తెలంగాణ
Telugu States Weather Update: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు రెండు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి
Lok Sabha Elections 2024: బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో 15 సీట్లు కూడా రావు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేరళలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా
Hazarath Reddyకేరళలోని అట్టింగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడు అదూర్‌ ప్రకాష్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా జరిగిన ర్యాలీలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ విజయం సాధిస్తుందని, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 14 స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు.
Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడు, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా నయా స్కెచ్
Hazarath Reddyతెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సైగ చేస్తే చాలని అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు (BRS MP Candidates) , ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
Telangana Elections 2024: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyతెలంగాణ లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా మరో నేత బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు.
Telangana: హనుమాన్ దుస్తులతో స్కూలుకు విద్యార్థులు, తీవ్ర అభ్యంతరం తెలిపిన హెడ్ మాస్టర్, కోపంతో స్కూలును ధ్వంసం చేసిన విద్యార్థులు, వీడియో వైరల్
Hazarath Reddyమంచిర్యాల కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూలు హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
Cash-For-Vote Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కి వాయిదా, వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరడంతో విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం జూలై 24కి వాయిదా వేసింది
Road Accident Video: మూల మలుపులు వద్ద అతివేగంతో వచ్చిన కారు లారీని గుద్దిన వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చాలా ప్రమాదకరం అంటూ షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు.అందులో మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఇలా ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం.
Telangana: ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందిన గర్భిణి, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన
Hazarath Reddyడాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. నారాయణపేట - మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. కానీ అక్కడి వైద్యులు కష్టంగా ఉంది వేరే ఆస్పత్రికు వెళ్లాలని సూచించారు.
Telangana: అసభ్యకర ఫోటోలు తీస్తూ వేధింపులు, ఎలక్షన్ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ. నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది. ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది
Notification For 4th Phase Elections: నాలుగో ద‌శ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గెజిట్ విడుద‌ల‌, నామినేష‌న్ల ప్ర‌క్రియ షురూ, తెలుగు రాష్ట్రాలు స‌హా ఎక్క‌డెక్క‌డ ఎన్నిక‌లున్నాయంటే?
VNSరాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Raghu Babu Car Rams Motorcyclist: ప్ర‌ముఖ న‌టుడు ర‌ఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి, ర‌ఘుబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
VNSసినీనటుడు రఘుబాబు (Raghu Babu) కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మృతిచెందారు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు(48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
Lok Sabha Elections 2024: ఏపీ, తెలంగాణ పోలింగ్‌కు నోటిఫికేషన్ తేదీ ఇదిగో, నాలుగో విడతలో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు పోలింగ్
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా... తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Hyderabad Shocker: దారుణం, లారీతో బైకును గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్, చివరకు ఎలా చిక్కాడంటే..
Hazarath Reddyపాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ ‌పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sri Ram Navami 2024: వీడియోలు ఇవిగో, భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
Hazarath Reddyభద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.
Badradri Thalambralu in RTC: భ‌ద్రాద్రి రాముల‌వారి క‌ల్యాణానికి వెళ్ల‌లేక‌పోయారా? అలాంటివారికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ, ఇంటికే సీతారాముల క‌ల్యాణ త‌లంబ్రాలు, ఎలా పొందాలంటే?
VNSకల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ (TSRTC) శ్రీకారం చుట్టిందని సజ్జనార్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలను కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
Shobha Yatra: హైద‌రాబాద్ లో శ్రీ‌రామ‌న‌వ‌మి శోభాయాత్ర‌, ఈ రూట్ల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటున్న పోలీసులు
VNSశ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు యాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఉండే ప్రార్థన మందిరాలు బయటకు కనిపించకుండా పరదాలతో మూసేశారు. మతపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పండుగల సందర్భంగా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంటారు
Black Magic Rituals Near KCR House: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న అధికారులు
Hazarath Reddyబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్ ఇంటి పక్కన గల ఖాళీ ప్రాంతంలో చేతబడి, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది.
Drunk Techie Wreaked Havoc: మద్యం మత్తులో ఐటీ కారిడార్‌ రోడ్లపై టెక్కీ బీభత్సం, IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు ఆరు యాక్సిడెంట్లు, ఒకరు మృతి, మరో 10 మందికి గాయాలు
Hazarath Reddyతాగుబోతు టెక్కీ ఐటీ కారిడార్‌లోని హైదరాబాద్ రోడ్లపై విధ్వంసం సృష్టించాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల రాయదుర్గం పీఎస్ లిమిట్స్‌లో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు 6 ప్రమాదాలు చేశాడు,
ATM Robbery in Hyderabad: అర్థరాత్రి ఏటీఎంలో చొరబడి రూ. 18 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు, సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేసి మరీ..
Hazarath Reddyహైదరాబాద్ నగర శివారు ఏరియా శంషాబాద్ లో గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి రూ.18,99,000 నగదు దోచుకెళ్లారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎం ఉంది.
Student Suicide At Basara IIIT: బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య, హాస్టల్ గదిలో ఉరేసుకున్న పీయూసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబాసర ఐఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి.. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ) లో అర్వింద్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.