తెలంగాణ

IPS Transfers In Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు: 12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి

sajaya

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో ప్రధానంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌గా మల్టీ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ తరుణ్ జోషిని నియమిస్తూ, ప్రస్తుత అధికారి జి. సుధీర్ బాబుతో పాటు మరో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Elections 2024: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మంది బదిలీ

Hazarath Reddy

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.

Groundnut Farmers Protest: అచ్చంపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌పై దాడి చేసిన వేరుశెనగ రైతులు, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

Hazarath Reddy

వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద శెనగ రైతులు నిరసన తెలుపారు. అక్కడకు వచ్చిన అచ్చంపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌పై దాడి చేసి, చీరతో లాగి, కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

Hyderabad: వీడియో ఇదిగో, పెట్రోల్ అయిపోవడంతో కస్టమర్‌ని బైక్ మీద కూర్చోపెట్టుకుని తోసుకుంటూ వెళ్లిన రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్

Hazarath Reddy

నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన అసాధారణ సంఘటనలో, హైదరాబాద్‌లోని రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో తన బైక్‌ను దానిపై ఉన్న కస్టమర్‌తో నెట్టవలసి వచ్చింది. రైడర్ పరిస్థితి గురించి కస్టమర్‌కు తెలియజేశాడు, కాని తరువాతి కస్టమరన్ దిగడానికి నిరాకరించాడు

Advertisement

CM Revanth Reddy vs Harish Rao: కొడంగల్‌ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరిలో పడ్డావు, కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఏద్దేవా చేశారు.

CM Revanth Reddy vs Harish Rao: వాటర్ మీద చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా, ఘాటుగా బదులిచ్చిన హరీష్ రావు

Hazarath Reddy

Hyd, Feb 8: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు’ పేరుతో నోట్ విడుదల చేసింది.

ICU Patient Bitten by Rats: కామారెడ్డిలో ఐసీయూ పేషెంట్‌పై ఎలుకలు దాడి ఘటన, ఇద్దరు వైద్యాధికారులతో సహా నర్సింగ్‌ ఆఫీసర్‌ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య శాఖ

Hazarath Reddy

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Hookah Parlours Ban in Telangana: తెలంగాణలో మూతపడనున్న హుక్కా సెంటర్లు, ఎలాంటి చర్చలేకుండానే హుక్కా సెంటర్లపై నిషేధం బిల్లుకు సభ ఏకగ్రీవ ఆమోదం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి.హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు సభలో ప్రవేశపెట్టారు.

Advertisement

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌, వయోపరిమితి 44 నుండి 46 ఏళ్లకు పెంపు, జీవో జారీ

Hazarath Reddy

తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యో నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్‌ సర్వీస్‌ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Gas Cylinder Blast in Hyd: హైదరాబాద్ శివారులో భారీ శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఓ భవనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలిన సంగతి తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

White Paper On Irrigation Projects: తెలంగాణ అసెంబ్లీలో వాట‌ర్ వార్, సాగునీటి ప్రాజెక్టుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల‌కు కాంగ్రెస్, కృష్ణాప్రాజెక్టుల అప్ప‌గింత‌పై పోరాటానికి బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం

VNS

నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం (White Paper On Irrigation Projects) విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై (Budget) సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.

Hyderbad: దారి విష‌యంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌, ఫుల్లుగా మ‌ద్యం తాగి అన్న‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన త‌మ్ముడు

VNS

తన ఇంటిలో ఓ డబ్బాలో 3 లీటర్ల పెట్రోలును నిల్వ ఉంచాడు. సాయంత్రం అన్న శ్రీనివాస్‌ తన ఇంటి అద్దె వసూలు చేసుకొని.. వెళ్తున్న సమయంలో వెనుక నుంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించి ( Set On Fire) పారిపోయాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి 108 అంబులెన్స్‌లో గాంధీ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Bonthu Rammohan Meets CM Revanth Reddy: గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్, సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన జీహెచ్ఎంసీ తొలి మేయ‌ర్ బొంతురాంమోహ‌న్, త్వ‌రలోనే కాంగ్రెస్ లో చేరే అవ‌కాశం

VNS

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు బొంతు రామ్మోహన్. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.

Viral Video: లైవ్ వీడియోలో కిచెన్ లో పేలిన గ్యాస్ సిలిండర్..చుట్టు పక్కల వాళ్లు పరుగో పరుగు..

sajaya

అనాజ్ పూర్‌ ఓ ఇంట్లో షాట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగి ఇంట్లో వున్న సిలిండర్ పేలింది. స్థానికులు వెంటనే ఫైర్ ఇంజనుకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Police Saves Women Life: ప్రాణం నిలిపిన దేవుడు ఈ పోలీసు.. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వలిగొండ పీఎస్ ఎస్సై (వైరల్ వీడియో)

Rudra

ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడి ఓ పోలీసు దేవుడిగా మారారు. యాదాద్రి భువనగిరి - వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.

క్యాడ్‌ బరీ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. కంగుతిన్న బాధితుడు.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!

Rudra

హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ లో ఓ వ్యక్తి క్యాడ్‌ బరీ చాక్లెట్‌ కొన్నాడు.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో కంగుతిన్న బాధితుడు దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Kamareddy Horror: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. ఐసీయూలోని రోగి చేతిని కొరికిన ఎలుకలు

Rudra

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఐసీయూలోని రోగి చేతిని ఎలుకలు కొరకడం వివాదాస్పదమైంది. అసలేం జరిగిందంటే.. షేక్ ముజీబ్ అనే వ్యక్తి ఇదే దవాఖానాలోని ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు.

Kaleshwaram Tour: ఫిబ్రవరి 13న కాళేశ్వరం, మేడిగడ్డకు 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది లోక్‌సభ, 7గురు రాజ్యసభ సభ్యులను తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన...కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానం

sajaya

ఫిబ్రవరి 13న కాళేశ్వరం ప్రాజెక్టును అఖిలపక్షం సందర్శించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తే నిజాలు దాగవు. ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని ఈనెల 13న కాలేశ్వరం ప్రాజెక్టుకు వెళ్దాం. మేడిగడ్డకు వెళ్తే బిఆర్ఎస్ బాగోతం బయటపడుతుంది. ఈ సభ నుంచే కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నా. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

Telangana Budget 2024: రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ..అర్హులకే రైతు బంధు.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం..తెలంగాణ బడ్జెట్ లో హైలైట్స్ ఇవే..

sajaya

రాష్ట్ర బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయలుగా తేలింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఆరు హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని అధికార పక్షం చెబుతోంది.

Viral Video: రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది.. మహిళ మెడలో చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్లు.. పటాన్‌ చెరులో ఘటన.. వీడియో వైరల్

Rudra

రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది. మహిళలపై దొంగల దాడులు పెరిగిపోయాయి. పటాన్‌చెరు - అమీన్‌పూర్‌ లో ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్లు బుల్లెట్ బైక్‌ పై వచ్చి.. మెడలోనుంచి 8 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు.

Advertisement
Advertisement