తెలంగాణ

Attacked on Police: బిర్యానీ గురించి గొడవ.. సిబ్బందిపై మద్యం మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన పోలీసుల మీదనే దాడి (వీడియో)

Rudra

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో గలాటా జరిగింది. బిర్యానీ గురించి మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో విర్రవీగుతూ కొందరు యువకులు బిర్యానీ సెంటర్ సిబ్బందిపై వీరంగం సృష్టించారు.

PM Modi Telangana Visit: నేడే మోదీ రెండ్రోజుల తెలంగాణ టూర్ ప్రారంభం.. నేడూ, రేపు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

Rudra

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటారు.

KCR Rally in Karimnagar: కరీంనగర్ లో ఈ నెల 12న బీఆర్ఎస్ సభ... ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్.. రోడ్ షోలలో తానూ పాల్గొంటానని ప్రకటన

Rudra

బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

BRS MLA Meets Revanth Reddy: బీఆర్‌ఎస్‌ కు మరో బిగ్ షాక్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం

VNS

భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Cm Revanth Reddy) కలిశారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి వద్దకు వచ్చారు. వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

One Rupee Marriage: ఒక్క రూపాయికే పెండ్లి.. దివ్యాంగులకు వివాహాలు చేస్తున్న రూపాయి ఫౌండేషన్‌.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే

Rudra

ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తారు. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులు నాగమల్ల అనిల్‌ కుమార్‌, అరుణ ఇటీవల ‘రూపాయి ఫౌండేషన్‌’ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు.

BRS MP List: నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం

Rudra

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌ కు నేడు మాజీ సీఎం కేసీఆర్ రానున్నట్టు సమాచారం. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

Hyderabad Joint Capital: హైదరాబాద్‌ ను మరో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. ఏపీ హైకోర్టులో పిల్

Rudra

హైదరాబాద్‌ ను మరో పదేండ్ల పాటు ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందినా ప్రజాసంక్షేమ సేవా సంఘం ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది.

Indiramma House Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు, ఇళ్లులేని పేదలకు స్థలం, రూ. 5 లక్షలు సాయం, స్థలం ఉన్నవారికి రూ. 5లక్షలు

VNS

ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని (Indiramma House Scheme) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ స్కీమ్ ను వర్తింపజేయలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్.

Advertisement

Viral Video: మోడీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది..బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

sajaya

మోడీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. మోడీ నాయకత్వం భారతదేశానికే కాదు ప్రపంచానికి అవసరం - ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

Yadadri Name Change: యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీఓ విడుదల చేస్తాం...మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

sajaya

యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీఓ విడుదల చేస్తాం.. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి పోతాడు - మీడియాతో చిట్ చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Good News for Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి ఐదు రోజులే పనిదినాలు.. వేతన పెంపు కూడా.. జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం

Rudra

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది.

Temperature Hikes: తెలంగాణ కుతకుత.. 40 డిగ్రీలకు చేరువలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు

Rudra

తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 సెంటిగ్రేడ్ డిగ్రీలకు చేరగా, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 38 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

Advertisement

Pavitranath Passed Away: మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ ఫేమ్‌ పవిత్రనాథ్ అలియాస్ దయ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడించిన ఇంద్రనీల్, మేఘన

Rudra

బుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.

Yadadri Name Change: యదాద్రి ఇకపై మళ్లీ యాదగిరిగుట్ట.. పేరు మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Rudra

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మళ్లీ పేరు మార్చుకోనున్నదా? క్షేత్రం మునుపటి పేరు యాదగిరి గుట్టగానే స్థిరపడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

Krish in Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ రక్త, మూత్ర నమూనాల సేకరణ.. ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు

Rudra

హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ కేసు శరవేగంగా సాగుతున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీదర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.

Hyderabad: హైద‌రాబాద్ వాసుల‌కు తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు, డిఫెన్స్ భూముల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ గ్రీన్ సిగ్న‌ల్

VNS

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం పట్టణాలను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.

Advertisement

Inter Board: ఇంట‌ర్మిడియెట్ విద్యార్ధుల‌కు గుడ్ న్యూస్, నిమిషం నిబంధ‌న ఎత్తివేసిన బోర్డు, ఐదు నిమిషాల గ్రేస్ పిరియ‌డ్ ఇస్తూ నిర్ణ‌యం

VNS

ఇంటర్‌ విద్యార్థులకు (Inter Students) గుడ్‌న్యూస్‌. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్‌ బోర్డు సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా పరీక్షకు అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దిష్ట కారణాలతో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకునే వారిని 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌తో అనుమతించాలని ఇంటర్‌ బోర్డు సూచించింది

Harish Rao Sensational Comments: కాళేశ్వ‌రాన్ని కూల్చేందుకు రేవంత్ స‌ర్కారు కుట్ర‌, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీష్ రావు, మేడిగ‌డ్డ‌పై అఖిల‌ప‌క్షాన్ని పిలిస్తే వ‌స్తాం

VNS

బీఆర్‌ఎస్‌ను పడగొట్టెందుకు.. కాళేశ్వరం పడగొట్టే కుట్ర రేవంత్ రెడ్డి (Revanth reddy) చేస్తున్నారని మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ (Medigadda) పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది.

Scorching Summer in India: రాబోయే 3 నెలలు భానుడు భగభగలు, తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని ఐఎండీ వార్నింగ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

భారతదేశం ఈ ఏప్రిల్‌లో దేశంలో అతిపెద్ద ఎన్నికల సీజన్‌లోకి వెళుతున్నందున మండే వేసవిని (Scorching Summer in India) చూడబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులను హెచ్చరించింది.రాబోయే మూడు నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో హీట్‌వేవ్ రోజులను మేము ఆశిస్తున్నామని తెలిపింది.

Indian Air Force: ఐఏఎఫ్‌ విమానంకు తప్పిన పెను ప్రమాదం, సాంకేతిక లోపంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు, ఎట్టకేలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్

Hazarath Reddy

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం IAF C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటకుపైగా ఎయిర్‌ఫోర్స్‌ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కాకవడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.

Advertisement
Advertisement