తెలంగాణ
Telangana: వీడియో ఇదిగో, తెలంగాణ గవర్నర్‌ కారు వద్దకు వెళ్లి స్వయంగా స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం
Hazarath Reddyరాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్‌ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై‌, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు
Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన, ఈ జిల్లాలకు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుందంటే..
Hazarath Reddyతెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Chaddi Gang Video: చడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ఎలా వెళుతున్నారో వీడియోలో చూడండి, వారు హైదరాబాద్ వచ్చి దొంగతనం ఎలా చేస్తున్నారో వివరించిన సైబరాబాద్ పోలీసులు
Hazarath Reddyచడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ ఎలా వచ్చిందో సైబరాబాద్ పోలీసులు వివరించారు. డీసీపీ మాదాపూర్ జీ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులంతా గుజరాత్‌కు చెందినవారే.
Telangana: సభ్య సమాజం సిగ్గు పడే ఘటన, రోడ్డుపైనే ప్రసవించిన ఆదివాసీ మహిళ, నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ
Hazarath Reddyస్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి వచ్చినప్పటికీ డీజిల్ లేక అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డు పై మగ శిశువు ప్రసవం. నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ.
Talasani Srinivas Yadav: సారీ అనుకోకుండా జరిగింది, రాజేష్ బాబును చెంప దెబ్బ కొట్టడంపై మంత్రి తలసాని వివరణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyభైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu)పై తలసాని చేయి చేసుకున్న సంగతి విదితమే. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో తలసాని.. మంత్రి కేటీఆర్ వెనకాల రాజేష్ బాబు వెళ్తుండగా అడ్డుకుని చెంపపై కొట్టారు.
Earthquake in Manuguru: మణుగూరులో ఒక్కసారిగా కంపించిన భూమి.. భయభ్రాంతులకు గురైన ప్రజలు.. వీడియోతో
Rudraభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణం లో ఒక్కసారి గా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 4-40 గంటలకు భూమి‌ స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలికిపడి బయటకు పరుగులు తీశారు.
Bhadrakali Temple: శ్రావణ శుక్రవారం సందర్భంగా.. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Rudraరాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.
Secretariat: సచివాలయంలో నేడు ప్రార్థనామందిరాలు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
Rudraసర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలు ఆలయం, మసీదు, చర్చిని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.
Siddipet Horror: భార్యతో గొడవ.. కౌన్సెలింగ్‌ కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో రంగనాయక రిజర్వాయర్‌ లో దూకి టెకీ ఆత్మహత్య.. సిద్దిపేటలో ఘోరం
Rudraసిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్ హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.
Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraనేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.
Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!
Rudraచంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Telangana HC on Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు,రూ. 3 లక్షల జరిమానా
Hazarath Reddyగద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ షాక్‌ తలిగింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది.
Telangana Horror: సిద్దిపేట జిల్లాలో దారుణం, మహిళ గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేసి దారుణ హత్య
Hazarath Reddyఇటీవల కాలంలో మానవ మృగాల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లాలో ఓ మహిళను ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది.
Video: వీడియో ఇదిగో, బైక్‌ను ఓవర్‌టేక్ చేయబోయి బోల్తా పడిన ఆటో, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘటన, ముగ్గురికి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 3 మందికి గాయాలయ్యాయి. వీడియో ఇదిగో..
TS DSC 2023:నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, కీలక వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్
Hazarath Reddyబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.
Bathini Harinath Goud Passed Away: బత్తిని హరినాథ్‌ గౌడ్ కన్నుమూత, తరతరాలుగా ఉచితంగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని సోదరులు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్ గౌడ్
VNSఆస్తమా (Asthma), ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ (Fish prasadam) చేసే బత్తిని హరినాథ్‌ గౌడ్‌ (Bathini Harinath goud) కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో ఒకరైన 84 ఏండ్ల హరినాథ్‌ గౌడ్‌ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం
Mokila Layout Auction: మోకిలలో భూముల వేలానికి అనూహ్య స్పందన, ఏకంగా గజం లక్ష పలికిన ధర, తొలిరోజే ప్రభుత్వానికి ఏకంగా రూ. 122 కోట్ల ఆదాయం
VNSమోకిలలోని (Mokila) హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో (HMDA Layout) ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్‌లైన్‌లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది. బుధవారం నుంచి రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి ఉంచింది
Telanagana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ, ఈటల స్థానంలో పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్, ఇవాళ ప్రమాణస్వీకారం
VNSరంగారెడ్డి జిల్లా ఎ మ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో మరోసారి స్థానం దకనున్నది. సీఎం కేసీఆర్‌ గురువారం చేపట్టనున్న క్యాబినెట్‌ విస్తరణలో రెండోసారి మం త్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ (BRS) అధిష్ఠానం ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం ఇచ్చింది.