Hyderabad Metro Rail (Photo-wikimedia commons)

Hyderabad, OCT 07: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ (Metro services) గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో మెట్రో రైలు సేవల (Metro Services) సమయాన్ని పొడిగిస్తున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు పెంచారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (Metro Train) ఎండీ ఎన్‭వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. అయితే ఉదయం సమయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే ఇకపై కూడా ఉదయం 6 గంటలకు సంబంధిత టెర్మినల్ నుంచి మొదటి మెట్రో రైలు బయలుదేరుతుంది.

హైదరాబాద్ మెట్రోలో మూడు ప్రధానమైన లైన్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయ్‭దుర్గ్ వరకు (Blue Line) మరొకటి మియాపూర్ నుంచి ఎల్‭బీ నగర్ వరకు (RedLine) ఒక చివరిది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు (Green Line) మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 66.5 కిలోమీటర్ల పొడవున, మూడు లైన్లలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి.

Girl Dancing in Hyd Metro: వైరల్ వీడియో.. హైద‌రాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, కేసు నమోదు  

ప్రతిరోజు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా సమయం పెంచడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా రెడ్, బ్లూ లైన్లలో ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంది.