తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో మరో రాష్ డ్రైవింగ్ కేసు..మల్లేపల్లిలో హోండా సిటీ కారు బీభత్సం, వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిన వైనం..పలువురికి గాయాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

లంగర్ హౌస్ ఘటన మరవక ముందే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రాష్ డ్రైవింగ్ కేసు నమోదు అయింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి హోండా సిటీ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు.

Google Safety Engineering Centre: తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు..సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ కంపెనీ ప్రతినిధుల చర్చలు సఫలం

Arun Charagonda

తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది గూగుల్‌ కంపెనీ. హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపారు గూగుల్ ప్రతినిధులు. ఆగస్టు 2024లో గూగుల్‌ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy: ఆర్య వైశ్యులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు, హైదరాబాద్‌లో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Arun Charagonda

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందని..వీరంతా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని...రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం అని తేల్చిచెప్పారు.

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

Arun Charagonda

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు..మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అని ఆరోపించారు.

Advertisement

Telangana: దారుణం, కాజీపేటలో వృద్ధుడైన వ్యాపారిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన యువకుడు, రాత్రిపూట షాపు మూసి ఇంటికి వెళుతుండగా దాడి

Hazarath Reddy

కాజీపేట డీజిల్ కాలనీలో సిమెంట్ బ్రిక్స్ వర్క్ షాప్ నిర్వహిస్తున్న వృద్దుడు రాత్రి షాపు మూసి ఇంటికి నడిచి వెళ్తుండగా దాడి చేసిన వసీం అక్రం అనే యువకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాజీపేట పోలీసులు.

Earthquake in Medaram: వీడియో ఇదిగో, భూంకంపం దెబ్బకు వణికిపోయిన మేడారం సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు, గ‌ద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగిన‌ట్లు సీసీకెమెరాల ద్వారా స్ప‌ష్ట‌ం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు వ‌ణికిపోయాయి.

Earthquake in Telugu States: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం, భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.

Patnam Narendra Reddy: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ, క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Arun Charagonda

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు.

Advertisement

Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Hazarath Reddy

అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు

Warangal: వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్, గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిన యువతి..ఎస్‌ఐని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన వైనం!

Arun Charagonda

వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.

Earthquake In Singareni Areas: సింగరేణి ప్రాంతాల్లో భూకంపం..కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు..తనిఖీల తర్వాతే కార్మికులను అనుమతిస్తామన్న సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి

Arun Charagonda

సింగరేణి ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు సింగరేణి జనరల్ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను అనుమతిస్తాం అన్నారు.

Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్‌,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు

Arun Charagonda

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది.

Advertisement

CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

Arun Charagonda

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రూప్-4 విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

Telangana: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు, అనంతరం గోడదూకి పారిపోయిన టీచర్...వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. మంచిర్యాల - ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితక బాదారు తల్లిదండ్రులు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Earthquake In Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భూకంపం, 10 సెకండ్ల పాటు ఊగిన భూమి..ఉలిక్కిపడ్డ ప్రజలు

Arun Charagonda

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్, పట్టుకుని రోడ్డు మీద చెప్పులతో చితకబాదిన పేరెంట్స్

Hazarath Reddy

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడుకి బాధిత కుటంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. గోడ దూకి పారిపోతుండగా ఉపాధ్యాయుడిని పట్టుకుని రోడ్డుపై చెప్పుతో చితకబాదారు పేరెంట్స్. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana Shocker: దారుణం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని భార్యను చంపిన భర్త, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

Hazarath Reddy

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. నాలుగేళ్ల క్రితం వాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు కోదాటి శ్రీను. తన బిడ్డను చంపిన శ్రీను, అతడికి సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు.

Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్‌ వేడుకల్లో సీఎం మాట్లాడారు.భాగ్యనగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు

Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రన్నింగ్‌లో రెండుగా విడిపోయిన గూడ్స్ ట్రైన్

Hazarath Reddy

తెలంగాణలో మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది.

Advertisement
Advertisement