తెలంగాణ
TGSRTC Renamed As TGTD: టీజీఎస్ఆర్టీసీని టీజీటీడిగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రజాపాలన విజయోత్సవాలు వేడుకల్లో భాగంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం TGSRTCని తెలంగాణ రవాణా శాఖ (TGTD) గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది .
Indiramma Illu Mobile App: ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
Hazarath Reddyతెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు
Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana Shocker: లైంగిక వేధింపులు..కామారెడ్డి జిల్లాలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్య...దుబాయ్‌లో ఉంటున్న మృతురాలి భర్త, స్థానికంగా విషాదం
Arun Charagondaలైంగిక వేధింపులు భరించలేక ఫార్మాసిస్ట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుంది శిరీష (28). బిచ్కుందలో కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది శిరీష. పని చేస్తున్న చోట శిరీషను కొందరు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దుబాయ్ లో ఉంటున్నారు శిరీష భర్త.
CM Revanth Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు వెసులుబాటు కల్పించేలా విధివిధానాలు రూపొందించాం, ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల కేటాయింపు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaతెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
PDSU On Pushpa 2: అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి..పీడీఎస్‌యూ డిమాండ్, పుష్ప 2 సినిమా చూసేందుకు వెళ్లి ఓ మహిళ ప్రాణం పోయింది..సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిక
Arun Charagondaహీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది PDSU. పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణం పోయిందని...అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకుంటే 'పుష్ప 2' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించింది. హైదరాబాద్-RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.
Konda Surekha: తండ్రి ఫాంహౌస్‌లో కొడుకు రోడ్లపై, కేసీఆర్ - కేటీఆర్‌లపై మంత్రి కొండా సురేఖ ఫైర్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని సురేఖ సవాల్
Arun Charagondaఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు అన్నారు మంత్రి కొండా సురేఖ. మీడియాతో మాట్లాడిన సురేఖ...బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారు అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగింది...కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నారు.
Telangana: షాకింగ్... రైలు పట్టాలపై బైకుతో ప్రయాణం..ట్రైన్‌ను ఆపేసిన అధికారులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Arun Charagondaరైల్వే పట్టాలపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట వద్ద షిరిడీ నుంచి తిరుపతి వెళుతున్న రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్యలో ద్విచక్రవాహనంపై రైలుకి ఎదురెళ్లాడు జగదీష్ అనే వ్యక్తి. జగదీష్‌ను పట్టాలపై నుంచి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
Karimnagar Shocker: కరీంనగర్ జిల్లా కశ్మీర్ గడ్డలో దారుణం..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaకరీంనగర్ కశ్మీర్ గడ్డ లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ పై కత్తితో దాడి చేశాడు. అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీకి మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలను ఆపడానికి వెళ్లగా.. అతిఫ్ పై దాడి చేయగా ఎడమచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Harishrao: తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్‌కు నోటీసులు
Arun Charagondaతెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
KTR On Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, ఇదేనా ప్రజా పాలన?..ఇందిరమ్మ రాజ్యం? అంటూ కేటీఆర్ ఫైర్
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు అని ఎద్దేవా చేశారు.
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం..కౌశిక్ ఇంటికి పోలీసులు..వీడియో ఇదిగో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐపై దుర్భాషలాడాడని..ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
SI Suicide Case: ఎస్‌ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు, యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ
Arun Charagondaములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
CM Revanth Reddy: ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేం, ఉద్యోగాల కల్పనపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్
Arun Charagondaఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Pushpa 2: The Rule: పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో కుప్పకూలిన బాలుడు, హైదరాబాద్ సంధ్య ధియేటర్లో ఘటన, పరిస్థితి విషమం
Hazarath Reddyఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట మధ్య ఓ యువకుడు స్పృహ కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తారు.
Burra Venkatesham VRS Approved By Govt: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్, బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం
VNSఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా (TGPSC Chairman) గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అంగరంగ వైభవంగా నాగచైతన్య, శోభిత పెళ్లి, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
VNSటాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు
Hazarath Reddyహైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Harish Rao:పంజాగుట్టలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
Hazarath Reddyహైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు.