తెలంగాణ
Hyderabad: హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో చెలరేగిన మంటలు..రూ.లక్షల్లో ఆస్తినష్టం..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అనుమానం చేశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం.. కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు.
CM Revanth Reddy: సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బావ- బామ్మర్థులకు మా పవర్ త్వరలో తెలుస్తుంది..పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్
Arun Charagondaసోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి మొనగాళ్ళు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.
Telangana: ఆస్తిలో వాటా కోసం మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్...వీడియో ఇదిగో
Arun Charagondaఆస్తిలో వాటా ఇవ్వాలని మామ పై దాడికి పాల్పడ్డాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైదరాబాద్ - లంగర్‌హౌస్‌కి చెందిన కానిస్టేబుల్ ఎం.డి.షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ మరియు మామ పై దాడికి పాల్పడ్డాడు.
CM Revanth Reddy: వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు , పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్..వీడియో ఇదిగో
Arun Charagondaవేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మధ్యాహ్నం గుడి జాతర గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Telangana: వీడియో ఇదిగో, అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి వైన్ షాప్‌లో చొరబడిన దొంగలు, మద్యం సీసాలతోపాటు, నగదును ఎత్తుకెళ్లారు..
Hazarath Reddyపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఓ వైన్ షాప్ లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి, వైన్ షాప్ లోకి చొరబడి, మద్యం సీసాలతోపాటు, నగదును ఎత్తుకెళ్లారు.వైన్ షాప్ గోడకు రంధ్రం చేసేందుకు సుత్తెను ఉపయోగించి, దాన్ని అక్కడే వదిలి వెళ్లారు.
Hyderabad: బాలుడిపై పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నం, బాలుడు కేకలు వేయడంతో వ్యాపారిని పట్టుకున్న స్థానికులు, అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ కూకట్‌పల్లిలో షాకింగ్ సంఘటన జరిగింది. బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ పండ్ల వ్యాపారి. వివేకానందనగర్‌లో స్థానికంగా పండ్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి బాలుడిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పండ్ల వ్యాపారి బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
CM Revanth Reddy: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్న తెలంగాణ సీఎం
Arun Charagondaఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి. వేములవాడ లో 127 కోట్ల 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4 వేల 696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చెక్కులు పంపిణీ చేయనున్నారు. గుడి చెరువు ప్రాంతంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ లో ప్రసంగించనున్నారు తెలంగాణ సీఎం.
GHMC Demolitions: 50 గజాల్లో ఐదు అంతస్తుల భవనం, అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు, భవనం కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్ణయం..వీడియో
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిద్దిక్ నగర్‌లో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. 50 గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. 60 శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు గుర్తించారు ఇంజనీరింగ్ నిపుణులు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు రాగా అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు.
Telangana: అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ.. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల ప్రశ్న.. స్మశాన వాటికలో ఉన్న అఘోరిని కలిసిన వరంగల్ హిజ్రాలు..వీడియో ఇదిగో
Arun Charagondaఅఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. స్మశాన వాటికలో సేద తీరుతున్నఅఘోరిని కలిశారు వరంగల్ హిజ్రాలు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని, పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని ప్రశ్నించారు హిజ్రాల సంఘం నాయకురాలు. అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా తాను ఏమీ మాట్లాడలేనని చెప్పింది అఘోరి.
Lagacharla Accused Suresh: సంగారెడ్డి సెంట్రల్ జైలుకు సురేష్, కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సెంట్రల్ జైలుకు తరలింపు..వీడియో
Arun Charagondaలగచర్ల కేసులో A2 సురేష్ లొంగిపోవడంతో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. A2 సురేష్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించగా పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఈ కుట్రకి మాస్టర్ ప్లాన్ వేసిన పెద్దల పేర్లు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు.
Harishrao: శాతగానోనికి మాటలెక్కువ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్, రేవంత్ నోట.. బూతులు తప్ప నీతులు రాలేదు అని మండిపాటు
Arun Charagondaవరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు.
Heart Touching Video: హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో.. ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు
Hazarath Reddyఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో 'ఆశ్రయం' కల్పించడం జరిగింది.
CM Revanth Reddy: వరంగల్ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన
Hazarath Reddyతెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.
Revanth Reddy on Sonia Gandhi: వీడియో ఇదిగో, సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువే, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్ (Revanth Reddy) రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ (Warangal)ను అభివృద్ధి చేస్తామన్నారు.సోనియమ్మ మా తల్లి.. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా అది తక్కువేనని రేవంత్ రెడ్డి అన్నారు..
Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
Gold Theft in SBI Bank: వరంగల్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ, 10 కోట్ల బంగారం చోరీ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గల ఎస్‌బీఐ బ్యాంకులో(SBI Bank) భారీ చోరీ(Massive robbery) జరిగింది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. లాకర్‌లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.
Telangana: వీడియో ఇదిగో, గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి, తల్లిని చూడగానే పరిగెత్తుకు వచ్చి తల్లిని చేరకుండానే కుప్పకూలి తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyఖమ్మం జిల్లా ఎమ్ వెంకటాయపాలెం లో గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసి ఇంటికి రాగానే తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లిన చిన్నారి తల్లిని చేరకుండానే ఛాలి నొప్పి అంటూ కుప్పకూలిపడిపోయింది.
Hyderabad: హిందూ దేవాలయంలో నమాజ్ చదివిన ముస్లిం, సోషల్ మీడియాలో వీడియో వైరల్, మండిపడుతున్న నెటిజన్లు..
Hazarath Reddyఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చదివిన ఘటన హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో చోటు చేసుకుంది. అక్కడి ధనలక్ష్మీ నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు.
School Bus Accident: అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు.. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
Rudra40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.