తెలంగాణ

SC on Hate Speech in Rallies: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలీలో ద్వేషపూరిత ప్రసంగాలు జరగకుండా చూడండి, జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

హిందూ జనజాగృతి సమితి, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు టి రాజా సింగ్‌లు నిర్వహించే ర్యాలీలలో విద్వేషపూరిత ప్రసంగాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన తరువాత, మహారాష్ట్రలోని యవత్మాల్ మరియు రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, ఇల్లు శుభ్రం చేద్దామని పిలిచి భార్య తల నరికి మొండెం వేరు చేసి పరారైన భర్త, పోలీసుల అదుపులో నిందితుడు..

Hazarath Reddy

హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్యచేసి తల, మొండెం వేరు (Beheads Her Over Suspicion of Affair) చేశాడు.

Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు, ఓవర్ టేకింగ్ చేస్తూ బైకును గుద్దిన ఆటో, ఎగిరి పక్కన పొలంలో పడిన బైకు మీద ఉన్న ఇద్దరు

Hazarath Reddy

రోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియోని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వీడియోని ట్వీట్ చేస్తూ.. మలుపు వద్ద లేదా ఎదురుగా వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా కనిపించని చోట ఎట్టిపరిస్థితుల్లోను ఓవర్ టేకింగ్ చేయకూడదని ట్యాగ్ లైన్ ఇచ్చారు.

Telangana: వీడియో ఇదిగో, చిందులేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలకొట్టిన దుండగుడు, పోలీసుల ముందే..

Hazarath Reddy

శేరిలింగంపల్లి - అల్ల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాళ్ళతో పగలకొట్టిన దుండగుడు. ఈ తతంగాన్ని స్థానికులు చూస్తున్నారే కాని ఎవరూ ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

CM Revanth Reddy Davos Tour: దావోస్ టూర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారాన్ని మొదలు పెట్టామని వెల్లడి

Hazarath Reddy

భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌)లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్లిన సీఎం.. 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో పాల్గొననున్నారు.

DGCA New Guidelines: విమానాలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎయిర్‌ లైన్స్ రద్దు చేయవచ్చు.. విమాన టికెట్‌ పైనే ఈ విషయం ముద్రణ.. ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ

Rudra

విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ ను (ఎస్‌వోపీ) జారీ చేసింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపిన ఈడీ

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది.రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది.

Siddipet Road Accident Video: వీడియో ఇదిగో, స్పీడ్ కంట్రోల్ కాక నాలుగు పల్టీలు కొట్టిన కారు, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైకర్, ఒకరు మృతి

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటన మరొక వాహనం యొక్క డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకర్‌ ఒక్కసారిగా తప్పించుకున్నాడు. కాగా కారు బోల్తా పడిన వెంటనే నాలుగు పల్టీలు కొట్టింది.

Advertisement

CM Revanth Reddy Davos Tour: దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, భారీ పెట్టుబడులే లక్ష్యంగా 5 రోజుల పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం

Hazarath Reddy

తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌) పర్యటనకు నేడు బయల్దేరారు. ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో సీఎం రేవంత్‌ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది.

Telangana Road Accident: పండుగ వేళ దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Pongal Tragedy: సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం.. బైక్‌ వస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకొని జవాను బలి.. పతంగి కోసం వెళ్లి భవనంపై నుంచి కాలుజారిపడి ఏఎస్సై కుమారుడు మృతి

Rudra

సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. వ్యాపారులు అమ్మొద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. పతంగి ఎగరేస్తూ ఏఎస్సై కుమారుడు భవనంపై నుంచి పడి చనిపోయాడు.

Pongal Wishes: నేడే పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పర్వదినం సందర్భంగా మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ అందించే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ తెలియజేయండి.

Rudra

తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి.

Advertisement

Yatra 2: యాత్ర‌-2 మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేష్, షర్మిల పాత్ర‌ల‌పై క్లారిటీ, వ్యూహం త‌ర‌హాలో ఉండ‌బోద‌న్న మూవీ టీం

VNS

యాత్ర 2 ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘యాత్ర 2లో వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్ నటిస్తోండగా.. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మహేశ్ మంజ్రేకర్‌నటిస్తున్నాడు.

Chinese Manjha: మాంజా మెడ‌కు చుట్టుకొని జ‌వాన్ మృతి, చైనా మాంజాల కార‌ణంగా హైద‌రాబాద్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు మృతి, వంద‌ల్లో ప‌క్షులు మ‌ర‌ణం

VNS

మృతుడిని పేట్‌ బషీర్‌భాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్‌ఐ తనయుడు ఆకాశ్‌గా గుర్తించారు. పతంగుల కారణంగా గత రెండురోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. చైనా మాంజాపై నిషేధం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు. పతంగులను ఎగురవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలివేస్తుండడంతో మాంజాదారం

SCR Special Trains: సంక్రాంతికి ట్రైన్ టికెట్లు దొర‌క‌లేదా? మీకోస‌మే ప్ర‌త్యేక రైళ్లు న‌డిపిస్తున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, స్పెష‌ల్ ట్రైన్స్ షెడ్యూల్ ఇదే!

VNS

ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లను పట్టాలెక్కించింది. సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ -తిరుపతికి (07489) ప్రత్యేక రైలు 15న సోమవారం రాత్రి 20.10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది

Governor Tamilisai: రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుకలు.. పాయ‌సం వండిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌందర్ రాజన్.. వీడియో

Rudra

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

Advertisement

Madras High Court About Porn Videos: అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. వీడియోలు చూసినవారిపై నిందలు మానేసి వారిని ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని హితవు

Rudra

స్మార్ట్ ఫోన్‌ లో చిన్నారుల పోర్న్ వీడియోలను చూసినట్టు నమోదైన ఓ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది.

Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Rudra

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.

Mother Killed Children: పండుగ‌కు బ‌ట్ట‌లు కొనివ్వ‌లేద‌ని భ‌ర్త‌పై కోపంతో ఇద్ద‌రు పిల్ల‌ల్ని చంపిన త‌ల్లి, క్ష‌ణికావేశంలో తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డ మ‌హిళ‌

VNS

ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా అతనితో గొడవకు దిగింది. ఆ క్షణికావేశంలో ముక్కపచ్చలారని ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా (Mother Killed Children) చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య (Suicide) చేసుకుంది.

Traffic Restrictions: హైద‌రాబాద్ లో మూడు రోజుల పాటూ ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వెళ్లేవారు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని పోలీసుల సూచ‌న‌

VNS

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివెల్‌-2024 (International Kite Festival) సందర్భంగా ప‌రేడ్ గ్రౌండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Advertisement
Advertisement