తెలంగాణ

Corona in TS: తెలంగాణలో తాజా కరోనా కేసులు అప్‌డేట్ ఇదిగో.., హైదరాబాదులో అత్యధికంగా 277 కొత్త కేసులు, గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 640 మందికి కరోనా

Hazarath Reddy

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 31265 కరోనా పరీక్షలు నిర్వహించగా, 640 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 277 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 50, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45, ఖమ్మం జిల్లాలో 32, పెద్దపల్లి జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి.

Telangana Rice Procurement: తెలంగాణ బియ్యం సేకరణను నిలిపివేసిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలే కారణమంటున్న FCI

Hazarath Reddy

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాల కారణంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ బియ్యం సేకరణను నిలిపివేసింది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరే కారణమని FCI తెలిపింది.

Girl Dancing in Hyd Metro: వైరల్ వీడియో.. హైద‌రాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, కేసు నమోదు

Hazarath Reddy

హైద‌రాబాద్‌లోని ఓ మెట్రో స్టేష‌న్‌లో ఓ యువతి డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ట్రెడిష‌న‌ల్ డ్ర‌స్ ధ‌రించిన ఆ యువ‌తి.. రా.. రా.. అనే పాట‌కు స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో స్టెప్పులేయ‌గా, మ‌రో పాట‌కు ఏకంగా క‌దులుతున్న రైల్లోనే మాస్ స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించింది.

Aligireddy Joins Congress: టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

TSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ, లగేజీ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు, యూనిట్‌కి ఎంత పెరిగాయో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. దాదాపు 20 ఏళ్లపాటు స్థిరంగా ఉన్న లగేజీ చార్జీలను ఒక్కసారిగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి.

Corona in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, గత 24 గంటల్లో 658 మందికి కరోనా, హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 30,552 కరోనా పరీక్షలు నిర్వహించగా, 658 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, ఖమ్మం జిల్లాలో 30, పెద్దపల్లి జిల్లాలో 25, నల్గొండ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

Telangana: పోలవరంతో భద్రాచ‌లానికి పెను ముప్పు, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాలని డిమాండ్

Hazarath Reddy

తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ (telangana minister puvvada ajay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌న్నారు.

Polavaram Project Row: ఏపీ ఆదాయం తగ్గింది..ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా? తెలంగాణ మంత్రి పువ్వాడ పోలవ‌రం ప్రాజెక్టు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి బొత్స

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో (Polavaram Project Row) భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ స్ప‌ష్టం చేసిన సంగతి విదితమే. దీనిపై ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ (AP Minister botsa satyanarayana) స్పందించారు. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.

Advertisement

MP Dharmapuri Arvind: కేసీఆర్‌ మానసిక పరిస్థితి దిగజారుతోంది, ఇకపై పరుష పదజాలంతో ఆయనను విమర్శించను, రాజకీయంగా, సాంకేతికంగానే సీఎంను విమర్శిస్తానని తెలిపిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

Hazarath Reddy

గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 540 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 272 కొత్త కేసులు, ఇంకా 4,481 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,585 శాంపిల్స్ పరీక్షించగా, 540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 603 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అత్యధికంగా హైదరాబాదులో 272 కొత్త కేసులు నమోదయ్యాయి.

Presidential Election 2022: ఎమ్మెల్యే సీతక్క ఓటుపైనే అందరి చర్చ, పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశానని వెల్లడి

Hazarath Reddy

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Congress MLA Seethakka) విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha)కు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూ(Murmu)కు వేశారు.

Telangana Road Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో, 5గురు అక్కడికక్కడే మృతి, ఆటోను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు

Hazarath Reddy

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Telangana Road Accident) సంభవించింది. మద్నూర్‌ మండల సమీపంలోని మేనూర్‌ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక.. తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్‌కు దూరంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 117 మంది ఎమ్మెల్యేలు

Hazarath Reddy

టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి ( Balakrishna, Butchaiah Chowdary) తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది.

Weather Forecast: ఇంకా వీడని వర్షాల ముప్పు, తెలంగాణలో నేడు రేపు వర్షాలు, శాంతించిన గోదావరి,  వరద బాధిత జిల్లాల్లో 24 గంటలూ వైద్యసేవలు చేపట్టిన వైద్యాధికారులు

Hazarath Reddy

తెలంగాణను ఇంకా వర్షాల ముప్పు (Weather Update) వీడడం లేదు. నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని (Moderate rainfall in next two days) వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమి ఉపరితలంపైకి వచ్చింది.

what is Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటీ? ఎలా జరుగుతుంది? క్లౌడ్ బరస్ట్ చేయడం నిజంగా సాధ్యమయ్యే పనేనా? తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ కు ఆ దేశమే కారణమా?

Naresh. VNS

సాధారణంగా రుతు పవనాలు వచ్చేముందు ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఘటనలకు అవకాశం లేదు. కానీ కృత్రిమంగా క్లౌడ్‌ బరస్ట్‌ చేయాలని చూస్తే మాత్రం కచ్చితంగా ఇది సాధ్యమే!

CM KCR Comments On Floods: గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు, తెలంగాణ వరదలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Krishna

తెలంగాణ వరదలసై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు ఉన్నట్లు అనుమానం కల్గుతుందన్నారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Telangana: బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ పై కేసు నమోదు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విద్యార్థులు, విచారణకు ఆదేశం..

Krishna

ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థతకు గురైన త్రిపుల్ ఐటీ బాసర విద్యార్థులు శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, క్షేమంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిన క్యాటరర్లపై కేసు నమోదు చేశారు.

MLC Kavitha: సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి బంగారుబోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్న కవిత, 2 వేలబోనాలతో మెగా ర్యాలీ

Naresh. VNS

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ (Secundrabad ujjain mahankali) అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ నుంచి బంగారు బోనంతో (Bangaru bonam) మహంకాళి ఆలయానికి చేరుకున్నారు కవిత. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Hyderabad Shocker: ఔటర్ రింగు రోడ్డుపై కాల్పుల కలకలం, లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన దుండగులు, ఉలిక్కి పడ్డ పోలీసులు, విచారణ ప్రారంభం..

Krishna

తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వద్ద గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. జార్ఖండ్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి ఐరన్ లోడ్ చేసిన లారీతో హత్నూరా మెదక్, చందాపుర నుంచి కేరళలోని కొచ్చి వెళ్తున్నాడు.

Telangana CM KCR : భద్రాచలం సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే, సహాయ చర్యలు ముమ్మరం చేయమని ఆదేశం, శాంతించిన ఉగ్ర గోదావరి..

Krishna

వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

Advertisement
Advertisement