, ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థులు అవగాహన కల్పిస్తున్న వీడియోని షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఓ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. వీడియో షేర్ చేస్తూ.. చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీయం.

Advertisement

Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండల నుంచి ఊరట, మూడు నాలుగు రోజుల పాటు ఇదే మాదిరిగా వర్షాలు, కొన్ని జిల్లాలకు అలర్ట్‌ జారీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది. గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జోరు వాన వల్ల వాతావరణం చల్ల బడింది. అయితే ఈ వానలు ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Telangana Student Missing in Chicago: చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్, మే 2 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలిపిన చికాగో పోలీసులు

Hazarath Reddy

మే 2 నుండి చికాగోలో తెలంగాణ విద్యార్థి తప్పిపోయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర చింతకింది చికాగోలో మే 2 నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.

Cash Seized in AP: తెలంగాణ‌- ఏపీ స‌రిహ‌ద్దుల్లో భారీగా న‌గ‌దు స్వాధీనం, పైపుల్లో దాచి పెట్టి తీసుకెళ్తున్న రూ. 8.40 కోట్ల క్యాష్ సీజ్, ఇద్ద‌రి అరెస్ట్

VNS

ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో (Jaggaiahpet) భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో ఈ నగదు పట్టుబడడం (Cash Seized) గమనార్హం. ఆ నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా సీజ్ చేశారు.

Telangana Elections 2024: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌, రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్, ఆ 48 గంటలను డ్రై డేగా ప్రకటించిన ప్రభుత్వం

Hazarath Reddy

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డేగా ప్రకటించింది. మే 11వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 48 గంటల డ్రై డేగా ప్రకటించింది.

Advertisement

Telangana Elections 2024: తెలంగాణలో RR ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటేసింది, వేములవాడలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అవినీతిలో గత ప్రభుత్వాన్నే అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు.

Yellow Alert for Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు

Hazarath Reddy

వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. రాజధాని హైదరాబాద్‌లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురిసింది.

Car Catches Fire Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నిమిషాల్లోనే దగ్ధమైన రన్నింగ్ కారు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సేఫ్

Hazarath Reddy

మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నీ కీలల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్కాల్ మండలం బొడ్మట్ జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు దగ్ధమైంది.

PM Modi's Telangana Tour: వీడియో ఇదిగో, వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, కోడె మొక్కులు చెల్లింపు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

Advertisement

Hyderabad Rains: భారీ వర్షాలు, బేగంపేటలో నాలాలో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు, ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

భారీ వర్షాలకు నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. బేగంపేటలోని ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ వద్ద ఈ మృతదేహాలను గుర్తించారు. బేగంపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఏడుగురు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోని గోడ కూలి నాలుగేళ్ల బాలుడితో సహా ఏడుగురు మృతి. మరో ఆరుగురికి తీవ్రగాయాలు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలింపు.. మృతులు ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు.

Man Dies of Electrocution: వర్షం పడుతుండగా విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్, హైదరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌ - దూద్‌బౌలికి చెందిన ఫక్రు(40) మంగళవారం బహదూర్‌పురాలో వరదలు ఉన్న రోడ్డు దాటుతున్నప్పుడు విద్యుత్ స్తంభానికి తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతను మద్యం తాగి పడిపోయాడని అనుకున్న స్థానికులు పట్టించుకోలేదు,

Viral Video: వీళ్లు ఇలా తయారవ్వడానికి కారణం తల్లిదండ్రులే, యూత్ వెర్రి వేషాలు వేస్తున్న వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఓ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. వీడియో షేర్ చేస్తూ.. యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు

Advertisement
Advertisement