తెలంగాణ
Road Accident: హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తూ.. దెందులూరు వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు.. గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Rudraహైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు.
Stray Dogs In Siddipet: సిద్దిపేటలో వీధి కుక్క హల్ చల్.. అదనపు కలెక్టర్‌ పై పడి రక్కిన శునకం.. తీవ్ర గాయాలు.. దవాఖానలో చేరిక
Rudraసిద్దిపేట కలెక్టరేట్‌ ప్రాంతంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి.
RBI Repo Rate Hike: మరో వడ్డనకు ఆర్బీఐ సిద్ధం.. వడ్డీ రేట్లు మళ్లీ పెంచే ఛాన్స్‌.. ఆందోళనలో సామాన్యులు.. తొమ్మిది నెలల వ్యవధిలో ఇప్పటికే, 2.50 శాతం పెరిగిన వడ్డీ రేటు
Rudraద్రవ్యోల్బణం పేరిట ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌ మరో సారి అదే దారిలో సాగనున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది. తాజా భేటీలో మరో 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
Thanks Giving Assembly: నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతీయ మేధావుల ధన్యవాద సభ.. గ్రామోదయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఢిల్లీ వసంత్‌ నేతృత్వంలో అట్టహాసంగా కార్యక్రమం
Rudraహైదరాబాద్‌ లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అమోఘమని ప్రబుద్ధ భారత్‌ ఇంటర్నేషనల్‌, సమతాదళ్‌, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్‌ ఫోరం కొనియాడాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసేందుకు నేడు రవీంద్రభారతిలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించాయి.
SSC Exam Paper Leak: టెన్త్‌ పరీక్షలు వాయిదా వార్తలపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ, పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడి, లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు
Hazarath Reddyతాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ (SSC Exam Paper Leak) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ అంశంగా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్‌ వాట్సాప్‌లో ప్రత్యక్షమై సంచలనం రేపిన సంగతి విదితమే.
10th Class Paper Leak Row: తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్, ఆ ఫోటోలు తీసింది ఇన్విజిలేటరే, పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyతెలంగాణలో సోమవారం నుంచి టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్‌ తాండూరులో వాట్సాప్ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.
SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు
Rudraతెలంగాణలో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు.
Telangana Shocker: తెలంగాణలో షాకింగ్, 13 సంవత్సరాల బాలిక గుండెపోటుతో మృతి..అసలు ఏం జరుగుతోంది..
kanhaమహబూబాబాద్ మరిపెడ మండలంలో శుక్రవారం (13 ఏళ్లు) ఓ యువతి గుండెపోటుతో మృతి చెందింది. 6వ తరగతి చదువుతున్న బోడ స్రవంతికి గురువారం రాత్రి తీవ్రంగా చాతీ నొప్పితో, శ్వాస సమస్యలను ఎదుర్కొంది. దీంతో ఆస్పత్రికి తరలించేలోపే కుప్పకూలి చనిపోయింది.
TSRTC Buses For IPL: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు.. ప్రతీ రెండు, మూడు నిమిషాలకు ఓ మెట్రో రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు
Rudraనగరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియం చేరుకుంటున్నారు.
Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి
Rudraటాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు.
CM KCR Meet Maha Farmers: మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు, ఇంతమంది ప్రధానుల పాలనలో దేశం తలరాత మారలేదు, రైతుల పోరాటం న్యాయమైనదన్న సీఎం కేసీఆర్
VNSదేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దామ‌ని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్(CM KCR) పిలుపునిచ్చారు. 14 మంది ప్ర‌ధానులు మారినా దేశ ప్ర‌జ‌ల త‌ల‌రాత మాత్రం మార‌లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ (sharad joshi praneeth) తో పాటు పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లో చేరారు.
Telangana Rains: తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు వానలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలకు అవకాశం.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
Rudraఅటు ఎండలు, ఇటు వానలతో తెలంగాణలో వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎంత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలుకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం కురవనుంది.
Screening At Shamshabad Airport: దేశంలో వరుసగా రెండో రోజు 3 వేల మార్కును చేరిన కొత్త కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనే 700 కేసుల నమోదు.. శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు.. అనుమానిత ప్రయాణికులకు పరీక్షలు
Rudraపెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పదుల సంఖ్యలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ వేలల్లోకి చేరాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
LPG Cylinder Rates: 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వంట గ్యాస్‌ ధర.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.91.50 తగ్గింపు.. కొత్త ధరలు ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే??
Rudra2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలపై గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించి తగ్గించింది. ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ ధరలు రూ.91.50 తగ్గించింది.
Heart Attack: తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపిన 13 ఏళ్ల బాలిక.. మంచంపై కూర్చుని అలాగే ఒరిగిపోయి మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. బాలిక ప్రాణం తీసిన గుండెపోటు
Rudraడ్యాన్సు చేస్తుండగా కొందరు, ఆడుకుంటూ కొందరు, జిమ్‌లో వ్యాయామం చేస్తూ మరికొందరు ఇలా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న యువకులు కోకొల్లలుగా మారారు.
Toll Charges Rise: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులపై నేటి నుంచి ‘టోల్’ భారం.. అమల్లోకి కొత్త చార్జీలు.. టోల్ చార్జీలను ఐదు శాతం పెంచిన కేంద్రం.. గరుడ ప్లస్ నుంచి ఆర్డినరీ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ. 4 పెంపు.. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున పెంపు
Rudraఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సామాన్యులకు పిడుగు లాంటి వార్తా. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన నేటి నుంచి అదనపు భారం పడనుంది. ఇటీవల కేంద్రం పెంచిన ఐదుశాతం టోల్ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచే ఇది అమల్లోకి రానుండడంతో ప్రయాణికులు అదనంగా చెల్లించుకోక తప్పదు.
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో యూజర్లకు బ్యాడ్‌ న్యూస్, ఇకపై డిస్కౌంట్లు ఉండవు, కేవలం 6 గంటల పాటు మాత్రమే స్పెషల్ ఆఫర్
VNSహైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. మెట్రో రైల్ చార్జీలలో కార్డు, క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టి మెట్రో ఉపసంహరించింది. రోజులో ఆరు గంటలు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు.. సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే పది శాతం రాయితీ ఉంటుందని తెలిపింది.
Telangana: తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు బావిలో దూకిన అన్నదమ్ములు, ఈత రాకపోవడంతో నీటమునిగి అన్న మృతి, మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
VNSపొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములను తేనెటీగల (Honey bees) రూపంలో మృత్యువు వెంటాండింది. తేనెటీగలను తప్పించుకునేందుకు పారిపోతూ...బావిలో దూకిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో (Mahaboobabad district) జరిగింది.
Hyderabad Shocker: ఉద్యోగ భద్రతపై ఆందోళన, హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్
Hazarath Reddyహైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ పని ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధి అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
IPS Officer VC Sajjanar: అమితాబ్ జీ.. ప్రాడ్ కంపెనీలకు ప్రచారం చేయొద్దు, బాలీవుడ్ బిగ్ బి‌కు రిక్వెస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్..
Hazarath Reddyసీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అమితాబ్‌కు ప్రాడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయ్యొద్దని అమితాబ్‌కు విజ్ఞప్తి చేశాడు