తెలంగాణ

Muslim Women Perform Shiva-Puja: వీడియో ఇదిగో, శివుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు, తెలంగాణలో వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మతసామరస్యం వెల్లవిరిసిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముస్లిం మహిళలు శివుడికి పూజలు చేస్తూ కనిపించారు. నాగర్‌కర్నూల్ - అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాను దర్శించుకున్న ముస్లిం మహిళలు.. అనంతరం ఉమామహేశ్వర కొండకు వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Hyderabad Murder Case: హైదరాబాద్‌లో తొలిసారి, భార్యను పొడిచి చంపిన భర్తకు ఉరిశిక్ష విధించిన కోర్టు, కత్తెరతో గొంతులో, స్క్రూ డ్రైవర్‌తో ప్రైవేట్ భాగాల్లో దారుణంగా..

Hazarath Reddy

భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన భర్తకు (Hyderabad man stabs wife in throat with scissors) నాంపల్లి క్రిమినల్‌ కోర్టు మరణశిక్షను విధించింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడు ఇమ్రాన్ ఉల్ హక్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష (gets death sentence for murder) విధిస్తూ తీర్పును వెల్లడించింది.

Women Fight For Seat Video: వీడియో ఇదిగో, బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు, దుబ్బాకకి బస్సు వస్తుండగా ఘటన

Hazarath Reddy

సిద్దిపేట - సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న మహిళలు.సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు.

Mega Plastic Surgery Camp: పేదలకు గొప్ప శుభవార్త. హైదరాబాద్ లో ఉచితంగా మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌.. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

హైదరాబాద్ లోని పేదలకు శుభవార్త. మెర్సీ మిషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రీన్‌ ల్యాండ్స్‌, రాంకీ ఫౌండేషన్‌, పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉచిత మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు.

Advertisement

Ram Lalla Statue in Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య రామ్ లల్లా.. విగ్రహం తొలి ఫొటో ఇదే..

Rudra

జాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు.

Akasa Air: 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలుకు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ఆర్డర్, విమానయాన రంగంలో సంచలనానికి తెరలేపిన ఎయిర్ లైన్స్

Hazarath Reddy

ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్‌లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు.

Ram Temple Pran Pratishtha Ceremony: ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ అయోధ్య రామ మందిర ఘట్టం, అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారని తెలిపిన తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Hazarath Reddy

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరికాదని మన శంకరాచార్యులు నలుగురూ అన్నారు.. ఈ ఘటనను రాజకీయ ఘట్టంగా అందరూ భావిస్తున్నారు.

Kalbairav Hanuman Mandir: పాతబస్తీ కాలభైరవ హనుమాన్ మందిర్‌లో లోకశాంతి కోసం మహా యజ్ఞం, అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన భక్తులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ హుస్సేనీ ఆలం ప్రాంతంలోని కాలభైరవ హనుమాన్ మందిర్‌లో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు రామభక్తులు లోకశాంతి కోసం మహా యజ్ఞం నిర్వహించారు. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Free Travel for Women: పురుషులు డబ్బులు పెట్టి టికెట్లు కొన్నా సీట్లు దొరకడం లేదు, ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టులో పిటిషన్

Hazarath Reddy

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ (Public interest litigation) దాఖలైంది.

Rajareddy Engagement: మేన‌ల్లుడి నిశ్చితార్ధానికి హాజ‌రుకానున్న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, చాలా రోజుల త‌ర్వాత ఒక్క‌టి కానున్న వైయ‌స్సార్ ఫ్యామిలీ

VNS

మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ (Ys Sharmila Son Rajareddy) వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ (YS Jagan) ఇవాళ‌ హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు.

Tribute to NTR: ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నంద‌మూరి కుటుంబ స‌భ్యుల నివాళులు, తాత‌కు ఘ‌నంగా నివాళులు అర్పించిన జూనియ‌ర్ ఎన్టీఆర్

VNS

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) నివాళులర్పించారు. తెల్లవారు జామున ఘాట్ వద్దకు చేరుకొని అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

KCR Walking Video: వీడియో ఇదిగో, ఊత కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్, తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఫాం హౌస్ లో కాలు జారి పడిపోయిన సంగతి విదితమే. అనంతరం ఆయనకు యశోదా ఆస్పత్రిలో కాలికి సర్జరీ చేశారు. తాజాగా ఆయన తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటూ ఊత కర్ర సాయంతో నడుస్తున్న వీడియో బయటకు వచ్చింది.

Advertisement

Tammineni Veerabhadram Health Bulletin: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ ఆసుపత్రి వైద్యులు, వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని రిపోర్డులో వెల్లడి

Hazarath Reddy

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి బుధవారం విడుదల (Tammineni Veerabhadram health bulletin) చేసింది. ప్రస్తుతం తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా (condition stable) ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది.

Sudden Death in Telangana: వీడియో ఇదిగో, కల్లు గీస్తుండగా కార్మికుడికి గుండెపోటు, తాటి చెట్టుపైనే ప్రాణాలు వదిలిన గీత కార్మికుడు

Hazarath Reddy

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ప‌రిధిలోని రాజ‌న్న‌గూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాటి చెట్టు పైనే గుండెపోటుతో కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు.

Security Guard Stuck in Lift: లిఫ్టులో చిక్కుకుని విలవిలలాడిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు, రెండు కాళ్లు బయట బాడీ లోపల..

Hazarath Reddy

Woman Dies of Cardiac Arrest: షాకింగ్ వీడియో ఇదిగో, భోగి వేడుకల్లో కోలాటం వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ, గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన రాజమణి (40) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

World Economic Forum 2024: అదానీ గ్రూప్‌తో రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, దావోస్‌లో మూడో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Hazarath Reddy

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.

Kishan Reddy Cleaning Temple Video: వీడియో ఇదిగో, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చెత్తను ఊడ్చి చేతులతో ఎత్తేసిన కిషన్ రెడ్డి, స్వయంగా విగ్రహ మూర్తుల్ని శుద్ధి చేసిన కేంద్ర మంత్రి

Hazarath Reddy

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hyderabad Fire: కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం, డ్రమ్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో పొగ‌లు ద‌ట్టంగా అలుముకున్నాయి.

Power Cuts in Hyderabad: నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు హైదరాబాద్‌లో రెండు గంటలు కరెంట్ కోతలు, వివరాలు http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు రోజూ రెండు గంటలు కరెంట్ కోతలు (Two hours of power cuts in Hyderabad) అమల్లోకి రానున్నాయని విద్యుత్ అధికారులు ప్రకటించారు. వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు

Advertisement
Advertisement