BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలించిన అధికారులు, కవిత ఇంటిముందు హైటెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ (BRS MLC Kavitha Arrest) చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలిస్తున్నారు. మధ్యాహ్నం కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారుల (ED) బృందం.. ఆమెకు నోటీసులు ఇచ్చింది. అనంతరం ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు.
Hyderabad, March 15: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ (BRS MLC Kavitha Arrest) చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలిస్తున్నారు. మధ్యాహ్నం కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారుల (ED) బృందం.. ఆమెకు నోటీసులు ఇచ్చింది. అనంతరం ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సెర్చ్ వారెంట్ తో పాటు ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారన్న సమాచారంతో ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అక్కడ హైటెన్షన్ నెలకొంది.
#WATCH | Earlier visuals of BRS MLC K Kavitha at her residence in Hyderabad, Telangana.
She has been arrested by the Enforcement Directorate (ED) and is being brought to Delhi where she will be further questioned in connection with the Delhi excise policy-linked money… pic.twitter.com/yO1QeUZFgS
— ANI (@ANI) March 15, 2024
బీజేపీ, ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS MLC Kavitha Arrest) నినాదాలు చేశారు. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరిగాయి. కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నించిన్నట్లు సమాచారం. గతంలోనూ కవితను ఈడీ పలుసార్లు విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఆయనను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
(The above story first appeared on LatestLY on Mar 15, 2024 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

