తెలంగాణ

Epuri Somanna To Join In BRS: బీఆర్‌ఎస్‌లోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న, సింగర్‌ సాయిచంద్‌ స్థానాన్ని భర్తీ చేస్తారా?మంత్రి కేటీఆర్‌తో భేటీ, ఆత్మీయ ఆలింగనం

VNS

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న (Epuri Somanna) త్వరలోనే బీఆర్‌ఎస్‌లో (BRS) చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ల సమక్షంలో ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌ను (KTR) ఆలింగనం చేసుకున్నారు.

Weather Update: తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

గత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Hyderabad: వీడియో ఇదిగో, హిజ్రాలతో ముజ్రా డాన్స్ వేయించిన రౌడీ షీటర్లు, స్టేషన్‌కు తీసుకువెళ్లి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చిన పోలీసులు

Hazarath Reddy

హిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించిన రౌడీ షీటర్లకి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ పోలీసులు. హైదరాబాద్ లోని హబీబ్ నగర్లో అక్బర్ అనే రౌడీ షీటర్ గాంగ్ ద రింగ్ పార్టీలో హిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు తమ తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వీడియోలు ఇవిగో..

Video: వీడియో ఇదిగో, వినాయకుడి మండపంలో నిద్రిస్తున్న వారి సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన దొంగ

Hazarath Reddy

గణేష్ మండపాలను సైతం దొంగలు వదలడం లేదు. రెండు రోజుల క్రితం మియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఓ దొంగ సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు. మండపంలో నిద్రిస్తున్న వారు లేవగా అక్కడి నుంచి పారిపోయాడు

Advertisement

Changes in Vande Bharat Express: సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్‌ రెస్ట్‌ కు మెరుగులు, ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు.. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వందేభారత్‌ రైళ్లలో రైల్వేశాఖ 25 కీలక మార్పులు

Rudra

అత్యాధునిక వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో ప్రయాణం ఇకపై మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వందేభారత్‌ రైళ్లల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్టు రైల్వే శాఖ పేర్కొంది.

Telangana: వీడియో ఇదిగో, భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త , అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరింపులు, చివరకి ఏమైందంటే..

Hazarath Reddy

జగిత్యాల - ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ వృత్తి రీత్యా పెయింటర్. భార్య కాపురానికి రావడం లేదని హెవీ విద్యుత్ లైన్ పోల్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భార్య రాకుంటే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు.

Hyderabad: వీడియో ఇదిగో, వినాయకుడి చేతిలో 11 కేజీల లడ్డును దొంగ ఎంత స్మార్ట్‌గా దొంగిలించుకుని వెళ్లాడో చూడండి

Hazarath Reddy

కెమెరాకు చిక్కిన లడ్డు దొంగ. హైదరాబాద్ - మియాపూర్ గణేష్ మండపం వద్ద పెట్టిన 11కేజీల లడ్డు దొంగతనం చేస్తూ ఓ యువకుడు సీసీటీవీ కెమెరాలలో దొరికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TSRTC MD Sajjanar Tweet: ఒక్క క్షణానికి ఎంతో విలువ ఉంటుందంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించిందంటూ కొటేషన్

Hazarath Reddy

.ఈ ట్వీట్ లో ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించింది. క్షణానికి ఎంతో విలువ ఉంటుంది. ఒక్క క్షణం ఓర్పు, సహనం జీవితాలనే మార్చేస్తుంది. ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.

Advertisement

Telangana Shocker: తెలంగాణలో దారుణం, మద్యం మత్తులో భర్తను చంపిన భార్య , వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య భర్తను చంపేసింది. రంగారెడ్డి జిల్లాలోని పెంచర్ల గ్రామంలో నిన్న రాత్రి మద్యం మత్తులో భర్త మీద కోపంతో రోకలితో దారుణంగా కొట్టి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సత్తెమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Green Metro Luxury: 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతామని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Hazarath Reddy

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు.

Nalgonda Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టిన కారు, ప్రమాద స్థలంలోనే నలుగురు మృతి

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Telangana: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన గంజాయి కేసు నిందితుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు

Advertisement

Video: వీడియో ఇదిగో, మహిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మనందరివి చాలా చిన్న జీవితాలు , అందులో నా పాత్ర నేను పోషించాను అనుకుంటున్నాను. కాబట్టి హిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Road Accident Video: వీడియో ఇదిగో, తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా మోత్కూరు తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన వీడియో ఇదిగో..

Telangana Shocker: వీడియో ఇదిగో, వృద్ధురాలైన అత్తని చీపురుతో దారుణంగా కొట్టిన పెద్ద కోడలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న కొడుకు

Hazarath Reddy

యాదాద్రి భువనగిరిలో వృద్ధురాలైన లక్ష్మమ్మను పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టతో విచక్షణ రహితంగా కొట్టింది, అయితే ప్రతి రోజూ ఏదో సమయంలొ తరచూ కొడుతుండటంతో సహించలేక ఆమె చిన్న కుమారుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

TSRTC Green Metro Luxury Ac Buses: హైదరాబాద్ రోడ్లపైకి గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, ఒక్కసారి ఛార్జ్ చేస్తేచాలు ఏకంగా 225 కి.మీ ప్రయాణించవచ్చు, ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

VNS

పర్యావరణ హితమైన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ తీసుకొస్తుంది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు (Green Metro Luxury Ac Buses) పరుగులు తీయనున్నాయి. ఇవాళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులను ప్రారంభించనున్నారు.

Advertisement

Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం, కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలిపిన మధుయాష్కీ

Hazarath Reddy

చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోడీ హస్తం ఉంది. కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారు - కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ

Congress Workers Fight Video: కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి, హుస్నాబాద్‌లొ తన్నుకున్న పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గీయలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పథకాల గ్యారెంటీ కార్డ్స్‌తో సీడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్‌తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తున్నారు.

MLC Kavitha: అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది.. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత

Rudra

అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ (BRS) కృషి ఉందన్నారు.

Parliament Special Session 2023: ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్, ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని ఫైర్

Hazarath Reddy

ఈ రోజు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Advertisement
Advertisement