తెలంగాణ

Tirumala Tirupati: వరుస సెలవులతో తిరుమల కొండపై భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శనానికి 30 గంటలుపైనే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారే రావాలని టీటీడీ విజ్ఞప్తి

Rudra

గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్ డే, సండే ఇలా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.

Corona Virus: కరోనా కారణంగా గుండెపోటు ముప్పుతో పాటు ఇంకా ఎన్నో జబ్బులు.. వైద్య నిపుణుల హెచ్చరిక

Rudra

కరోనా కలకలం మళ్ళీ తీవ్రమవుతున్నది. దేశంలో కరోనా క్రమంగా తీవ్రమవుతున్నది. యాక్టివ్‌ కేసులు 31 వేలు దాటాయి. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు పలు కీలక అంశాలు చెబుతున్నారు. పదే పదే కొవిడ్‌ బారిన పడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని, గుండె, ఊపిరితిత్తులపై దాని ప్రభావం అధికంగా ఉంటున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

IMD Weather Updates: రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పైపైకి.. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పది రాష్ట్రాల్లో వడగాల్పులు.. ఐఎండీ అంచనా

Rudra

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

PM Modi Telangana Visit: వందే భారత్ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతదో అక్కడకి పోయి జెండా ఊపు..ప్రధాని మోదీపై తలసాని ఘాటు విమర్శలు..

kanha

వందే భారత్‌ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు.

Advertisement

Ambedkar Jayanthi 2023: ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంతా సిద్ధం

kanha

125 అడుగుల డాక్టర్ బి.ఆర్‌ అంబేద్కర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది.

PM Modi In Hyderabad: మోడీ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియా ఫై పోలీసులు జులుం

kanha

మోదీ పర్యటన కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై చేయి చేసుకున్న ఏసీపీ రమేష్. మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ..

PM Modi In Hyderabad: కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు.. కుటుంబ అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా : మోడీ

kanha

తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi Hyderabad Visit: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ .. భాగ్యనగరంలో 2 గంటలు గడుపనున్న పీఎం.. షెడ్యూల్ ఇదే..

Rudra

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు? అభివృద్ధి ముచ్చట్లకే పరిమితమవుతారా? రాజకీయ విమర్శలు ఎక్కుపెడతారా? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

Good News For Malls: రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ .. ఉద్యోగులు షిఫ్ట్‌కు మించి పనిచేస్తే అదనపు వేతనం.. రోజంతా తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాలని జీవో

Rudra

వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వాటిని వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోను కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ రాణి కుముదిని ఇటీవల జారీ చేశారు.

Vande Bharat Train Charges: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ట్రైన్లో చార్జీలు ఎంతో తెలుసా? వివరాలు విడుదల చేసిన రైల్వే

VNS

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ రేటును రూ.3080లుగా ఫిక్స్ చేశారు. అదే మాదిరిగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1625 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030 అని తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి టికెట్‌ ధరలను పరిశీలిస్తే బేస్‌ ఫేర్‌ రూ.1168గా నిర్ణయించారు.

TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ కేసులో మరో రెండు అరెస్టులు, డీఏవో పేపర్ కొనుగోలు చేసిన దంపతులు అరెస్ట్, క్వశ్చన్ పేపర్ ఎంతకు కొన్నారంటే?

VNS

టీఎస్‌పీఎస్సీ (TSPSC Leak) ప్రశ్నప‌త్రాల లీకేజీ ద‌ర్యాప్తులో సిట్ మ‌రో కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టింది. ప్రశ్నప‌త్రాల లీకేజీలో కీల‌క నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో పేప‌ర్‌ను (DAO Paper Leak) కొనుగోలు చేసిన దంప‌తుల‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మంలో కార్ల వ్యాపారం నిర్వహించే సాయిలౌకిక్‌, సుష్మిత దంపతులు. సుష్మిత హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప‌ని చేస్తోంది.

Modi Hyderabad Tour: ఈ సారి కూడా మోదీ టూర్‌కు కేసీఆర్ దూరం, మరోసారి తెరమీదకు ప్రోటోకాల్ వివాదాన్ని తీసుకువచ్చిన బీజేపీ

VNS

సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ను పాటించలేదని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపించారు. కానీ, ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం పీఎంవో ఆహ్వానం పంపినా.. ఏ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.

Advertisement

Telangana Cricketer Dies: బౌలింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి, తెలంగాణలో విషాదకర ఘటన

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో(Cricket Tournament) క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్‌(Heart attack)తో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మరణించాడు.

Ranga Marthaanda: ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Rudra

ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ'. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

Bandi Sanjay: బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించిన బండి సంజయ్, ఎస్‌ఎస్‌సి పేపర్ లీక్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Hazarath Reddy

ఎస్‌ఎస్‌సి పేపర్ లీక్ కేసులో కరీంనగర్ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు & ఎంపీ బండి సంజయ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

Hyderabad Traffic Restrictions: రేపు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన... ఆయా మార్గాల్లో రోడ్లను మూసివేస్తున్నట్టు పోలీసుల ప్రకటన

Rudra

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Bandi Sanjay Released From Jail: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. లీకేజీ కేసుకు తనకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రేపటి మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు

Rudra

పదో తరగతి పరీక్ష లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పై ఈ ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. సంజయ్‌ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్‌ విధించారు. సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

Modi Hyderabad Visit: రేపు భాగ్యనగరానికి ప్రధాని మోదీ.. ధర్నాలతో స్వాగతం పలకనున్న బీఆర్ఎస్.. ఈమేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ పిలుపు.. ఫోన్ లో మాట్లాడి దిశా నిర్దేశం

Rudra

ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగరానికి రానున్న వేళ రాజకీయం రసకందాయంలో పడినట్టు కనిపిస్తున్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాన మంత్రి మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అయితే,

Bandi Sanjay Bail: బండి సంజయ్‌కు బెయిల్..రూ.20 వేల పూచీకత్తు బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ

kanha

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తులో బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది.

SSC Paper Leak Case: టెన్త్ పేప‌ర్ లీకేజీ కేసు, ఈటెలకు నోటీసులు జారీ, ఈ నెల 11న వ‌రంగ‌ల్ డీసీపీ ఆఫీసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలో సంచలనం రేపిన టెన్త్ పేప‌ర్ లీకేజీ( tenth Paper Leak ) కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌( Etala Rajender )కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ డీసీపీ ఆఫీసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు

Advertisement
Advertisement