తెలంగాణ
SI Couple Commits Suicide: కంటతడి పెట్టిస్తున్న కొడుకు లేఖ, జనగాంలో ఎస్ఐ దంపతుల ఆత్మహత్య, ఇద్దరూ బాత్‌రూంలోనే సూసైడ్..
Hazarath Reddyతెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జనగామలో ఎస్సై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత ఎస్ఐ భార్య స్వరూప ఉరివేసుకొని చనిపోగా.. గంటల వ్యవధిలోనే ఎస్సై శ్రీనివాస్‌ కూడా బాత్ రూంలో తన సర్వీస్‌ రివాల్వర్‌లో కాల్చుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Orange Alert to Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం, హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో‌ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
Telangana Govt Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త, గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతూ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
Stone Pelting on Vande Bharat: మూడోసారి వందే భారత్ రైలుపై రాళ్ల దాడి, పగిలిపోయిన C8 కోచ్ అద్దాలు, విశాఖ నుంచి ఆలస్యంగా బయలుదేరిన రైలు
Hazarath Reddyభారత రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. జైల్లో పెడతామని హెచ్చిరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి (Stone Pelting on Vande Bharat) జరిగింది. బుధవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌పై (Vande Bharat Express) అగంతకులు రాళ్లదాడి చేశారు.
Telangana: పసికందు ప్రాణాలు కాపాడిన సీపీఆర్, 23 రోజుల చిన్నారికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బంది, సిద్దిపేటలో అరుదైన ఘటన
VNSఇటీవల పెరిగిన పోయిన గుండెపోటు మరణాలతో సీపీఆర్‌పై (CPR) ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుంటున్నారు. అకస్మాత్తుగా పడిపోయినవారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు తరచూ చెప్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే అదే సీపీఆర్ 23 రోజుల చిన్నారి ప్రాణాలను కాపాడింది. సిద్దిపేట (Siddipet)జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది.
Traffic Diversions In Hyderabad: ఇవాళ బయటకు వెళ్తున్నారా? హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు, నగరవాసులకు పోలీసుల సూచనలు
VNSహనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో భారీ శోభాయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర సవ్యంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. రంజాన్ మాసం కూడా నడుస్తుండటంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
SSC Paper Leak Case: బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్, చొక్కా విప్పి తన ఒంటిపై గాయాలను చూపించిన బీజేపీ ఎంపీ, టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా సంజయ్
Hazarath Reddyతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మెజిస్ట్రేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. బండి సంజయ్‌ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది.
Class 10 Paper Leak Case: బండి సంజయ్ ఫోన్లో కీలక వివరాలు, ఫోన్ ఇవ్వని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రిమాండ్‌ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు, కేసు వివరాలను వెల్లడించిన వరంగల్ సీపీ రంగనాథ్‌
Hazarath Reddyకమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాల నుంచి పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన.. కేసు వివరాలను వెల్లడించారు.
Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్
Hazarath Reddyఒక పక్కన ఎండాకాలం అని ఎండలు మండిపోతున్నాయి. మరో పక్కన సడెన్ గా తుఫానులంటూ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే తుఫానుతో మండే ఎండల్లో భీభత్సమైన వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లో ఎండ ఎక్కువగానే ఉంది.
Hyderabad: పంజాగుట్ట స్పా సెంటర్‌లో 20 మంది యువతులతో వ్యభిచారం, మాటు వేసి పట్టుకున్న పోలీసులు, నిర్వాహకులతో పాటు, విటులు అరెస్ట్
Hazarath Reddyపంజగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు, విటులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1 నవీన్‌నగర్‌లో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
Bandi Sanjay Arrest Row: ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు, విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ముందస్తు చర్యగా అరెస్టు చేశామని తెలిపిన పోలీసులు, హైకోర్టులో రేపు విచారణకు పిటిషన్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ లీగల్‌ సెల్‌ ఉన్నత న్యాయస్థానంలో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.
Class 10 Paper Leak: బీజేపీ కుట్రలో భాగమే ప‌దోత‌ర‌గ‌తి పేప‌ర్‌ లీక్‌, మండిపడిన బీఆర్ఎస్ నేతలు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్
Hazarath Reddyప‌దోత‌ర‌గ‌తి పేప‌ర్‌ లీక్‌ (Paper Leak) వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్ట్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ (Telangana BKP)పిలుపునిచ్చింది. కాగా ఈ వ్యవమారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
Class 10 Paper Leak: బండి సంజయ్ అరెస్ట్, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్, పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమంటూ ట్వీట్
Hazarath Reddyపదో తరగతి పేపర్‌ లీక్‌ వ్యవహారంలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Class 10 Paper Leak: బండి సంజయ్‌పై కుట్ర కేసు నమోదు, భువనగిరి కోర్టుకు తరలింపు, ఈటెల, రఘునందన్ రావు అరెస్ట్
Hazarath Reddyటెన్త్ పేపర్ లీకేజీ (Tenth pPaper Leakage) తెలంగాణలో ప్రకంపణలు రేపుతోంది. ఈ కేసులో బండి సంజయ్‌ (Bandi Sanjay)ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) బీజేపీ కార్యాలయానికి వస్తుండగా హకీంపేటలో పోలీసులు అరెస్టు చేశారు.
Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం వీడియో ఇదిగో, ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం, 2,500 మందికి ఆహ్వానం
Hazarath Reddyతెలంగాణ నూతన సచివాలయంను ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది.
Weather Forecast: బయటకు వస్తే మాడిపోవాల్సిందే, హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు, బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
Hazarath Reddyతెలంగాణలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సూర్యభగవానుడు చెలరేగిపోతున్నాడు. నగరంలోని బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఖైరతాబాద్‌లో 40.1, శేరిలింగంపల్లిలో 39.9, షేక్‌పేటలో 38.9, మియాపూర్‌లో 38.7, సరూర్‌నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Bandi Sanjay Arrest: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో అర్ధరాత్రి హైడ్రామా! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, తన అత్త కర్మకోసం వస్తే అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళన, సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకమాండ్
VNSఅర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
Telangana Shocker: పెళ్ళి రోజు మందు తాగవద్దన్న భార్య, కోపంతో పురుగులు మందు తాగిన భర్త, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyహైదరాబాద్‌లో పెళ్లిరోజున మద్యం తాగవద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది.
Telangana Shocker: మూడు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyమూడు నెలల చిన్నారిని చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో చోటుచేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అశోక్, అంకిత, చిన్నారిగా పోలీసులు గుర్తించారు.
Telangana: సిద్దిపేట అదనపు కలెక్టర్‌పై కుక్కల దాడి, వాకింగ్‌ చేస్తున్న సమయంలో పిక్కలను పట్టేసుకున్న వీధి కుక్కలు, కలెక్టర్‌ పెంపుడు కుక్కపైనా దాడి
Hazarath Reddyతెలంగాణలో కుక్కల బెడద తగ్గడం లేదు. తాజాగా సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్కల బారిన పడ్డాడు. సిద్ధిపేట కలెక్టర్‌ క్వార్టర్స్‌ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోలేదు.