తెలంగాణ

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేసిన కేంద్రం, నిరసనలతో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, సరిపడా బియ్యం, గోదుమలు నిల్వ ఉన్నాయన్న సర్కారు

Naresh. VNS

: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం కొనలేమని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిలువలు ఉన్నాయని, ఇకపై బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమని, వాటిని నిలువ చేసే పరిస్థితి లేదని చెప్పింది.

AP MPTC ZPTC Elections Result: జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జోరు, టీడీపీ చేజారిన కీలక స్థానాలు, మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ

Krishna

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది.

Siddipet Collector Venkatrami Reddy: సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హై కోర్టులో పిల్ దాఖలు, MLC నామినేషన్ ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్లు...

Krishna

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ రీసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జె శంకర్‌లు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

TRS Maha Dharna: కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అల్టిమేటం, వడ్లు కొంటారా? కొనరా? సూటిగా చెప్పండి, రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తామన్న కేసీఆర్

Naresh. VNS

వడ్ల కొనుగోలుపై కేంద్రంపై యుద్ధానికి దిగారు తెలంగాణ సీఎం కేసీఆర్. మా వడ్డు కొంటారా? కొనరా? చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజ‌మెత్తారు. ఇందిరాపార్క్ వ‌ద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్‌తో పాటూ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Hyderabad: అర్థరాత్రి పోలీస్‌ను లిప్ట్ అడిగిన యువతి, ఇంటికి వచ్చేసరికి పోలీస్ బంగారం చైన్ మాయం, ఎంక్వయిరీ చేస్తే ఆమె యువతి రూపంలో ఉన్న ట్రాన్స్‌జెండర్‌

Hazarath Reddy

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ కానిస్టేబుల్ తన చైన్ పోగొట్టుకున్నాడు. యువతి బైక్ లిఫ్ట్ అడగడంతో మానవత్వంతో ఎక్కించుకున్న కానిస్టేబుల్‌ మెడలోని చైన్‌ను (Transgender snatch gold chain from AR constable) దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Manair River Tragedy: మానేరు వాగులో ఆరుగురు చిన్నారులు జలసమాధి, ఈత రాక, లోతును అంచనా వేయలేక నదిలో మునిగిపోయిన విద్యార్థులు, మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు

Hazarath Reddy

సిరిసిల్ల పట్టణంలో మానేరు వాగు కథ విషాదంగా ముగిసింది. ఆ వాగు ఒకరిద్దరు కాదు... ఏకంగా ఆరుగురిని జలసమాధి (Manair River Tragedy) చేసింది. ఒకే కాలనీకి చెందిన ఆరు కుటుంబాల్లో మానేరు వాగు తీవ్ర విషాదాన్ని(Telangana Tragedy) నింపింది.

Hyderabad: హోండా యాక్టీవాకు ఏకంగా 117 పెండింగ్ చలానాలు, రూ. 29 వేల జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని తెలిపిన అబిడ్స్ పోలీసులు

Hazarath Reddy

ఓ ద్విచక్ర వాహనంపై 117 చలానాలు పెండింగ్‌లో ఉండటం చూసి పోలీసులే నివ్వెరపోయారు. భారీ స్థాయిలో చలాన్లు (Hyderabad man caught with 117 unpaid challans) ఉండడంతో వెబ్‌ పోర్టల్‌ పేజీ కూడా సరిపోలేదు.

Amrabad tiger reserve: అటవీ ప్రేమికులకు బంపర్ ఆఫర్, నల్లమలలో టైగర్ సఫారీ, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, రూ. 4,600కే కపుల్స్‌కు ఎంట్రీ

Naresh. VNS

ఫారెస్ట్ లవర్స్‌కు అటవీశాఖ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. సఫారీ అంటే ఆఫ్రికాలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇప్పటివరకు మనకు ఉన్న అపోహను తొలగిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో టైగర్ సఫారీని అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

MLC Elections in Telangana: తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ సర్కారు, సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు

Hazarath Reddy

తెలంగాణలో స్థానిక సంస్థ‌ల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు (MLC Elections in Telangana) నోటిఫికేష‌న్ వెలువ‌డింది. నేటి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 26. డిసెంబ‌ర్ 10న పోలింగ్, డిసెంబ‌ర్ 14న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

Bandi Sajnjay Nalgonda Tour: సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు, చివ్వెం ఐకేపీ సెంటర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వం వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేత డిమాండ్

Hazarath Reddy

బండి సంజయ్ నల్గండ టూర్ (Bandi Sajnjay Nalgonda Tour) సందర్భంగా సూర్యపేట జిల్లా చివ్వెం ఐకేపీ సెంటర్‌ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐకేపీ సెంటర్‌ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్‌ను స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ( TRS- BJP clash in Nalgonda) అడ్డుకున్నారు. నల్లజండాలతో నిరసనలు తెలిపారు.

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 50 కొత్త కేసులు, రాష్ట్రంలో ఇద్దరి మృతి, ఇంకా 3,735 మందికి చికిత్స

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా, 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14 కేసులు గుర్తించారు.

Siddipet Collector Resigns: సిద్దిపేట కలెక్టర్ రాజీనామా, కాసేపట్లో తెరాస లో చేరిక, ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అవకాశం

Krishna

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు అంద‌జేశారు.

Advertisement

Hyderabad: అమ్మా నన్ను క్షమించు, నా భార్య వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బ్యాంక్ ఉద్యోగి, సెల్ఫీ వీడియోలో అత్త, మామ, భార్యపై ఆరోపణలు

Hazarath Reddy

భాగ్య నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య (Hyderabad Man kills self) చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Rachakonda Traffic Police: వారంలో రూ.కోటిన్నర జరిమానా వసూలు చేసిన రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు, ట్రాఫిక్ ఉల్లంఘనల కింద 40,620 కేసులు నమోదు, హెల్మెట్‌ లేకుండా నడిపిన వారిపై రూ.48,98,900 ఫైన్లు

Hazarath Reddy

ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు (over 40,000 traffic violation cases) కాగా.. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా (Rs 1.8 cr as fines in 7 days) విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు.

Corona in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 208 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 32,630 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 32, గుంటూరు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి.

Corona in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 105 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలోనే 59 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 23,888 కరోనా పరీక్షలు నిర్వహించగా, 105 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 59 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Advertisement

Maoists Killed In Encounter: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ, గడ్చిరోలిలో 26 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్, కీలక నేత మిలింద్ తేల్తుంబ్డే హతం..

Krishna

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధరిరా తాలూకా లోని గ్యారబట్టీ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ కౌంటర్ కొనసాగిందని, ఈ ఘటనలో మొత్తం 26 మంది మావోయిస్టులు చనిపోయారని, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని గడ్చిరోలి జిల్లా ఎస్పీ అకింత్ గోయల్ శనివారం సాయంత్రం మీడియాకు తెలిపారు.

Telangana: పోలీస్ స్టేషన్లోనే.. గిరిజన యువకుడిపై పోలీసులు అమానుష దాడి, ఆత్మకూర్ (ఎస్‌) పీఎస్‌ ఎస్సైపై బదిలీ వేటు, ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని తెలిపిన సూర్యాపేట డీఎస్పీ మోహన్‌ కుమార్‌

Hazarath Reddy

గిరిజన యువకుడు వీరశేఖర్‌ను చితకబాదిన (Alleged Torture of Tribal Youth) ఎస్ఐ ఎం.లింగంపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు చేపట్టారు. ఎస్ఐ లింగంను బదిలీ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ (Suryapet district superintendent of police) ఉత్తర్వులు జారీ చేశారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 153 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

Telangana: బట్టతల ఉన్నా..విగ్గుతో 20 మంది అమ్మాయిల్ని పడేశాడు, వారితో సహజీవనం చేసి డబ్బు, నగలుతో జంప్, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విగ్గు రాజు కార్తీక్‌ వర్మ అలియాస్ షేక్‌ మహ్మద్‌ రఫీ

Hazarath Reddy

బట్టతలను కవర్‌ చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని యువకుడు మోసం చేశాడు. తనకు తాను ఎన్నారైగా చెప్పుకుని ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన మహిళలతో సహజీవనం చేసి.. నగదు, నగలు దోచుకుపోతున్న (Bald Head Man Cheats Twenty Women) ప్రబుద్ధుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Advertisement
Advertisement