Hyderabad, SEP 11: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ (CM kcr) రెడీ అవుతున్నారు. అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు స్పీడప్ చేశారు. ప్రగతిభవన్‌లో ఇవాళ కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామితో (HD Kumaraswamy) సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఉదయం ఓ హోటల్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఆయన.. తర్వాత ప్రగతిభవన్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసారు. జాతీయ రాజకీయాలతో పాటు.. బీజేపీని (BJP) ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ని సీఎం కేసీఆర్ పాట్నా వెళ్లి కలిశారు. ఇటు హైదరాబాద్‌లో జాతీయ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వరుస భేటీలు.. కంటిన్యూగా మీటింగులు పెడుతుండడంతో బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ నేషనల్ పార్టీని (KCR national Party) స్థాపించే ప్రయత్నాలు ఖాయంగానే కనిపిస్తోంది.
Former CM of Karnataka Sri @hd_kumaraswamy met with CM Sri K. Chandrasekhar Rao at Pragati Bhavan today.
They discussed various important issues including the role of regional parties in the current situation and the key role that CM KCR should play in national politics. pic.twitter.com/ehZbyCl0Gw
— TRS Party (@trspartyonline) September 11, 2022
టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారనుందని ఇప్పటికే అనఫీషియల్‌గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొన్నాళ్లుగా జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతుండటం.. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కుమారస్వామితో భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే డిసెంబర్‌లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బీజేపీ చేతిలో దారుణంగా దెబ్బతిన్న జేడీఎస్.. కొన్నాళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. బీజేపీ వ్యతిరేక ఎజెండానే ఇప్పుడు టీఆర్‌ఎస్, జేడీఎస్‌ను కలిసేలా చేశాయని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు దగ్గరపడటం.. నెక్ట్స్ ఏం చేయాలనే దానిపైనే ఇద్దరి మధ్యా చర్చ జరిగినట్లు పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు తో సమావేశమైన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి. pic.twitter.com/d76a1Tt3OY
— TRS Party (@trspartyonline) September 11, 2022
బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ని కేసీఆర్ కలిసిన తర్వాత.. కుమారస్వామి కూడా కలిశారు. నితీష్, కుమారస్వామి జాతీయ రాజకీయాలపైనే చర్చించినట్లు తెలిసింది. నితీష్ కూడా విపక్షాలను ఏకం చేసేందుకు విపక్ష నేతలను కలుస్తున్నారు. ఇటు.. కేసీఆర్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు.. ఈ నెలలోనే జాతీయ పార్టీని అనౌన్స్ చేసి మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు.
ఇందుకోసం పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు అన్నివర్గాల నుంచి సీఎం మద్దతును స్వీకరించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని జిల్లా అధ్యక్షులు కూడా తీర్మానించడంతో కేసీఆర్ మరింత స్పీడు పెంచారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే టార్గెట్‌గా కేసీఆర్ రాజకీయ పోరాటానికి దిగినట్లు గులాబీ శ్రేణులు ప్రకటించాయి. అందుకోసం తగిన కార్యాచరణ.. ఎన్డీయేతర పార్టీలతో సమావేశం వంటి అంశాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన విధంగానే.. దేశాన్ని బీజేపీని రక్షించేందుకు అదే వ్యూహాన్ని అమలు చేస్తారని టీఆర్‌ఎస్ శ్రేణులు చెప్తున్నాయి.