తెలంగాణ

Telangana: మలక్‌పేట మెట్రోస్టేషన్‌ కింద బైక్‌లకు నిప్పు పెట్టింది ఇతడే, చాదర్‌ఘాట్‌కు చెందిన జాకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

మూడు రోజుల క్రితం మలక్‌పేట మెట్రోస్టేషన్‌ కింద బైక్‌లకు నిప్పు పెట్టిన వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్ బృందం మరియు చాదర్‌ఘాట్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడిని చాదర్‌ఘాట్‌కు చెందిన జాకర్‌గా గుర్తించారు.

Telangana Shocker: దారుణం, నిద్రిస్తున్న భర్తను రాయితో తలపై కొట్టి హత్య చేసిన భార్య, వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసింది భార్య. మహమ్మద్ ఖాజా అనే వ్యక్తిని ఆయన భార్య హర్షయా ఇంట్లో రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Komati Reddy Venkata Reddy: TRS పార్టీని BRSగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్లకు బంధం తెగిపోయింది, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

TRS పార్టీని BRSగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్లకు బంధం తెగిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదని స్పష్టం చేశారు. ఆనాడేమో మీరు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు తల్లి అని కేసీఆర్ సోనియమ్మ కాళ్ళు మొక్కాడు.

Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడే, తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు, విధించిన రూ.30లక్షల జరిమానా నెలలోపు చెల్లించాలని స్పష్టం

Hazarath Reddy

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు (TS High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

Advertisement

Telangana Assembly Session 2024: ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం.

BRS MLAs Arrest: రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు ఈ నిరసన చెలరేగింది.

Tension at Assembly Gate: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఇదే..! (వీడియో)

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్నారు.

TG Assembly Session Today: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 5 బిల్లులు, 2 నివేదికలు ప్రవేశపెట్టే అవకాశం.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఇవాళే..!

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.

Advertisement

Harish Rao on Six Guarantees: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌స్తారా? మీడియాకు హ‌రీష్ రావు ఇచ్చిన స‌మాధానం ఇదే!

VNS

రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తారో.. రారో.. మీరే చూస్తారన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడుతామన్నారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడుతామని.. ప్రజాసమస్యలపై గళం విప్పుతామన్నారు.

KCR on Telangana Thalli Statue: తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై కేసీఆర్ స్పంద‌న ఇదే! రేవంత్ స‌ర్కారు తీరుపై ఫిబ్ర‌వ‌రిలో భారీ బ‌హిరంగ స‌భ‌

VNS

రైతుబంధు (Raithubandhu) తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు.

KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం

Arun Charagonda

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు.. ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు, ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల ప్రసంగాల్లో చెప్పిన అంశాల్లో ఎంతమేరకు నిజం ఉందనేది ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు కేసీఆర్.

BRS Charge Sheet On Congress: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్, రేవంత్ రెడ్డి పాలన.. రైతు సంక్షేమానికి రాహు కాలం, వ్యవసాయానికి గ్రహణం అని హరీశ్‌ రావు మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు హరీశ్‌. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.

Advertisement

Vikarabad: కూతురు కళ్ల ముందే బావిలో దూకేసిన తల్లి - కొడుకు, వికారాబాద్‌లో విషాదం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేటువనంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురు, కొడుకును పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ అనే మహిళ. కూతురు ఏడవడంతో ఇంటికి పంపించేసి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Medak: మెదక్‌లో ముసుగుదొంగ, 4 రోజులుగా వరుస దొంగతనాలు...పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలు..సీసీటీవీ వీడియో

Arun Charagonda

మెదక్ జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు ముసుగు దొంగ. పాపన్నపేట మండలంలో గత 4 రోజులుగా అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడుతున్నాడు అగంతకుడు. ఇంటి బయట ఏ వస్తువులున్నా ఎత్తుకెళ్తున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

Telangana: మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, వీల్ ఛైర్‌లో ఉన్న మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు..కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని కోడలు..వీడియో ఇదిగో

Arun Charagonda

మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది ఓ కోడలు. నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామ పై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది . కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు కోడలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KCR BRSLP Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ

Rudra

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది.

Advertisement

Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన

Rudra

మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.

CM Revanth Reddy: ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.

Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన

Rudra

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.

Traffic Restrictions At Tankbund: ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఈ వేళ‌ల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం

VNS

వాయుసేన విమానాలు విన్యాసాలు ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement