తెలంగాణ
Minister KTR Davos Tour: తెలంగాణలో రూ.1000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న స్టాడ్‌లర్‌, రైలు కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులు
Hazarath Reddyరైల్‌ కోచ్‌ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్‌లర్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఈవీపీ ఆన్స్‌గర్‌ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో చర్చలు జరిపారు.
Rajya Sabha Polls 2022: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు, ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు నామినేషన్‌ దాఖలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha Polls 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.అలాగే తెలంగాణ నుంచి రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి (TRS Candidates) నామినేషన్‌ దాఖలు చేశారు.
Sex Racket Busted in HYD: హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, స్పా ముసుగులో వ్యభిచారం, నిందితులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్‌ పోలీసులు
Hazarath Reddyభాగ్యనగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఎస్‌ఓటీ పోలీసులు (Hyderabad Police ) దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
CM Jagan Davos Tour: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది, ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌
Hazarath Reddyదావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Telangana: తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీకారం తెలిపిన స్విస్ రే కంపెనీ, కేటీఆర్‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చర్చ
Hazarath Reddy160 ఏండ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఆ కంపెనీ ప్ర‌తినిధులు కేటీఆర్‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ ఆగ‌స్టులో హైద‌రాబాద్‌లో స్విస్ రే కంపెనీ త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నుంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Telangana: లంచం అడిగిన డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Hazarath Reddyహైద‌రాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఆసుపత్రిలోని ఓ వైద్యుడి లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు... వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు.
KCR In Punjab: రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్! ప్రాణం పోయినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టం, పంజాబ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన, గాల్వాన్ అమరులు, రైతు ఆందోళనల్లో మరణించినవారి కుటుంబాలకు ఆర్ధికసాయం
Naresh. VNSరైతుల‌కు ఫ్రెండ్లీగా ఉన్న ప్ర‌భుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వానికి అస్స‌లు గిట్ట‌నే గిట్ట‌ద‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు మండిప‌డ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని చూస్తుంద‌ని విమ‌ర్శించారు. కేంద్రం అనుస‌రిస్తున్న రైతు విధానాల‌కు వ్య‌తిరేకంగా దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు.
CM KCR In Chandigarh Today: నేడు చండీగఢ్ లో పర్యటించనున్న సీఎం కేసీఆర్, 600 రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం,
Krishnaఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ చండీగఢ్ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేసిన ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించున్నారు.
Telangana SSC Exams: రేపటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం, హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
Krishnaరెండేండ్ల విరామం తర్వాత ఇప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. 11,401 పాఠశాలలకు చెందిన 5.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
CM KCR Delhi Tour:త్వరలోనే సంచలనం జరుగబోతోంది! ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్, కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలో స్కూల్, హాస్పటల్ సందర్శించిన కేసీఆర్
Naresh. VNSవిద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని సీఎం కేసీఆర్‌ (CM KCR)అన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో(Kejriwal) కలిసి కేసీఆర్‌ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) ఘన స్వాగతం పలికారు.
Begum Bazar Honor Killing : బేగంబజార్ పరువు హత్య నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, కర్ణాటకలో చిక్కిన నిందితులు, నేడు బేగంబజార్ లో స్వచ్ఛందంగా బంద్...
Krishnaబేగంబజార్‌ పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజన బాబాయి కుమారులు స్నేహితులతో కలిసి నీరజ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య తర్వాత కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. కర్ణాటకలోని గుర్‌మిత్కల్‌లో నిందితులను పట్టుకున్నారు.
BA.4 Omicron Variant: హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ ఉప వేరియెంట్‌ బీఏ.4 కలకలం, ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదు అయిందని తెలిపిన INSACOG
Hazarath Reddyభారత్‌లో తొలి ఒమిక్రాన్‌ ఉప వేరియెంట్‌ బీఏ.4 కేసు తెలంగాణలో హైదరాబాద్‌లో నమోదు అయ్యింది. ఈ మేరకు ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ ( INSACOG) ధృవీకరించింది. కోవిడ్-19 జెనోమిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.
Andhra Pradesh Shocker: గుంటూరులో బాలికపై ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారం, లాడ్జికి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన కామాంధులు
Hazarath Reddyగుంటూరు శివారులోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు శివార్లలోని ఓ లాడ్జిలో బుధవారం ఇద్దరు విద్యార్థులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Telangana Police Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్, పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
Telangana Shocker: చెల్లెలిపై అదేపనిగా అత్యాచారం చేయడమేందిరా కామాంధుడా, కరోనాలో రెండేళ్ల నుంచి సోదరిపై కామవాంఛ తీర్చుకున్న అన్న, బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి..
Hazarath Reddyతెలంగాణలో సభ్యసమాజం తలదించుకునే చోటు చేసుకుంది. మృగంగా మారిన ఓ అన్న సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి (17-Year-Old Boy Rapes) ఒడి గట్టాడు.రెండేండ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకున్నది.
Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంతా బూటకం, సుప్రీంకు నివేదికను సమర్పించిన సిర్పూర్క‌ర్ క‌మిష‌న్, దిశ హత్యాచారం కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు (Disha Encounter Case) చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. 2019 డిసెంబ‌ర్‌లో హైద‌రాబాద్ స‌మీపంలో జ‌రిగిన న‌లుగురి ఎన్‌కౌంట‌ర్‌పై (Disha Accused Encounter Case) ఇవాళ సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది.
CM KCR Nationwide Tour: జాతీయ రాజకీయాలే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్, నేడు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం
Hazarath Reddyజాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ దిశగా తాము కీలకపాత్ర పోషిస్తామని పలుమార్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన ఆయన.. నేటి నుంచి వివిధ రాష్ట్రాల పర్యటనలతో (CM KCR Nationwide Tour) పోరుకు సిద్ధమవుతున్నారు.
Ramaiah Health Condition: అతనితో 100 మొక్కలు నాటించండి, ఎలాంటి కేసులు పెట్టవద్దు, నన్ను ఢీకొట్టిన వాహనదారుడికి అదే శిక్ష అంటున్న వనజీవి రామయ్య, నిలకడగా ఆయన ఆరోగ్యం
Hazarath Reddyతన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు.
Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, తెలంగాణ బిడ్డ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం
Hazarath Reddyప్రతిష్టాత్మక 'ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్' పోటీల్లో నిజామాబాద్ కు చెందిన @Nikhat_Zareen విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌ కు ప్రధాని మోదీ అభినందనలు, దేశం గర్వించేలా అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించావంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణకు చెందిన బాక్సర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మా బాక్సర్లు మమ్మల్ని గర్వించారు! మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించినందుకు @nikhat_zareenకి అభినందనలు అని తెలిపారు.