తెలంగాణ

KCR Nutrition Kit: రేపు నిమ్స్ ఆసుపత్రిలో న్యూట్రిష‌న్ కిట్ల పంపిణీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టనున్న సీఎం కేసీఆర్, న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కం మొత్తం 24 జిల్లాల్లో పంపిణీ

kanha

గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌లు’ అనే మరో మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు న్యూట్రిష‌న్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి నిమ్స్ లో శ్రీ‌కారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్.

TS ECET 2023 Result Out Check Here: తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల.. 93.07 శాతం ఉత్తీర్ణత.. 22,454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,899 మంది ఉత్తీర్ణత..

kanha

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా TS ECET 2023 ఫలితాలను ప్రకటించింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ecet.tsche.ac.inలో తమ మార్కులను తనిఖీ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వబడింది.

TSRTC: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇచ్చిన టీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది.

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని సూసైడ్‌ కేసులో కొత్త ట్విస్ట్, డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు

Hazarath Reddy

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్‌ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ కేసులో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు

Advertisement

Hyderabad Shocker: నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, హాస్టల్‌ భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ లో బాచుపల్లిలో నారాయణ కాలేజీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్‌ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం హాస్టల్‌ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక అనే విద్యార్థిని మృతి చెందింది

Tax Devolution to Telugu States: తెలంగాణకు 2,486 కోట్లు, ఏపీకి 4,787 కోట్లు, రాష్ట్రాలకు 3వ విడత పన్ను నిధులను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది.

Kothakota Dayakar Reddy Passes Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత.. దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

Rudra

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.

TSPSC Group 1 Exam: గ్రూప్ 1 పరీక్ష విషయంలో సుచిత్ర అనే నిజామాబాద్ యువతి సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన TSPSC

kanha

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష విషయంలో నిందలు అవాస్తవం, క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ జక్కుల సుచిత్ర అనే నిజామాబాద్ యువతి చేస్తున్న దుష్ప్రచారం కమిషన్ నోటీసుకు వచ్చింది. ఆమెతో పాటుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై సీరియస్ అయిన టీఎస్పీఎస్సీ కమిషన్ స్టేట్మెంట్ రూపంలో క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Suryapet Shocker: తాగుబోతు కొడుకు పెట్టే హింసలు తట్టుకోలేక.. కన్నకొడుకుని కత్తితో నరికి చంపిన తండ్రి, సూర్యాపేటలో దారుణ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

మ‌ద్యానికి బానిస‌గా మారిన కుమారుడి ఆగ‌డాలు భ‌రించ‌లేక‌ కన్నతండ్రి త్తితో న‌రికి చంపాడు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Dog Attack in Kamareddy: బాలుడి పొట్టను చీల్చేసిన వీధి కుక్కలు, కామారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడి, చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి..

Hazarath Reddy

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ముదెల్లి గ్రామంలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగంలో దాడి చేసి బాలుడిని వీధి కుక్కలు లాక్కెళ్లాయి.

Minister Malla Reddy Dance Video: వీడియో ఇదిగో, డీజే టిల్లు పాటకి డాన్స్ వేసిన మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు

Hazarath Reddy

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హుషారుగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకి మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు డాన్స్ వేసి అలరించారు. వీడియో ఇదిగో..

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు, రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్న బిపర్జోయ్ తుపాను

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది.

Advertisement

Telangana Schools Reopen: తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు, పిల్లలను బడికి పంపేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు, వేసవి తీవ్రత కొనసాగడమే కారణం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ బడులు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. గత విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 22వ తేదీతో ముగియగా అప్పటి నుంచి సెలవులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని రకాల గురుకులాలు కలిపి దాదాపు 41 వేల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.

BRS MLC Kaushik Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు.. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Rudra

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది.

Tiger Eats Grass: మహారాష్ట్ర యావత్వాల్ అడవుల్లో గడ్డి తిన్న రెండు పులులు.. అదురైన దృశ్యాన్ని ఫొటో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.. ఆహారం అరగకపోతే పులులు గడ్డి తింటాయంటున్న నిపుణులు

Rudra

ఎంత కరువొచ్చినా పులి గడ్డి మేయదని సామెత. అయితే, ఇప్పుడు దాన్ని తిరగరాయాల్సిన పరిస్థితి. అవును. పులి క్రూర జంతువు, మాంసాహారి అని అందరికీ తెలుసు. ఐతే, అలాంటి పులి గడ్డి తింటోందంటే మీరేమంటారు?

Female Constable Saves Woman: రైలు కిందపడబోయిన ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్.. మణుగూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలు వరంగల్‌లో ఆగుతున్న సమయంలో ఘటన

Rudra

కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదంలో కిందపడ్డ ఓ ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్( నెంబర్ 12746) శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత..

Advertisement

TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన

Rudra

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

Minister KTR: ప్రజల భాగస్వామ్యంతోనే సుపరిపాలన సాధ్యం, ఎంతపనిచేసినా మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు దక్కవు, హైదరాబాద్ జనాభా కోటీ 25 లక్షలు దాటిందన్న కేటీఆర్

VNS

తెలంగాణ రాష్ట్రం 9 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ద‌శాబ్ది ఉత్స‌వాల్లో ఇవాళ సుప‌రిపాల‌న దినోత్స‌వం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుప‌రిపాల‌న అందిస్తున్నాం. గ‌తంలో 10 జిల్లాలు ఉండేవి. స్వ‌రాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, మండ‌లాలు, గ్రామ‌పంచాయ‌తీలు ఏర్పాటు చేసుకున్నాం.

Satyavati Rathod Tattooed KCR Name: కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసీఆర్‌ పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి, ఇప్పటికే కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్న సత్యవతి

VNS

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌న‌కున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ (Minister Satyavati Rathore) చాటుకున్నారు. త‌న చేతిపై కేసీఆర్ పేరును ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు (Satyavati Rathod Tattooed KCR Name) స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీం స‌హ‌చ‌రుని వారసుల‌తో మంత్రి స‌త్య‌వ‌తి ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు, పని టెన్సన్ తట్టుకోలేక మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య, భర్తతో గొడవపడి ఎయిర్‌పోర్ట్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇల్లాలు

Hazarath Reddy

కొండాపూర్ పరిధిలో మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిగా.. మరో ఘటనలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

Advertisement
Advertisement